తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్‌గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్‌గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్‌సైట్ (news.com.au) నివేదించింది.
ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే
అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్‌లో అందుకున్న 50 నెలల బోనస్‌తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటున్నాయి.
ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు!
ఈ ఎవర్‌గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్‌లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్ వెబ్‌సైట్ పేర్కొంది.
ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్
ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్‌గ్రీన్ 16.25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment