సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా విద్యార్థులు వెంటనే శ్రీనగర్ ఎన్‌ఐటీ క్యాంపస్‌ను ఖాళీ చేసి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనగర్‌లోని తెలుగు విద్యార్థులను క్షేమంగా ఢిల్లీకి తీసుకువచ్చేందుకు ఏపీ భవన్ అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఈ సందర్భంగా ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ.. కశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగే అవకాశం ఉందని ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసిందన్నారు. దాంతో ఎన్‌ఐటీ, కాలేజీ విద్యార్థులను హాస్టల్ ఖాళీ చేయిందని తెలిపారు. విద్యార్థులను తీసుకువచ్చేందుకు మూడు బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ రోజు అర్థరాత్రి వరకు విద్యార్థులు ఢిల్లీకి చేరుకుంటారని తెలిపారు. వారికి అవసరమైన వసతి, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment