
పూర్తి సన్నద్ధతతో అమెరికా రండి
తెలుగు విద్యార్థులకు సూచించిన తానా
సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థులు పూర్తి సన్నద్ధతతో అమెరికాకు రావాలని నార్త్ అమెరికా తెలుగు అసోసియేషన్(తానా) అధ్యక్షుడు వి.చౌదరి జంపాల సూచించారు. ఇటీవల కొందరు ఏపీ విద్యార్థులు అమెరికాలో ప్రవేశించకుండా స్టూడెంట్ వీసాను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, యూనివర్సిటీలు, ఎయిర్‌లైన్స్, ఇమ్మిగ్రేషన్ అధికారులు, ఇండియన్ ఎంబసీ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలతో కలసి ఈ సమస్యను పరిష్కరించడానికి తానా అధికారులు కృషి చేస్తున్నారు.
విద్యార్థు ఎవరైనా స్క్రీనింగ్ ప్రాసెస్‌లో ఇబ్బందులు పడితే వాటిని info@tana.orgకు మెయిల్ చేయాలని తానా సూచించింది. అదేవిధంగా అమెరికాలో సురక్షితంగా ఉండడానికి అనుసరించాల్సిన నియమాలు http://www.tana.org/helplineteamsquare/safetyguidelines వెబ్‌సైట్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.