
కుమారుడు లిఖిల్‌ను చూసి తల్లి అపర్ణ భావోద్వేగం, విద్యార్థిని రాధికను ముద్దాడుతున్న తల్లి
గన్నవరం: ఉక్రెయిన్ నుంచి శనివారం రాష్ట్రానికి చెందిన మరో 17 మంది విద్యార్థులు విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి, వైఎస్సార్, చిత్తూరు జిల్లాలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. వీరికి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పి.రత్నాకర్, డిప్యూటీ తహసీల్దారు ఎ.శ్రీనివాసరావు స్వాగతం పలికారు. విద్యార్థులు స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా ఏర్పాట్లు చేశారు.
వీరంతా పోలండ్, రొమేనియా దేశాల బోర్డర్ నుంచి ప్రత్యేక విమానాల్లో ముంబయి, ఢిల్లీకి చేరుకుని, అక్కడి నుండి ఇక్కడికి వచ్చారు. విద్యార్థులు రాధిక, నేహఫాతిమా, అడప లిఖిల్ తదితరులు మాట్లాడుతూ ఉక్రెయిన్‌లో తామంతా సుమారు 30 గంటల పాటు ఆహారం, తాగునీరు లేకుండా గడిపామని చెప్పారు. అతి కష్టంగా రైలు ప్రయాణం చేసి, మరో 12 కిలోమీటర్లు నడుచుకుంటూ బోర్డర్‌కు చేరుకున్నామన్నారు. అక్కడి నుంచి కేంద్ర, రాష్ట్రాల అధికారులు తమను అన్ని వసతుల మధ్య ఇక్కడికి తీసుకొచ్చారని కృతజ్ఞతలు తెలిపారు.
ఉక్రెయిన్ నుంచి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన తెలుగు విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment