వరంగల్: రాష్ట్రస్థాయి సబ్‌జూనియర్ బాలికల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ జట్టు విజేతగా నిలిచింది. హన్మకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం ఏకపక్షంగా సాగిన ఫైనల్లో హైదరాబాద్ 12–6తో మహబూబ్‌నగర్‌పై విజయం సాధించింది. రెండు రోజుల పాటు జరిగిన ఈ టోర్నీ ముగింపు కార్యక్రమంలో సుబేదరి సీఐ సదయ్య ముఖ్య అతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హ్యాండ్‌బాల్ సంఘం కార్యదర్శి శ్యామల పవన్ కుమార్, రిటైర్డ్ డీఎస్‌డీఓ జి. శివ కుమార్, డీఎస్‌ఏ హ్యాండ్‌బాల్ కోచ్ విష్ణువర్ధన్, పీఈటీ రజిత, హరి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment