భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
బ్రేకింగ్: భారత రాయబారి ఇంట్లో రాకెట్ పేలుడు
Published Tue, Jun 6 2017 2:11 PM | Last Updated on Tue, Sep 5 2017 12:57 PM
కాబూల్: అఫ్ఘానిస్థాన్ రాజధాని కాబూల్‌లోని భారత రాయబారి నివాసంలో రాకెట్ పేలడం కలకలం రేపింది. కాబూల్‌లోని భారత ఎంబసీ కాంపౌండ్‌లోని అతిథి గృహంలో రాకెట్ లాంచర్ ఒకటి దూసుకొచ్చి పేలింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని భారత విదేశాంగ శాఖ తెలిపింది.
భారత అతిథి గృహం కాంపౌండ్‌లో ఉన్న వాలీబాల్ మైదానంలో ఉదయం 11.45 గంటలకు రాకెట్ పేలుడు జరిగినట్టు తెలుస్తోంది. ఆ సమయంలో భారత దౌత్యవేత్త మన్‌ప్రీత్ వోహ్రాతోపాటు ఆయన నివాసంలో పనిచేసే సిబ్బంది కూడా ఇంట్లోనే ఉన్నారు. గతవారం కాబూల్‌లోని దౌత్య ప్రాంతంలో భారీ ఉగ్రపేలుళ్లు చోటుచేసుకొని 150మందికిపైగా మృతిచెందిన నేపథ్యంలో ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. అయినా భారత దౌత్యవేత్త నివాసంలో రాకెట్ లాంచర్ పేలుడం ఆందోళన రేపుతోంది.
Advertisement
Advertisement