సూయజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణ నౌక ఎవర్ గివెన్ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం సూయజ్ కెనాల్ అథారిటీదే అంటోంది ఆ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్. వాతావరణం సరిగా లేనప్పుడు ఎవర్ గివెన్ వంటి పెద్ద నౌకను కెనాల్‌లో ప్రయాణానికి అనుమతించడం సూయజ్ చేసిన తప్పుగా ఆ సంస్థ పేర్కొంది. నౌక తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవంటూ రికార్డులు చూపెడుతోంది. ప్రమాదానికి ముందు సూయజ్ కెనాల్ అథారిటీ, నౌకా సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణను సైతం వెల్లడించింది.
భారీ నౌకల సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్‌ని సూయజ్ కెనాల్ అథారిటీ సరిగా పాటించలేదని ఎదురుదాడి చేస్తోంది. గత మూడు నెలలుగా ఎవర్‌గి వెన్‌ను సీజ్ చేసిందుకు గాను నష్టపరిహారంగా లక్ష డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సూయజ్ కాలువ ప్రమాదంపై ఇస్లామియా ఎకనామిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవర్‌గివెన్ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్ సంస్థ తన వాదనలు వినిపించింది.
మార్చి 23న ప్రమాదం
ప్రపంచంలోనే అత్యంత రద్ధీ వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటైన సూయజ్ కెనాల్‌లో మార్చి 23న ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోయింది. నౌక ముందు వెనక భాగాలు కెనాల్ చెరో తీరాన్ని ఢీకొట్టాయి. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోవడంతో .. అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు వారం రోజులకు పైగా నిలిచిపోయాయి. టగ్ బోట్ల సాయంతో ఎట్టకేలకు ఎవర్ గీవెన్‌ను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఎవర్ గివెన్ నౌకను సీజ్ చేసింది సూయజ్ కెనాల్ అథారిటీ. నష్టపరిహారంగా 916 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment