evergreen
-
ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..!
తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్‌గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్సైట్ (news.com.au) నివేదించింది. ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అందుకున్న 50 నెలల బోనస్‌తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటున్నాయి. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! ఈ ఎవర్గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్ వెబ్సైట్ పేర్కొంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్గ్రీన్ 16.25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది. -
సూయజ్‌లో ఎవర్ గివెన్ ప్రమాదానికి కారణం ఇదేనా?
సూయజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణ నౌక ఎవర్ గివెన్ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం సూయజ్ కెనాల్ అథారిటీదే అంటోంది ఆ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్. వాతావరణం సరిగా లేనప్పుడు ఎవర్ గివెన్ వంటి పెద్ద నౌకను కెనాల్లో ప్రయాణానికి అనుమతించడం సూయజ్ చేసిన తప్పుగా ఆ సంస్థ పేర్కొంది. నౌక తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవంటూ రికార్డులు చూపెడుతోంది. ప్రమాదానికి ముందు సూయజ్ కెనాల్ అథారిటీ, నౌకా సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణను సైతం వెల్లడించింది. భారీ నౌకల సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్‌ని సూయజ్ కెనాల్ అథారిటీ సరిగా పాటించలేదని ఎదురుదాడి చేస్తోంది. గత మూడు నెలలుగా ఎవర్గి వెన్ను సీజ్ చేసిందుకు గాను నష్టపరిహారంగా లక్ష డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సూయజ్ కాలువ ప్రమాదంపై ఇస్లామియా ఎకనామిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవర్‌గివెన్ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్ సంస్థ తన వాదనలు వినిపించింది. మార్చి 23న ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత రద్ధీ వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటైన సూయజ్ కెనాల్లో మార్చి 23న ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోయింది. నౌక ముందు వెనక భాగాలు కెనాల్ చెరో తీరాన్ని ఢీకొట్టాయి. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోవడంతో .. అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు వారం రోజులకు పైగా నిలిచిపోయాయి. టగ్ బోట్ల సాయంతో ఎట్టకేలకు ఎవర్ గీవెన్‌ను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఎవర్ గివెన్ నౌకను సీజ్ చేసింది సూయజ్ కెనాల్ అథారిటీ. నష్టపరిహారంగా 916 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. -
సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది సూయెజ్ కాలువలో ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. చాలాకాలంగా నౌకారవాణా ప్రాధాన్యత కొనసాగుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలావరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈజిప్ట్‌లోని సూయెజ్ కాలువకు అడ్డుపడి ఇరుక్కుపోయిన భారీ సరుకు రవాణా నౌక ఎవర్ గివెన్ వారంరోజుల పాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఎవర్ గివెన్ నౌక పొడవు 400 మీటర్లు (1,321 అడుగులు), బరువు 2 లక్షల టన్నులు. దీని గరిష్ట సామర్థ్యం 20 వేల సరుకుల కంటైనర్లు. సూయెజ్ కాలువకు అడ్డుపడిన ఘటనలో ఆ మార్గంలో ప్రయాణించే నౌకల ట్రాఫిక్‌ను ఈ భారీ నౌక పూర్తిగా అడ్డుకుంది. మార్చి 29 సోమవారం వేకువ జామున నౌక పాక్షికంగా కదలడంతో దాన్ని తిరిగి కాలువలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించినట్లయింది. ఇరుకైన ప్రాంతాలగుండా రవాణా షిప్పింగ్ పరిశ్రమ సకాలంలో సరుకులు చేరవేసే అత్యంత సమర్థవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంటుంది. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడిన కాలంలో చాలా దేశాలు నౌకల్లో పనిచేసేవారిని కీలకమైన సిబ్బందిగా పరిగణించేంతవరకూ ఈ లింక్ దాదాపుగా బయటకు కనిపించలేదు. నౌకా రవాణాలో సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాలు దిగ్బంధనకు గురైనప్పుడు సముద్ర వాణిజ్యం తప్పనిసరిగా ప్రతిష్టంభనకు గురికావలసిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో సుదీర్ఘ దూరాలకు నౌకల ద్వారా అన్నిరకాల సరుకుల రవాణా కారు చౌకగా సాధ్యపడుతుంటుంది. నౌకలో చేర్చిన సరుకుల ధరతో పోలిస్తే వాటి రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నౌకా రవాణా చార్జీలు అధికంగా ఉంటే అది ఆర్థికంగా మొత్తం మీద పెద్ద సమస్యగా మారుతుంది. కాకుంటే సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, చమురు శుద్ధి కర్మాగారాలకు నిత్యం ముడిచమురు అవసరం. ఫ్యాక్టరీలకు ముడిసరుకులు అవసరం. అమ్మడానికి షాపులకు సరుకులు అవసరం. ఇదొక గొలుసుకట్టుగా నడుస్తుంటుంది. భద్రతా ప్రమాదాలు సముద్రయానంలో భద్రతా ప్రమాదాలను అతిశయించి చెప్పడం సులభమే కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. సూయెజ్ కాలువలో ప్రతిష్టంభన నేపథ్యంలో ఆఫ్రికా చుట్టూ తిరిగి పోవలసిన మార్గంలో అదనంగా సముద్ర బందిపోట్ల ప్రమాదాన్ని మరీ అతిశయించి చూపుతున్నారని నా ఉద్దేశం. పైగా, అస్థిరతా ప్రాంతమైన సూయెజ్ కాలువ దక్షిణ కొసలో దిగ్బంధన కారణంగా వేచి ఉంటున్న షిప్పులు సముద్ర దొంగల దాడికి అనువుగా ఉంటున్నాయన్న వార్తలు పతాక శీర్షికలెక్కుతున్నాయి కూడా. ఎర్రసముద్రంలో నౌకా రవాణా కార్యక్రమాలకు కొంతమేరకు ప్రమాదం ఉండటం నిజమే కావచ్చు కానీ ఈ పరిస్థితులు రాత్రికిరాత్రే మారిపోవు. సూయెజ్ కాలువ గుండా సరుకుల నౌకల రవాణా కాన్వాయ్‌ల వారీగా సాగుతుంది కాబట్టి రవాణా నౌకలు ఎల్లప్పుడూ ఎంతో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా అన్ని నౌకలకు ప్రమాద స్థాయి ఒకే రకంగా ఉంటుంది కానీ నష్ట ఫలితాలు అనేవి నౌక రకం, సరుకులు, నౌకా యజమాని జాతి వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టే అనుకోని ప్రమాదాలను అధిగమించడానికి సముచిత చర్యలు తీసుకోవడానికి గాను పరిస్థితులకు అనుగుణమైన అప్రమత్తతో వ్యవహరించవలసి ఉంటుంది. భద్రత, రక్షణ భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా అదేవిధమైన సావధానతతో చూడాల్సి ఉంది. ఉగ్రవాద దాడుల వంటి ప్రమాదాలు అత్యధిక స్థాయిలో ఆర్థిక విచ్ఛిన్నతకు దారితీస్తాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలను అత్యంత ఘోర దురంతాలుగా చూపుతుంటారు. సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాల్లో ఇలాంటివాటినే నిర్దిష్ట ప్రమాద హేతువులుగా గుర్తిస్తుంటారు. ఇక భద్రతాపరమైన ప్రమాదాలు పతాక శీర్షికల్లో చోటు చేసుకోవు. నౌకల్లో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి కానీ ఇవి పెద్దగా చర్చనీయాంశాలు కావు. అయితే చాలా సందర్భాల్లో, భద్రత, రక్షణకు సంబంధించిన వాస్తవ చిక్కులు ఒకేరకంగా ఉంటాయి. నౌకల స్థితిస్థాపకతా శక్తిని పెంచేవిధంగా రూపొందిస్తూ యాజమాన్యాలు తీసుకునే చర్యలకు మరింత ప్రాధాన్యత లభించాల్సి ఉంటుంది. రక్షణకు సంబంధించిన ప్రమాదాలు చాలావరకు అస్థిరంగానూ, భద్రతకు సంబంధించిన ప్రమాదాలు మరింత గతిశీలంగానూ ఉంటాయి కనుక ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రమాదాల గురించి అప్రమత్తతను కలిగి ఉండటం కీలకం. సూయెజ్ కాలువలో జరిగిన ప్రమాదం చాలా అరుదైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది ఈ ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలుగా నౌకా రవాణా ప్రాధాన్యత కొనసాగుతూ ఉంటూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలా వరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. మానవ నిర్మితమైన సూయెజ్ కెనాల్‌తో సహా ఇలాంటి ఇరుకైన జలమార్గాలతో పాటు పర్షియన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదా మాలే ద్వీపకల్పం, ఇండోనేషియాలోని సుమత్రా దీవి మధ్య ఉండే మలక్కా జలసంధి వంటి సహజ జలమార్గాలు కూడా కీలకమైన సముద్ర మార్గాలుగా ఉంటున్నాయి. వీటి గుండా వాణిజ్య నౌకలు పయనించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు సరఫరాలో జాప్యం, నౌకా రవాణా చార్జీలు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. చమురు మార్కెట్లో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. కంటైనర్ షిప్పుల విషయానికి వస్తే, ఇప్పటికే కోవిడ్–19 సంబంధిత అంతరాయాలతో కల్లోల పరిస్థితిలో ఉన్నం దున తాజా ఘటన మరింత విషమ పరిస్థితులను నెలకొల్పుతుంది. షిప్పింగ్ పరిశ్రమపై, దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్యంపై వాణిజ్య ప్రభావాలు ఇప్పటికే గుర్తించదగిన స్థాయిలో ఉంటున్నాయి. పైగా షిప్పింగ్ పరిధికి మించి అనేక రంగాల్లో దీని పర్యవసానాలు ప్రపంచం అనుభవంలోకి రానున్నాయి. సూయెజ్ కాలువ గుండా నౌకా రవాణాకు ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా ఖండం చుట్టూ సుదీర్ఘంగా సాగిపోయే మార్గం ఒకటుంది. పైగా ఇటీవల సంవత్సరాల్లో వాణిజ్య నౌకల కార్యనిర్వాహకులకు సముద్ర దొంగల దాడి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటగా సోమాలియా తీరప్రాంతం.. తర్వాత ఇటీవల గల్ఫ్ ఆఫ్ గినియా ఇందుకు ఉదాహరణలు. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ఎదురవుతున్న సముద్ర దొంగల దాడుల గురించి కొన్ని షిప్పింగ్ కంపెనీలు ఇప్పటికే ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇటీవల సంవత్సరాల్లో సోమాలియా కేంద్రంగా సాగుతున్న సముద్ర బందిపోట్ల దాడులను కాస్త అణచివేశారు తప్పితే పూర్తిగా ఓడించలేదని షిప్పింగ్ పరిశ్రమ సంస్థలు, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు సూచించాయి. అదే సమయంలో హిందూ మహాసముద్రం గుండా దక్షిణాఫ్రికా వైపు నౌకా ప్రయాణంతో పోలిస్తే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా సూయెజ్ కెనాల్ వైపు పయనించే నౌకలకు సముద్ర దొంగల నుంచి ఎదురవుతున్న ప్రమాదం ఏమంత తక్కువ స్థాయిలో ఉండటం లేదు. కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ని దాటిన తర్వాత యూరప్ చేరవలసిన నౌక సెనెగల్, కేబో వర్డే మధ్య ఉన్న ఇరుకు జలమార్గం గుండా పయనించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లే ఏ నౌక అయినా సరే పశ్చిమాఫ్రికాలో సముద్ర బందిపోట్లతో తలపడాల్సి ఉంది. పైగా ఆఫ్రికా చుట్టూ మరింత దగ్గర మార్గంలో వెళ్లాలనుకుంటే నైజీరియా నుంచి వెయ్యి నాటికల్ మైళ్ల దూరంలో రవాణా నౌకలు పయనించి తీరాల్సి ఉంటుంది. డిర్క్ సీబెల్స్ వ్యాసకర్త పీహెచ్డీ (సముద్ర భద్రత) స్కాలర్ గ్రీన్విచ్ యూనివర్సిటీ -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
పెళ్లికి పూలొచ్చాయి
పెళ్ళిళ్లలో పువ్వుల అలంకారాలు వేదికకు అందం తెస్తాయి.పెళ్లికి పూలే నడిచొస్తేప్రాంగణమే పూల పల్లకి అవుతుంది.పెళ్లికి వెళ్లండి..పూలకరించండి. ►ప్రముఖ జాతీయ ఫ్యాషన్ డిజైనర్ సబ్యసాచి ముఖర్జి పువ్వుల ప్రింట్లున్న ఫ్యాబ్రిక్స్‌తో వేడుకకు తీసుకొచ్చిన కొత్త హంగుల దుస్తులు. ►రా సిల్క్, నెటెడ్ కాంబినేషన్ లెహెంగా వేడుకకు ఎవర్గ్రీన్ అయితే, దాని మీద పువ్వుల హంగులు కొత్త సింగారాలనుఅద్దుకున్నాయి. ►వివాహ వేడుక అనగానే పట్టు దుస్తుల వైపుగా ఎంపికలు మొదలుపెడతారు. కానీ, ఇలా పువ్వుల విరిబోణిలా కనిపించేదే అరుదైన అందం. ►పువ్వుల ప్రింట్లు ఉన్న నెటెడ్ ఫ్యా్రబ్రిక్ను లెహంగాకు ఎంచుకొని, దానికి ప్లెయిన్ రా సిల్క్ క్రాప్‌టాప్, నెటెడ్ దుపట్టాను ను జత చేస్తే వేడుకలో హైలైట్. ►క్రీమ్ కలర్ నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద ప్రింట్లు, ఎంబ్రాయిడరీ చేసిన పువ్వులు కొత్త అందాలను సింగారించుకున్నాయి. ►ఇండోవెస్ట్రన్ స్టైల్ దుస్తులకు పువ్వుల హంగామాలు జత అవ్వాలి. అందుకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న లెహంగా, క్రాప్‌టాప్ ధరిస్తే చాలు గెట్ టు గెదర్ పార్టీకి గ్రాండ్ లుక్ వస్తుంది. ►పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ సిల్క్ మెటీరియల్‌తో డిజైన్ చేసిన లెహంగా, దానికి పువ్వుల రంగులో నెటెడ్ దుపట్టా, స్లీవ్‌లెస్ బ్లౌజ్ జత చేస్తే వచ్చే అందమే వేరు. ►టాప్ టు బాటమ్ ముదురు నీలం రంగు లంగా ఓణీ ఓ ఆకర్షణ అయితే, దాని మీద ఒదిగిన పువ్వుల జిలుగులు వేడుకలో వేల రెట్లు కాంతులే. ►మఖమల్ క్లాత్ అంటేనే గ్రాండ్నెస్కు సిసలైన చిరునామా. మెరూన్ కలర్ వెల్వెట్ ఫ్యాబ్రిక్ మీద బంగారు, వెండి జరీ పువ్వుల వెలుగులు వేడుకంతా సందడి చేస్తూనే ఉంటాయి. -
తెలంగాణ సస్యశ్యామలానికే మహారాష్ట్ర ఒప్పందం
కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు ఒరిగిందేమీ లేదు సంబరాల్లో రైతులు ఉంటే నిరసనలకు దిగటం సరికాదు ఖమ్మం వైరారోడ్ : మహరాష్ట్ర– తెలంగాణ రాష్ట్రాల మధ్య గోదావరి నదిపై మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి తుది ఒప్పందం ద్వారా తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కాబోతుందని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు ఎస్.బీ. బేగ్ అన్నారు. మంగళవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్టాన్ని కరువు కాటకాలు, రైతుల కన్నీళ్ల నుంచి కాపడటం కోసం సీఎం కేసీఆర్ తీవ్రంగా కృషిచేస్తున్నారని తెలిపారు. తెలంగాణ ప్రాంతాన్ని కోటి ఎకరాల మాగాణి చేసే ప్రయత్నంలో ఈ ఒప్పందం ముందడుగని పేర్కొన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ పాలనలో శంకుస్థాపనలకే పరిమితమయ్యారని,ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో మహరాష్ట్రతో ఒప్పందం చేసుకోవటానికి కనీస ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ప్రభుత్వం కృషి ఫలితంగా ఒక పక్క రైతులు సంబరాలు చేసుకుంటుంటే, కాంగ్రెస్ పార్టీ నిరసనలకు దిగటం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమావేశంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు,టీఆర్ఎస్ నాయకులు బిచ్చాల తిరుమలరావు పాల్గొన్నారు. -
రోహన్ డబుల్ సెంచరీ మిస్
► గుజరాతీ, ఎవర్గ్రీన్ మ్యాచ్ డ్రా ► ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ హైదరాబాద్: ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్‌లో గుజరాతీ, ఎవర్గ్రీన్ మ్యాచ్ డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆటలో ఎవర్గ్రీన్ బ్యాట్స్‌మన్ రోహన్ యాదవ్ (261 బంతుల్లో 199; 25 ఫోర్లు) పరుగు తేడాతో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. గురువారం మ్యాచ్ నిలిచే సమయానికి ఎవర్గ్రీన్ తొలి ఇన్నింగ్స్‌లో 118 ఓవర్లలో 478 పరుగులు చేసి ఆలౌటైంది. అజ్మత్ ఖాన్ (87), జితేందర్ త్యాగి (43) రాణించారు. గుజరాతీ బౌలర్ ప్రణీత్ రెడ్డికి 4 వికెట్లు దక్కాయి. మొదట బ్యాటింగ్ చేసిన గుజరాతీ జట్టు 519/9 స్కోరు వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. గుజరాతీ జట్టుకు 41 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. మొత్తానికి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో గుజరాతీ ఖాతాలో 10 పాయింట్లు, ఎవర్గ్రీన్ ఖాతాలో 5 పాయింట్లు చేరాయి. ఇతర మ్యాచ్‌ల స్కోర్లు ఎంపీ కోల్ట్స్ తొలి ఇన్నింగ్స్: 227 (సయ్యద్ అహ్మద్ 5/47), కేంబ్రిడ్జ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 341, ఎంపీ కోల్ట్స్ రెండో ఇన్నింగ్స్: 219 (సయ్యద్ అహ్మద్ 3/13), కేంబ్రిడ్జ్ రెండో ఇన్నింగ్స్: 120/2 (తనయ్ త్యాగరాజన్ 38, విక్రాంత్ 48 నాటౌట్). ఎస్సీ రైల్వే తొలి ఇన్నింగ్స్: 137, కాంటినెంటల్ తొలి ఇన్నింగ్స్: 63, రైల్వే రెండో ఇన్నింగ్స్: 141 (వంశీకృష్ణ 79; లలిత్ మోహన్ 5/45), కాంటినెంటల్ రెండో ఇన్నింగ్స్: 93 (బాషా 6/30, సుధాకర్ 3/29). గౌడ్స్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 273, జెమినీ ఫ్రెండ్స్ తొలి ఇన్నింగ్స్: 357 (అబ్దుల్ ఖురేషీ 75; అనిరుధ్ శ్రీవాస్తవ్ 6/87, రిషబ్ శర్మ 3/71), గౌడ్స్ రెండో ఇన్నింగ్స్: 160 (బిక్షపతి 46; సతీశ్ 3/28, సంకేత్ 3/51). జెమినీ ఫ్రెండ్స్ రెండో ఇన్నింగ్స్: 79/2. రెండో రోజు: స్పోర్టింగ్ ఎలెవన్ తొలి ఇన్నింగ్స్: 349 (చిరాగ్ పాఠక్ 96, మాన్సింగ్ రమేశ్ 73), ఆర్.దయానంద్ తొలి ఇన్నింగ్స్: 244/4 (భగత్ వర్మ 53 బ్యాటింగ్, కుశాల్ పర్వేజ్ జిల్లా 84 బ్యాటింగ్). -
హరితం.. క్షేమకరం
పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు మర్పల్లి: హరతిహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కమలమ్మ, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ముందుగా గ్రామంలోని పీతాంబరేశ్వర ఆలయం వద్ద 100 చింత చెట్లు, రావులపల్లి నుంచి మర్పల్లికి వెళ్లే పంచాయత్ రాజ్ రోడ్డు ప్రక్కల వేర్వేరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకొనేందుకు వెంటనే మొక్కల చుట్టూ కంచె నాటాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. నేడు నాటిన ప్రతి మొక్క భవిష్యత్తులో మహావృక్షాలుగా మారుతాయన్నారు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కములమ్మ, డీఈ రాజ్‌కుమార్, ఏఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, ఈఓపీఆర్డీ అశోక్‌కుమార్, ఏపీఓ శంకర్, ఏపీఎం మధుకర్, వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, నాయకులు నారాయణ్‌రెడ్డి, రమేష్సాగర్, జైపాల్, శ్రీకాంత్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయత్‌రాజ్ డివిజన్ సిబ్బంది రాజశేఖర్, జగన్మోహన్రెడ్డి, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ రాజు, పంచాయతీ కార్యదర్శి సంగారెడ్డి, ఫారెస్టు సెక్షన్ అధికారి వెంకటేశ్వర్లు గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు. -
కృష్ణా, గోదావరితో జిల్లా సస్యశ్యామలం
♦ పాలమూరు, డిండి, ప్రాణహితతో సాగులోకి 4.35 లక్షల ఎకరాలు ♦ సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలది అనవసర రాద్ధాంతం ♦ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ♦ జిల్లా ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : కృష్ణా, గోదావరి జలాలతో రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. పాలమూరు- రంగారెడ్డి, చేవెళ్ల- ప్రాణహిత, డిండి ప్రాజెక్టుల ద్వారా 4.35 లక్షల ఎకరాలను స్థిరీకరిస్తామని చెప్పారు. సోమవారం శాసనసభ ఆవరణలోని కమిటీ హాల్లో మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి జిల్లా ఎమ్మెల్యేలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సాగునీటి రంగ ప్రాజెక్టులపై అనుమానాలను నివృత్తి చేసిన ఆయన.. పాలమూరు- రంగారెడ్డి పథకం కింద 2.75 లక్షల ఎకరాలను సాగులోకి తేనున్నట్లు చెప్పారు. గత పాలకులు కేవలం 2.10 లక్షల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు చేసి అనుమతులు లేకుండా పనులు ప్రారంభించారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని దుయ్యబట్టారు. పాలమూరు ప్రాజెక్టులో భాగంగా వికారాబాద్‌కు 35వేలు, పరిగి 38వేలు, తాండూరు 98వేలు, చేవెళ్లకు 27వేలు, ఇబ్రహీంపట్నంకు 25,400, రాజేంద్రనగర్ 6,600 ఎకరాలకు సేద్యపు నీరు అందించి తీరుతామని స్పష్టం చేశారు. డిండి ప్రాజెక్టుతో ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలను సాగులోకి తేనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. ప్రాణహిత -చేవెళ్ల ద్వారా మేడ్చల్‌లో 6వేల ఎకరాలను స్థిరీకరిస్తామని, మేటిగడ్డ ప్రాజెక్టు నీరు అందదనే అపోహ వద్దని అన్నారు. జిల్లాలో చెరువులు, చిన్న నీటి వనరుల పథకాలను పునరుద్ధరించడం ద్వారా సాగునీటి వనరులను పెంపొందిస్తామన్నారు. మూసీనది విస్తరణతో జిల్లాలోని మేడ్చల్ నియోజకవర్గానికి మేలు జరుగుతుందన్నారు. నారాయణరావు ఛానల్ మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్యేలు సంజీవరావు, వివేక్, కిషన్‌రెడ్డి, యాదయ్య, గాంధీ, తీగల కృష్ణారెడ్డి, ప్రకాశ్‌గౌడ్, గాంధీ, సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గాలేరు-నగరి పనులు పూర్తి చేస్తేనే సస్యశ్యామలం
ఎమ్మెల్యే ఆది స్పష్టీకరణ జమ్మలమడుగు: రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సుఖంగా ఉండాలన్నా, వారి భూములు సస్యశ్యామలం కావాలన్నా గాలేరు-నగరి వరదకాలువ పనులను వెంటనే పూర్తిచేయాలని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలో దెబ్బతిన్న శనగ పంటలను ఏడీఏ అనిత, వ్యవసాయాధికారి రాంమోహన్‌రెడ్డి, రైతులతో కలిసి పరిశీలించారు. ఈసందర్భంగా ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో రైతులు వేసిన శనగ పంట ఇటీవల కురిసిన వర్షానికి దెబ్బతినడంతో పూర్తిస్థాయిలో దిగుబడి తగ్గి రైతులకు నష్టాలు మాత్రమే మిగిలాయన్నారు. ప్రతి యేటా రాయలసీమ ప్రాంతంలో వర్షాధారంపై సాగుచేస్తున్న రైతులు నష్టపోవలసి వస్తున్నదన్నారు.రైతుల క ష్టాలు,రాయలసీమ ప్రాంతంలోని ప్రజలకు తాగునీటి సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే కర్నూలు జిల్లాలో మిగిలిన పనులకు రూ. 1500 కోట్లు కేటాయించి పనులను పూర్తిచేయాలన్నారు. అదేవిధంగా పొలవరం ప్రాజెక్టును పూర్తి చేసి ఆనీటిని నాగార్జున సాగర్‌కు మళ్లించి శ్రీశైలం నుంచి వచ్చే జలాలను రాయలసీమ వాసులు వాడుకునేందుకు చర్యలను చేపట్టాలన్నారు. కర్నూలుజిల్లా ఆవుకు నుంచి గండికోట ప్రాజెక్టు వరకు గాలేరు-నగరి వరదకాలువతో పాటు, టన్నెల్ కూడ పూర్తయిందన్నారు. అయితే దాదాపు 20కిలోమీటర్లమేర పూర్తికాకపోవడంతో మిగులు జలాలను పూర్తిస్థాయిలో వాడుకోలేకపోతున్నామన్నారు. ప్రతి ఏడాది కృష్ణ వరద జలాలు సముద్రంలో కలుస్తున్నాయని ఈ నీటిని వాడుకుంటే రాయలసీమ ప్రాంతం అంతా సస్యశ్యామలం కావడంతో పాటు ప్రజలకు తాగునీటి అవసరాలు కూడా తీరుతాయని సూచిం చారు. ఈ కార్యక్రమంలో మైలవరం జెడ్పీటీసీ సుబ్బిరామిరెడ్డి, నాయకులు కేవీ కొండారెడ్డి, రైతులు గురప్ప, శివారెడ్డి, రవీంధ్రనాథరెడ్డి పాల్గొన్నారు. -
ఇంజనీరింగ్.. ఎవర్గ్రీన్
ఇంజనీరింగ్.. దేశంలో అత్యధిక మంది విద్యార్థులు ఎంచుకుంటున్న వృత్తి విద్యా కోర్సు.. దేశ వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి దాదాపు 3,500కు పైగా కాలేజీలు.. పదుల సంఖ్యలో బ్రాంచ్‌లు.. లక్షల్లో విద్యార్థులు.. వెరసి మరే కోర్సుకు లేనంత ఆదరణనుఇంజనీరింగ్ సొంతం చేసుకుంది.. ఇంతలా ఇంజనీరింగ్ యువత కలల వేదికగా మారడానికి ఏయే అంశాలు ప్రాతిపదికగా నిలుస్తున్నాయి.. అసలు ఇంజనీరింగ్‌లో చేరడం వల్ల ఒనగూరే ప్రయోజనాలేమిటి.. తదితర అంశాలపై నిపుణుల అభిప్రాయాలు.. ఉన్నత స్థానాల్లోకి.. త్వరగా ఆధునిక కోర్సుల్లో ఇంజనీరింగ్ విద్యకు ఉన్నంత గుర్తింపు ప్రపంచవ్యాప్తంగా మరే కోర్సుకు లేదని చెప్పొచ్చు. వస్తున్న మార్పులకనుగుణంగా అన్ని రకాల సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు సిలబస్‌లో ప్రవేశపెట్టడం ద్వారా ఇంజనీరింగ్ కోర్సు నవ్యతను సంతరించుకుంటుంది. తద్వారా సంప్రదాయ, ఆధునిక అంశాల కలయికగా ఇంజనీరింగ్ రూపాంతరం చెందింది. తద్వారా ఉపాధి పరంగా అవకాశాలు మెరుగవుతున్నాయి. ఉన్నతవిద్య విషయానికొస్తే.. మరే కోర్సుకు లేనంత సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) ఇంజనీరింగ్ సొంతం. ఎందుకంటే సంబంధిత బ్రాంచ్‌లో వివిధ స్పెషలైజేషన్స్‌తో ఎంఈ/ ఎంటెక్ వంటి కోర్సులను అభ్యసించవచ్చు. అంతేకాకుండా మేనేజ్మెంట్పై ఆసక్తి ఉంటే ఎంబీఏ/ పీజీడీఎం వంటి కోర్సులను ఎంచుకోచ్చు. తద్వారా టెక్నికల్ రంగంలోనేకాకుండా మేనేజ్మెంట్ రంగంలో కూడా ఉన్నత స్థానాల్లో స్థిరపడే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, నోకియా సీఈవో రాజీవ్ సూరి వరకు అగ్రస్థానంలో ఉన్న అన్ని కంపెనీ సీఈవోల్లో అత్యధిక శాతం మంది ఇంజనీరింగ్ నేపథ్యం ఉన్న వారే కావడం గమనార్హం. ఇంజనీరింగ్‌లో ఏబ్రాంచ్లోనైనా సబ్జెక్ట్ పరిధి విస్తృతం. నూతన ఆలోచనలు, ఆవిష్కరణలు వంటివి నేడు ప్రతి రంగంలో తప్పనిసరిగా మారిన నేపథ్యంలో ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉన్నత విద్య మంచి అవకాశంగా నిలుస్తోంది. నాసా, మైక్రోసాఫ్ట్, రోల్స్‌రాయిస్, ఎయిర్‌బస్, బ్లాక్ బెర్రీ.. ఇలా ఏ కంపెనీ అయినా సృజనాత్మకత, సమస్యా సాధన నైపుణ్యం ఉన్న ఇంజనీర్లకు పెద్దపీట వేస్తున్నాయి. ఇటువంటి నైపుణ్యాలను పెంచుకోవడానికి ఇంజనీరింగ్ పీజీలు చక్కని వేదికలు. గమనించాల్సిన మరో అంశం.. ఇంజనీరింగ్ అభ్యర్థులు వృత్తి పరంగా కూడా ఉన్నత స్థానాలకు త్వరగా చేరుకోవచ్చు. ఎందుకంటే విధుల్లో భాగంగా.. ఒక సమస్యను విశ్లేషించడం, పరిష్కరించడం వంటి అంశాలపై పని చేయాల్సి ఉంటుంది. తద్వారా నైపుణ్యాలు, సామర్థ్యాలు ప్రపంచానికి తెలుస్తాయి. అంతేకాకుండా ఉద్యోగుల మధ్య ఉండే పోటీతత్వం కూడా నిపుణులుగా (ప్రొఫెషనల్స్) ఎదగడానికి దోహదం చేస్తుంది. ఉద్యోగంపై ఆసక్తి లేకుంటే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా స్థిరపడే క్రమంలో కావల్సిన పరిజ్ఞానం, నైపుణ్యాలను అందించడంలో ఇంజనీరింగ్ కోర్సుది ప్రత్యేక ఒరవడి.-డాక్టర్ బి. సుధీర్ ప్రేమ్ కుమార్,ప్రొఫెసర్ అండ్ హెడ్ (మెకానికల్),జేఎన్టీయూ-హైదరాబాద్. శాస్త్రీయ విజ్ఞానం సామాజిక అవసరాలకు చురుగ్గా, సమాజం పట్ల బాధ్యతతో వ్యవహరించే గుణం ఉన్న విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుకు సరిగ్గా సరిపోతారు. ఇంజనీర్లకు సామాజిక బాధ్యత కూడా ఉంటుంది. ప్రాచీన కాలం నుంచి సమాజానికి ఉపయోగపడే ఎన్నో పనులకు ఇంజనీర్లే ఆద్యులుగా నిలుస్తున్నారు. శాస్త్రీయ విజ్ఞానాన్ని సామాజిక అవసరాలకు అన్వయించడంలో ఇంజనీర్లు ఎప్పుడూ ముందుంటున్నారు. అవసరాల నుంచి సౌకర్యం వరకు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడంలో ఇంజనీర్లదే ప్రధాన భూమిక. రవాణా, రక్షణ, విద్య, వైద్యం, ఇలా ప్రతి రంగంలో మానవ జీవితాన్ని సౌకర్యవంతంగా మలిచే విధంగా నూతన టెక్నాలజీలను ఆవిష్కరించడంలో ఇంజనీర్లు ఎప్పుడే ముందే ఉంటున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మానవాళిని వేధిస్తున్న వ్యాధులు, ఆకలి, కాలుష్యం, శక్తి వంటి అనేక సమస్యలకు పరిష్కారం చూపడంలో ఇంజనీర్ల పాత్ర కీలకంగా మారుతోంది. ఇంజనీరింగ్.. వివిధ శాస్త్రాలతో సహ సంబంధాన్ని కలిగి ఉంటుంది. తద్వారా ప్రపంచంలో ఎన్నో విషయాలకు సమాధానం ఇంజనీరింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఉదాహరణకు సంప్రదాయ ఇంధన వనరులకు ప్రత్యామ్నాయంగా ఇతర వనరులను సూచించడం. అంతేకాకుండా సమాజంలో శాస్త్రీయ విజ్ఞానం పట్ల ఆసక్తి పెంచడంలో కూడా ఇంజనీర్లు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాబట్టి సమాజానికి ఇంజనీర్ అవసరమనే కోణంలో కూడా ఇంజనీరింగ్ కోర్సు తన ప్రాముఖ్యతను చాటుకుంది.-ఇ. శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్,కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-ఏఎన్‌యూ. ఆవిష్కరణలకు.. అవకాశాలకు కేరాఫ్ ఇంజనీరింగ్ కోర్సు దశాబ్దాల నుంచి నిత్యనూతనంగా మనుగడ సాగిస్తున్న కోర్సు. ప్రస్తుత ఆధునిక కాలంలో ఈ కోర్సు ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. కారణం వ్యాపార, ఉత్పత్తి రంగాల్లో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవశ్యకమవుతోంది. రోజుకో కొత్త ఉత్పత్తి వినియోగదారుల ముందు ఉంటోంది. ఈ కొత్త ఉత్పత్తుల తయారీ వెనుక ఎంతో శ్రమ, పరిశోధన ఇమిడి ఉంటాయి. ఇదే క్రమంలో వీటికి సంబంధించి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా విస్తృతమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్ అండ్ డీ, కొత్త ఆవిష్కరణలకు మార్గం వేసే కోర్సు ఇంజనీరింగ్. అందుకే అటు పరిశ్రమ వర్గాల నుంచి, ఇటు విద్యార్థుల నుంచి ఈ కోర్సుకు ఆదరణ ఏటేటా పెరుగుతోంది. ఇంజనీరింగ్ ఎవర్గ్రీన్ అనేది నిస్సందేహం. కానీ.. దీనికి అదనంగా విద్యార్థులు కూడా నైపుణ్యాల సాధనకు తీవ్రంగా కృషి చేయాలి. నాలుగేళ్ల కోర్సులో ప్రతి రోజు పకడ్బందీ ప్రణాళికతో సాగాలి. అప్పుడే కోర్సులో చేరిన ఉద్దేశం నెరవేరుతుంది. ప్రస్తుత మార్కెట్ ట్రెండ్ ప్రకారం అధిక శాతం విద్యార్థుల్లో కంప్యూటర్ సైన్స్ క్రేజీ బ్రాంచ్‌గా నిలుస్తున్నప్పటికీ.. కోర్ బ్రాంచ్‌లతో(సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్) సుదీర్ఘ భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఇంటర్ డిసిప్లినరీ అప్రోచ్‌కు ప్రాధాన్య పెరిగింది. ప్రతి రంగంలోనూ రెండు విభాగాల కలయికతో ఉత్పత్తులు ఆవిష్కృతమవుతున్నాయి. ఉదాహరణకు.. మెకానికల్ విభాగాన్నే పరిగణనలోకి తీసుకుంటే.. కార్ల తయారీలో మెకానికల్‌తోపాటు సాఫ్ట్వేర్ నైపుణ్యం కూడా అవసరమవుతోంది. కాబట్టి విద్యార్థులు ఇంటర్ డిసిప్లినరీ దృక్పథం అలవర్చుకుంటే అవకాశాలు రెట్టింపు చేసుకోవచ్చు. ప్రస్తుతం అన్ని కంపెనీలు సబ్జెక్ట్ ఫండమెంటల్స్‌పై పట్టు వంటి అకడెమిక్ నైపుణ్యాలతోపాటు, కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ (మానసిక సామర్థ్యం)పై ప్రత్యేకంగా పరీక్షిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని కమ్యూనికేషన్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీ స్కిల్స్ పెంచుకోవడానికి కృషి చేయాలి. ఇవి సిలబస్‌లో ఉండవు. ఏ బ్రాంచ్ అయినా మార్కెట్ ఒడిదుడుకులతో సంబంధం లేకుండా ఉపాధి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సులో చేరే విద్యార్థులు నాలుగేళ్ల తర్వాత పరిస్థితుల గురించి ఆలోచిస్తూ.. ఆందోళన చెందకుండా అకడెమిక్స్‌పై పరిపూర్ణత దిశగా కృషి చేస్తే అవకాశాలు వాటంతటవే సొంతమవుతాయి.- ప్రొఫెసర్ పి. రవికుమార్,ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ (ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్)నిట్-వరంగల్ ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్ ఇంజనీరింగ్ కోర్సులో చేరిన విద్యార్థుల ముందు ఎన్నో అవకాశాలు. ఇతర కోర్సులతో పోల్చితే ఈ కోర్సులో విద్యార్థులకు తమ ఆసక్తి అనుగుణంగా స్పెషలైజేషన్స్‌ను ఎంచుకోవచ్చు. తద్వారా చక్కని అవకాశాలను అందుకోవడమేకాకుండా ఉన్నత స్థానాల్లో స్థిరపడొచ్చు. ఇంజనీరింగ్‌లో దాదాపుగా 25కుపైగా బ్రాంచ్‌లు ఉంటాయి. కేవలం సంప్రదాయ బ్రాంచ్లకే పరిమితం కాకుండా మారుతున్న అవసరాలకనుగుణంగా నూతన బ్రాంచ్‌లను కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రస్తుతం సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్, మెటలర్జీ, ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ వంటి బ్రాంచ్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇందులో కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ అభ్యర్థులకు అవకాశాలు పుష్కలం. ఈ రెండు రంగాలు వేగంగా అభివృద్ధి దిశలో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో వచ్చే దశాబ్దంలో సంబంధిత రంగాల్లో అవకాశాలు రెట్టింపవుతాయి. ఇంజీనిరింగ్ విద్యార్థులకు ఉన్న సౌలభ్యం ఏమిటంటే ఏ బ్రాంచ్ విద్యార్థులైనా కంప్యూటర్ రంగంలో స్థిరపడొచ్చు. నైపుణ్యాలు ఉంటే చాలు తగిన శిక్షణ ఇచ్చి సాఫ్ట్వేర్ సంబంధిత సంస్థలు ఇతర బ్రాంచ్‌ల విద్యార్థులను కూడా రిక్రూట్ చేసుకుంటున్నాయి. అదేవిధంగా ప్రభుత్వాలు విద్యుత్, సివిల్ (మౌలిక వసతులు) రంగాలకు పెద్ద ఎత్తున ప్రాధాన్యతినిస్తున్నాయి. దాంతో సంబంధిత మానవ వనరులకు డిమాండ్ ఏర్పడుతోంది. బయోటెక్నాలజీ, కెమికల్ రంగాలకు సంబంధించి వచ్చే దశాబ్దం ఎంతో కీలకమైంది. పెరుగుతున్న పరిశోధనలు, ప్రభుత్వ ప్రోత్సహం కారణంగా ఈ రంగం స్వరూపం పూర్తిగా మారే అవకాశం ఉంది. తద్వారా విస్తృత ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఈ అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకుంటే ఇంజనీరింగ్‌లో ఏ బ్రాంచ్‌లో చేరినా అవకాశాల విషయంలో నిశ్చింతంగా ఉండొచ్చు. ఇటువంటి సరళత్వం (ఫ్లెక్సిబిలిటీ) కేవలం ఇంజనీరింగ్ కోర్సుకే సాధ్యం. కాబట్టి విద్యార్థులు తమ ఆసక్తి, సామర్థ్యాలకు సరిపోయే బ్రాంచ్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ఒక్క విషయాన్ని గమనంలోకి తీసుకోవాలి. అవకాశాలను అందుకోవాలంటే మాత్రం కోర్సులో చేరిన మొదటి రోజు నుంచే సంబంధిత నైపుణ్యాలను పెంచుకోవడంపై దృష్టి పెట్టాలి. ఇంజనీరింగ్ కోర్సులో ఒక నైపుణ్యం నుంచి మరో నైపుణ్యంలోకి త్వరగా మారాల్సి ఉంటుంది. ఉదాహరణకు సమస్య సాధన నుంచి దాన్ని విశ్లేషించే వరకు వివిధ నైపుణ్యాలతో అవసరం ఉంటుంది. కాబట్టి ఇంజనీరింగ్ విద్యార్థుల్లో మేథో సామర్థ్యం కూడా పెరుగుతుంది.-ప్రొఫెసర్ పి. ఎస్. అవధాని, ఇన్చార్జ్ ప్రిన్సిపాల్,ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్-విశాఖపట్నం. -
కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి
అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టి కురుక్షేత్ర సంగ్రామానికి నాంది పలికిన శకునిలా, రెండు ప్రాంతాలను వేరుచేసి మరో కురుక్షేత్ర యుద్ధానికి తెరదీస్తున్న ఆడ శకుని సోనియాగాంధీ అని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి తీవ్రంగా దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా శనివారం తిరుపతి అన్నారావు సర్కిల్ వద్ద కరుణాకరరెడ్డి నేతృత్వంలో వేల మందితో మహిళా భేరి నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ విభజన జరిగితే తాగునీరు, సాగునీరు లేక రాయలసీమ ప్రజలు అలమటించాల్సి వస్తుందని తెలిపారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాంధ్ర ఎంపీలు చోద్యం చూస్తున్నారని ఆరోపించారు. సాక్షి, తిరుపతి: రాష్ట్ర విభజన ప్రకటనకు నిరసనగా తిరుపతి అన్నారావు సర్కిల్లో శనివారం వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో దాదాపు ఏడువేలమంది మహిళలతో మహిళా భేరి జరిగింది. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాల్సిందేనని మహిళలు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి మాట్లాడుతూ విభజన జరిగితే తెలంగాణలో కృష్ణ, గోదావరి నదులపై ఆనకట్ట కడతారని, దీంతో సీమాంధ్రలో వ్యవసాయ భూములు బీళ్లవుతాయన్నారు. రాయలసీమవాసులు ఉలవలు తిని బతకాలని, తాగునీటి కోసం అలమటించాల్సి వస్తుందని తెలిపారు. మహిళలు వంటకు కన్నీళ్లనే వాడుకోవాల్సి దుస్థితి దాపురిస్తుందన్నా రు. సీమాంధ్రకు సజీవ నదులు లేవని, శ్రీవేంకటేశ్వరస్వామి పాదాలకింద ప్రవహించే విరజానదిలోని నీటిని ఇమ్మని బిందె లు తీసుకుని వేడుకోవాల్సి ఉంటుందని అన్నారు. మహిళలు పెద్ద ఎత్తున ఆందోళనలో పాల్గొన్నారంటే విభజనపై ఎంత నిరసన ఉందో తెలుసుకోవచ్చని తెలిపారు. అందరికీ అత్మీయతను పంచే మహిళ కళ్లెర్ర చేస్తే దుర్గమ్మ అవుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు.గాలేరు-నగిరి, హంద్రీ-నీవా లాంటి పథకాలతో సస్యశ్యామలం చేద్దామనుకున్న వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు కల్లలుగా మిగిలిపోతాయని అన్నారు. శ్రీశైలం మల్లన్న అభిషేకానికి కూడా నీళ్లు దొరకవని, ఆయనకు మనరక్తంతోనే అభిషేకం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని తెలిపారు. గత 60 ఏళ్లుగా సీమాంధ్రుల డబ్బు, రక్తంతో నిర్మించిన తలలాంటి హైదరాబాద్‌ను తెలంగాణ వారికిచ్చి, మొండెంను మాత్రమే మనకివ్వాలని చూస్తున్నారని చెప్పారు. రాష్ట్రానికి వచ్చే 1.20 లక్షల కోట్ల ఆదాయంలో, 90వేల కోట్లు హైదరాబాద్ నుం చే వస్తోందని అన్నారు. అంతా వారికిచ్చేస్తే, సీమాంధ్రకు నిధులు ఎలా వస్తాయని, పథకా లు ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భారతంలో ద్రౌపదికి వస్త్రాపహరణం చేస్తుంటే, కౌరవులు చూస్తూ ఉండిపోయినట్లు, తెలుగుతల్లికి అదే పరిస్థితి నెలకొంటే, సీమాం ధ్ర ఎంపీలు అదే తరహాలో చూస్తున్నారని ఆరోపించారు. పార్టీ అధినేత్రి ముందు గంగిరెద్దుల్లా తలలు ఊపి వస్తున్నారని ఎద్దేవా చేశారు. టీటీడీ ట్రస్టు బోర్డు మాజీ సభ్యుడు ఒవి.రమణ మాట్లాడుతూ కుమారుడిని ప్రధానమంత్రిని చేసేందుకు సోనియా విభజన ప్రక్రియకు రూపకల్పన చేసిందని విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి లేని లోటు నేడు స్పష్టంగా కనిపిస్తోందని, ఆయన ఉంటే ఈపరిస్థితి వచ్చేది కాదని కాంగ్రెసు ఎంపీలే అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నగర కన్వీనర్ పాలగిరి ప్రతాప్‌రెడ్డి, మహిళా కన్వీనర్ కుసుమ, చెంచయ్య యాదవ్, గోపీయాదవ్, సోమశేఖర్, హర్ష, తొండమనాటి వెంకటేష్, ముద్రనారాయణ, రాజేంద్ర, ఖాద్రీ, ఎంవిఎస్.మణి తదితరులు పాల్గొన్నారు.