suez canal
-
ఆగిపోతున్న సరకు రవాణా..!
అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి లాంటి సూయెజ్ కాలువలో 2021లో అతిపెద్ద కంటైనర్ నౌకల్లో ఒకటైన ఎవర్ గివెన్ చిక్కుకున్న విషయం తెలిసిందే. జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కేకే సంస్థకు చెందిన ఈ నౌకను అష్టకష్టాలతో ఎలాగోలా బయటకు తీసుకొచ్చిన ఉదంతం ఉంది. ఈ ఘటన వల్ల ప్రపంచ వాణిజ్యంపై చాలా ప్రభావం పడింది. వేల టన్నుల్లోని సరకు రవాణా నిలిచిపోయింది. అయితే సూయెజ్ కాలువకు ఆనుకుని ఉన్న ఎర్ర సముద్రం ప్రపంచ నౌకా రవాణాకు కీలక మార్గం. ఈజిప్టులోని సూయెజ్ కాలువ మీదుగా ఈ మార్గాన్ని షిప్పింగ్ కంపెనీలు రవాణాకు ఉపయోగించుకుంటాయి. మధ్యదరా సముద్రం మీదుగా రవాణాకు ఇది అత్యంత దగ్గరి మార్గం. ఆఫ్రికా చుట్టూ తిరిగి రాకుండా దక్షిణ, తూర్పు ఆసియాలకు ఇది ఎంతో అనుకూలమైన మార్గం. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం నేపథ్యంలో ఇప్పుడీ మార్గం ప్రమాదంలో పడింది. యెమెన్ కేంద్రంగా హౌతీ రెబల్స్ సరకు రవాణా చేసే నౌకలపై దాడులకు దిగుతుండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి. హౌతీ దాడులతో షిప్పింగ్ కంపెనీలు ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకుంటున్నాయి. ఆఫ్రికాలోని బిజోటీ పక్కనే ఉన్న బాబ్ ఎల్-మండెబ్ మార్గంలో నౌకల రవాణా నిలిపేయనున్నట్లు ప్రకటించాయి. ఇది 10శాతం అంతర్జాతీయ వాణిజ్యంపై ప్రభావం చూపనుంది. ఎర్ర సముద్రం మీదుగా 35 శాతం రవాణాను ఆపేశాయి. మార్స్క్, ఎంఎస్సీ, హపాగ్ లాయిడ్ కంపెనీలు ఇప్పటికే రవాణాను నిలిపేశాయి. ప్రపంచ వ్యాప్తంగా వార్షిక షిప్పింగ్ వ్యాపారం 14 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. అది ప్రపంచ జీడీపీలో 16శాతం. అన్ని రవాణా వ్యవస్థల కంటే షిప్పింగ్ చౌకగా ఉంటుంది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమయ్యాక నౌకా రవాణా వ్యయం పెరిగింది. 40 అడుగుల కంటైయినర్ ధర 5 శాతం పెరిగింది. ఏడాదికి 19,000 నౌకలు సూయెజ్ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. దీనివల్ల 30 రోజుల సమయం కలిసి వస్తుంది. అదే ఆఫ్రికా చుట్టూ తిరిగి వస్తే అధిక రవాణా వ్యయంతోపాటు సమయం వృథా అవుతుంది. దాంతోపాటు ప్రధానంగా సముద్ర దొంగల భయం ఎక్కువగా ఉంటుంది. ఆసియా దేశాలు, ఈజిప్టు, ఈశాన్య ఐరోపాకు భారత్ నుంచి నౌకల ద్వారా సరకు రవాణా అవుతోంది. దీనికి ఎర్ర సముద్ర మార్గాన్ని వినియోగించుకుంటోంది. దీంతోపాటు అంతర్జాతీయ నౌకల్లో సిబ్బందిగా భారతీయులే అధికంగా ఉంటారు. మొత్తం సిబ్బందిలో 12 శాతం భారతీయులే. సముద్రపు దొంగల నుంచి ఇప్పటికే వారు ప్రమాదాలను ఎదుర్కొంటున్నారు. తాజాగా యుద్ధం నేపథ్యంలో వారికి హౌతీ రెబల్స్ ప్రమాదకరంగా మారారు. ఎర్ర సముద్రం మీదుగా సుదీర్ఘకాలం సరకు రవాణాకు అంతరాయం కలిగితే ఐరోపాలో ధరలు పెరుగుతాయి. సూయెజ్ కాలువ ద్వారా జరిగే సరకు రవాణాలో చమురు ఐదో వంతు ఉంటుంది. రెండు వైపులా రోజుకు దాదాపు 9 కోట్ల బ్యారెళ్ల చమురు రవాణా అవుతుంది. దీనికి ఆటంకం కలిగితే 2024లో చమురు ధరలు భారీగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదీ చదవండి: విమానం కంటే స్పీడ్‌గా వెళ్లే రైలు.. కథ కంచికే.. హౌతీ తెగకు చెందిన వారి హక్కుల పరిరక్షణ పేరుతో జైదీ షియాలు హౌతీ గ్రూపును ఏర్పాటు చేశారు. పశ్చిమాసియాలో అమెరికా, ఇజ్రాయెల్ పెత్తనాన్ని ఈ గ్రూపు వ్యతిరేకిస్తుంటుంది. పశ్చిమ యెమెన్‌ను కేంద్రంగా చేసుకుని ఈ గ్రూప్ తన కార్యకలాపాలు సాగిస్తోంది. ఇరాన్‌తోపాటు ఈ ప్రాంతంలోని ఇస్లామిక్ గ్రూపులు హౌతీ రెబల్స్‌కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఎర్ర సముద్ర ముఖద్వారంగా ఉన్న బాబ్ ఎల్-మండెబ్పై హౌతీ రెబల్స్‌కు ఆధిపత్యం ఉంది. ప్రస్తుతం ఈ గ్రూపునకు అబ్దుల్-మాలిక్ అల్ హౌతీ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. -
ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ హైడ్రోజన్ ప్లాంట్
న్యూఢిల్లీ: ఈజిప్ట్‌లో రెన్యూ పవర్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టనుంది. సూయిజ్ కెనాల్ ఎకనమిక్ జోన్లో 8 బిలియన్ డాలర్ల (రూ.64 వేల కోట్లు) పెట్టుబడులతో హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకు సంబంధించి ఈజిప్ట్ ప్రభుత్వంతో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ పీఎల్సీ (రెన్యూ) అనుబంధ కంపెనీ ‘రెన్యూ పవర్ ప్రైవేటు లిమిటెడ్’ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా ఏటా 2,20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి చేయనున్నట్టు కంపెనీ తెలిపింది. ఈ ఏడాది జూలైలోనే ఈజిప్ట్‌తో అవగాహన ఒప్పందం చేసుకోగా, ఇప్పుడు కార్యాచరణ ఒప్పందంపై సంతకాలు చేసినట్టు పేర్కొంది. దశలవారీగా ఈ ప్రాజెక్టు ఉత్పత్తిని ఆరంభిస్తుందంటూ, మొదటి దశలో 20,000 టన్నుల గ్రీన్ హైడ్రోజన్, డెరివేటివ్‌లను ఉత్పత్తి చేయనున్నట్టు తెలిపింది. కార్యాచరణ ఒప్పందం కింద, ప్రాజెక్టు, క్షేత్రస్థాయి అధ్యయనం నిర్వహించి, వచ్చే 12–16 నెలల్లో తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ప్రకటించింది. ఈ ప్రాజెక్టుకు స్థానిక డెవలపర్‌గా ఎల్స్వెడీ ఎలక్ట్రిక్ ఎస్‌ఏఈ పనిచేయనుంది. -
ఎవర్‌గివెన్ కన్నా పెద్ద నౌక!.. సూయజ్ దారి ఇస్తుందా?
ప్రపంచ వాణిజ్య సముద్ర మార్గం సూయజ్ కెనాల్లోకి ప్రపంచంలోనే అతి పెద్దదైన భారీ ఓడ ప్రవేశించబోతోంది. ఈ ఏడాది మార్చిలో సూయజ్ కెనాల్లో నిలిచిపోయిన ఎవర్ గివెన్ నౌకను మించిన ఓడ ఇది. ఎవర్ గివెన్ నౌక ఆరు రోజుల పాటు సూయజ్ కెనాల్లో ఇసుకలో కూరుకుపోయి, నిలిచిపోవడంతో ఈ మార్గంలో ప్రయాణించే వందలాది నౌకలు సముద్రంలో నిలిచిపోయాయి. ఆ తర్వాత నౌక కింద ఇసుకను తవ్వి, అతి కష్టంమీద దానిని మళ్లీ సముద్ర మార్గంలోకి మళ్లించగలిగారు. ఈ నౌక నిలిచిపోయిన కారణంగా సముద్ర వాణిజ్యానికి తీవ్ర నష్టం కలిగింది. ఇప్పుడు వస్తున్న ఎవర్ ఏస్ నౌక అంతకంటే పెద్దది. ఎక్కువ కంటెయినర్లను మోసుకొని వస్తోంది. చదవండి: సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా? ప్రస్తుతం ఇది బ్రిటన్‌లోని సఫోల్క్‌లో ఉన్న ఫ్లెగ్జిస్టోవ్ నౌకాశ్రయంలో ఉంది. బుధవారం దాని ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. భారీ కంటెయినర్ల లోడ్‌తో రాటర్‌డామ్‌కు చేరుకొనేందుకు ఎవర్ గివెన్ వెళ్లిన మార్గంలోనే సూయజ్ కెనాల్ గుండా వెళ్లనుంది. దీంతో అందరిలోనూ ఉత్సుకత నెలకొంది. ఎవర్ గివెన్కంటే పెద్దదైన ఈ నౌక సూయజ్ కెనాల్‌ను దాటేంతవరకు ఉత్కంఠ తప్పదని వాణిజ్యవర్గాలు అంటున్నాయి. తైవాన్‌కు చెందిన షిప్పింగ్ కంపెనీ ఎవర్ గ్రీన్ మెరైన్‌కు చెందిన ఈ నౌక ఎవర్గ్రీన్ ఎ క్లాస్‌లో కొత్త తరానికి చెందినది. ఎవర్ గివెన్‌కు 20,124 కార్గో యూనిట్లను మోసుకెళ్లే సామర్ధ్యం ఉండగా.. ఎవర్ ఏస్ ఏకంగా 23,992 కంటెయినర్లను మోసుకెళ్లగలదు. ఇవే కాదు ఈ రెండింటి మధ్య ఇంకా చాలా తేడాలున్నాయి. రెండింటి పొడవు ఒకటే. వెడల్పు, లోతులో, సామర్ధ్యంలో ఎవర్ ఏస్ ఎక్కువ. – సాక్షి, ఏపీ సెంట్రల్ డెస్క్ -
సూయజ్ కాలువ.. ఎవర్ గీవెన్ నౌక.. ఇప్పుడెక్కడుందో తెలుసా?
Ever Given In Suez Canal Again ప్రపంచ వాణిజ్యంలో 15 శాతానికి పైగా నిర్వహించే సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కిపోయి ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఎవర్ గీవెన్ నౌక ఇప్పుడెక్కడుంది. సూయజ్ నుంచి ఎవర్ గీవెన్‌ని తొలగించిన తర్వాత ఏం జరిగింది. సూయజ్‌లో ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత పెద్ద వాణిజ్య నౌకల్లో ఎవర్ గీవెన్ ఒకటి. దాదాపు 400 మీటర్ల పొడవైన ఈ నౌకలో ఒకేసారి 2.20 లక్షల టన్నుల సరుకును తరలించే వీలుంది. ఇంత భారీ నౌక మధ్యధర సముద్రం నుంచి ఎర్ర సముద్రం వైపు ప్రయాణిస్తూ 2021 మార్చి 23న కాలువలో కూరుకుపోయింది. పెనుగాలుల తీవ్రంగా కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయింది. కూరుకుపోయిన నౌకను బయటకు తీసేందుకు ఆరు రోజుల సమయం పట్టింది. దీంతో ఆరు రోజుల పాటు ఈ కాలువ గుండా వాణిజ్య నౌకల రాకపోకలు నిలిచిపోయి బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. మూడు నెలల తర్వాత సూయజ్ కాలువ నుంచి బయటకు తీసిన తర్వాత ఎవర్‌గీవెన్ నౌకను సూయజ్ కెనాల్ అథారిటీ సీజ్ చేసింది. ఆరు రోజుల పాటు కెనాల్ బ్లాక్ అయినందుకు గాను 916 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని కోరింది. దీంతో ఇటు సూయజ్ కెనాల్ అథారిటీ, ఎవర్‌గీవెన్ నౌక యాజమాన్యమైన షోయ్ కిసెన్ ఖైషా, ఇన్సురెన్స్ సంస్థల మధ్య చర్చలు జరిగాయి. మూడు నెలల చర్చల అనంతరం వీరి మధ్య 600 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించేందుకు ఒప్పందం కుదిరింది. ఎవర్‌గీవెన్ నౌకను జులై 7న రిలీజ్ చేశారు. సూయజ్ టూ ఇంగ్లండ్ సూయజ్ కెనాల్ నుంచి రిలీజైన తర్వాత మరమ్మత్తులు నిర్వహించి జులై 29న హలండ్‌లోని రోటర్‌డ్యామ్‌కు చేరుకుంది,.అనంతరం ఇంగ్లండ్‌లోని ఫెలిక్స్‌టోవ్ పోర్టుకు చేరుకుంది, అక్కడ మరోసారి సరుకులు నింపుకుని వాణిజ్య ప్రయాణానికి రెడీ అయ్యింది. ఆగస్టు 20న ఇంగ్లండ్ నుంచి చైనాకు ప్రయాణమైన ఎవర్ గీవెన్ ఆగస్టు 20న మరోసారి సూయజ్ కాలువని దాటింది. మరోసారి ప్రమాదం జరగకుండా సూయజ్ కెనాల్ అథారిటీ జాగ్రత్తలు తీసుకుని. ఎవర్‌గీవెన్‌కు తోడుగా రెండు టగ్ బోట్లను కూడా పంపింది. ఎవర్‌గీవెన్‌తో పాటు ఒకేసారి 26 చిన్న నౌకలు సైతం సూయజ్‌ను దాటినట్టు ఈజిప్టు మీడియా పేర్కొంది. 22వ సారి ఎవర్‌గీవెన్ నౌకను తైవాన్‌కు చెందిన తైవాన్‌కు చెందిన ఎవర్గ్రీన్ షిప్టింగ్ సంస్థ 2018లో తయారు చేసింది. ఈ భారీ నౌక అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక ప్రపంచ యాత్రలు చేసింది. సూయజ్ కాలువను 21వ సారి దాటే క్రమంలో మట్టి దిబ్బల్లో ఇరుక్కుపోయింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి ఎవర్‌గీవెన్‌పై పడింది. ఆ వివాదం నుంచి బయటపడి విజయవంతంగా 22వ సారి సూయజ్ కాలువను దాటింది. -
100 రోజుల పైగా డ్రామా.. ఎట్టకేలకు కదిలిన ఎవర్ గివెన్ నౌక
suez canal vs ever given ship settled: ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? అదేనండి మార్చి నెలలో సరకు సూయాజ్ కాలువలో వెళ్తూ టైం బాలేక అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఆ షిప్, దాని యాజమాన్యానికి నష్టాలు, కష్టాలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం షిప్ యాజమాన్యానికి వీటి నుంచి ఊరట లభించింది. సూయాజ్‌లో ఇరుక్కుపోయిన ఆ భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజులు అష్టకష్టాలు పడి చివరకు దాన్ని మళ్లీ కదిలేలా చేశారు. హమ్మయ్యా కదిలింది కదా! అనుకుంటే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. అది వారం రోజులు బ్లాక్ కావడంతో ఇతర షిప్‌లు రాకకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టాన్ని చూశారు. అలానే షిప్ కదిలికకు చేసిన ఖర్చును కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేసినప్పటికీ తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు. ఈ నేపథ్యంలో నష్టం పరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది. ఇక తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ బుధవారం సూయాజ్ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది. -
సూయజ్‌లో ఎవర్ గివెన్ ప్రమాదానికి కారణం ఇదేనా?
సూయజ్ : ప్రపంచంలోనే అతిపెద్ద సరుకు రవాణ నౌక ఎవర్ గివెన్ నీటిలో చిక్కుకుపోవడానికి ప్రధాన కారణం సూయజ్ కెనాల్ అథారిటీదే అంటోంది ఆ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్. వాతావరణం సరిగా లేనప్పుడు ఎవర్ గివెన్ వంటి పెద్ద నౌకను కెనాల్లో ప్రయాణానికి అనుమతించడం సూయజ్ చేసిన తప్పుగా ఆ సంస్థ పేర్కొంది. నౌక తరఫున ఎటువంటి లోటుపాట్లు లేవంటూ రికార్డులు చూపెడుతోంది. ప్రమాదానికి ముందు సూయజ్ కెనాల్ అథారిటీ, నౌకా సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణను సైతం వెల్లడించింది. భారీ నౌకల సముద్ర ప్రయాణానికి సంబంధించిన ప్రోటోకాల్‌ని సూయజ్ కెనాల్ అథారిటీ సరిగా పాటించలేదని ఎదురుదాడి చేస్తోంది. గత మూడు నెలలుగా ఎవర్గి వెన్ను సీజ్ చేసిందుకు గాను నష్టపరిహారంగా లక్ష డాలర్లు చెల్లించాలని డిమాండ్ చేస్తోంది. సూయజ్ కాలువ ప్రమాదంపై ఇస్లామియా ఎకనామిక్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా ఎవర్‌గివెన్ నౌక యాజమాన్య సంస్థ షోయి కిసైన్ సంస్థ తన వాదనలు వినిపించింది. మార్చి 23న ప్రమాదం ప్రపంచంలోనే అత్యంత రద్ధీ వాణిజ్య సముద్ర మార్గాల్లో ఒకటైన సూయజ్ కెనాల్లో మార్చి 23న ఎవర్ గివెన్ నౌక చిక్కుకుపోయింది. నౌక ముందు వెనక భాగాలు కెనాల్ చెరో తీరాన్ని ఢీకొట్టాయి. నౌక ముందు భాగం మట్టిలో కూరుకుపోవడంతో .. అక్కడే నిలిచిపోయింది. దీంతో ఈ మార్గంలో రాకపోకలు వారం రోజులకు పైగా నిలిచిపోయాయి. టగ్ బోట్ల సాయంతో ఎట్టకేలకు ఎవర్ గీవెన్‌ను బయటకు తీశారు. ఈ ప్రమాదం కారణంగా లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందంటూ ఎవర్ గివెన్ నౌకను సీజ్ చేసింది సూయజ్ కెనాల్ అథారిటీ. నష్టపరిహారంగా 916 మిలియన్ డాలర్లు చెల్లించాలంటూ యాజమాన్యాన్ని డిమాండ్ చేసింది. -
సూయజ్ లో చిక్కుకున్న రాకాసి నౌకకు తప్పని కష్టాలు
సూయజ్ కాల్వలో ఒక వారం పాటు చిక్కుకున్నరాకాసి నౌక ‘ఎవర్ గివెన్’పై ఈజిప్ట్ ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. గత నెలలో సూయజ్ కాల్వలో నౌక చిక్కుకోవడంతో వాణిజ్య పరంగా భారీ నష్టం వచ్చిందని అక్కడి ప్రభుత్వం తెలిపింది. దీంతో బిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ పరిహారంపై ఈజిప్ట్ ప్రభుత్వ అధికారులతో ఎవర్ గివెన్ యాజమాన్యం చర్చిస్తోంది. ఈజిప్టు అధికారులు ఎవర్ గివెన్ నౌక సూయజ్ కాలువకు అడ్డంగా వారం పాటు నిలిచిపోవడంతో తమకు నష్టాలు వచ్చాయని, ఒక బిలియన్ డాలర్ల నష్ట పరిహారం చెల్లించేవరకూ దానిని వదిలేది లేదని చెబుతున్నారు. భారీ కార్గో షిప్ ప్రస్తుతం సూయజ్ కెనాల్ హోల్డింగ్ సరస్సులో ఉంది. ఇక్కడ అధికారులు, ఓడ నిర్వాహకులు దర్యాప్తు కొనసాగుతున్నారని చెప్పారు. భారీ నౌక యజమానులతో ఆర్థిక పరిష్కారం కోసం అధికారులు చర్చలు జరుపుతున్నారని సూయజ్ కెనాల్ చీఫ్ గతంలో చెప్పారు. లెఫ్టినెంట్ జనరల్ ఒసామా రాబీ అసోసియేటెడ్ ప్రెస్‌తో మాట్లాడుతూ.. రాకాసి నౌక ఎవర్ గివెన్ జపనీస్ యజమాని షోయి కిసెన్ కైషా లిమిటెడ్‌తో చర్చలు త్వరగా ముగుస్తాయని తాను ఆశిస్తున్నానని చెప్పారు. కాలువ నిర్వహణతో పరిష్కరించుకోవడం కంటే కేసును కోర్టు ముందు తీసుకురావడం సంస్థకు ఎక్కువ హానికరం అని ఆయన అభిప్రాయపడ్డారు. గత వారం సూయజ్ కెనాల్ అథారిటీ 1 బిలియన్ డాలర్లకు పైగా నష్టపరిహారాన్ని ఆశిస్తున్నట్లు కాలువ చీఫ్ చెప్పారు, నష్టాల సమస్య చట్టపరమైన వివాదంగా మారితే ఓడను కాలువ నుండి బయటకు వెళ్ళడానికి అనుమతించదని హెచ్చరించారు. పరిహారం చెల్లించడానికి ఎవరు బాధ్యత వహిస్తారో అతను అప్పుడు పేర్కొనలేదు. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
ఆ నౌక నేను నడపలేదు.. నాపై నిందలు వేస్తున్నారు!
పిడుగు ఆకాశంలోంచి ఊడిపడుతుంది. బడబాగ్ని నిప్పుకణంలోంచి జ్వలిస్తుంది. ప్రకంపన పుడమి నుంచి ఉద్భవిస్తుంది. సుడిగుండం సముద్రంలో జనిస్తుంది. కానీ.. మహిళపై నింద ఎక్కడి నుంచి ఊడి పడి, ఎలా జ్వలించి, ప్రకంపించి, సుడిగుండమై ఆమె జీవితాన్ని అల్లకల్లోలం చేస్తుందో చెప్పలేం. ప్రస్తుతం మర్వా ఎల్సెల్హదార్ అనే నేవీ కెప్టెన్ అలాంటి ఒక నింద నుంచి బయటపడే ప్రయత్నంలోనే ఉంది. మర్వా ఎల్సెల్హదార్ ఈజిప్టు నేవీలోని మెరైన్ విభాగంలో తొలి మహిళా కెప్టెన్. 29 ఏళ్ల యువతి. ఐదేళ్ల క్రితమే ఆమె నేవీలో చేరింది. ఇటీవల అక్కడి ‘అరబ్ న్యూస్’లో ఆమె గురించి పెద్ద కథనం వచ్చింది. తెల్ల యూనిఫామ్‌లో ఉన్న మర్వా చక్కటి ఫొటో ఒకటి పెట్టి ఈజిప్టు మెరైన్‌లో తొలి కెప్టెన్‌గా ఆమె సక్సెస్ స్టోరీ రాసింది ఆ పత్రిక. మెరైన్‌లో చేరిన ఐదేళ్ల తర్వాత ఆమెపై ఈ తాజా స్టోరీ రాయడానికి ‘అరబ్ న్యూస్’ చెప్పిన కారణం ఆలోచింపజేసే విధంగా ఉంది. ‘ఒక మహిళా మెరైన్ కెప్టెన్ అవడం గొప్పే. అంతకన్నా గొప్ప.. ఆ మహిళ మెరైన్ కెప్టెన్‌గా కొనసాగడం!’ అనే వాక్యంతో ఆ వార్తా కథనం ముగిసింది. నిజమే. మర్వా మెరైన్‌లో చేరిన తొలిరోజు నుంచీ ప్రతికూల పరిస్థితులను నెగ్గుకుంటూ వస్తోంది. 2015 వరకు ఈజిప్టు నేవీ మెరైన్‌లో మహిళా కెప్టెన్ ఒక్కరూ లేరు. పూర్తిగా పురుష ప్రపంచం అది. ఆ ప్రపంచంలోకి ధైర్యం చేసి వెళ్లింది మర్వా. అరబ్ న్యూస్‌లో మొన్న మార్చి 22న వచ్చిన ఆమె సక్సెస్ స్టోరీ కొన్ని గంటల్లోనే ట్విట్టర్లో, ఫేస్బుక్లో అనేకసార్లు షేర్ అయింది. అయితే రెండు రోజుల తర్వాత అదే ఫొటోతో ఇంటర్నెట్లో ఆమెను నిందిస్తూ ఒక వార్త వైరల్ అయింది! ఆ వార్త మర్వా చేతిలోని ఫోన్ వరకు చేరింది. మధ్యలోని ఆ కొద్ది గంటల్లోనే ఏం జరిగింది? సూయజ్ కెనాన్‌లో మార్చి 23న ‘ఎవర్ గివెన్’ అనే నౌక ‘బ్లాక్’ అయింది. కాలువకు రెండు వైపులా వాహనాల రవాణా స్తంభించిపోయింది. ఆరు రోజులు కష్టపడి నౌకను మళ్లీ దారిలో పెట్టగలిగారు. అయితే ఈ రెండు వారాల్లో తనపై వైరల్ అవుతూ వచ్చిన నిందను ‘క్లియర్’ చేసుకోడానికి నానా అవస్థలు పడుతోంది మర్వా. ఇక ఆమెపై పడిన నింద ఏమిటంటే.. ఎవర్ గివెన్‌ను ఆమే నడుపుతున్నారని, ఆమె సరిగా నడపలేకపోవడం వల్లనే ఆ నౌక.. కెనాల్లో అడ్డం తిరిగి, ప్రపంచ వాణిజ్య రంగానికి లక్షల కోట్ల ఆర్థిక నష్టాన్ని తెచ్చిపెట్టిందనీ! ఇది మామూలు నింద కాదు. ఒక దేశం మాత్రమే తట్టుకోగల నింద. వ్యక్తులు భరించలేరు. తన గురించి అలాంటి అబద్ధపు వార్త ఒకటి వైరల్ అవుతున్నట్లు తెలియగానే మర్వా మొదట ఖిన్నురాలైంది. ఏమిటి ఆ నౌకకు, తనకు సంబంధం! తను నేవీలో కెప్టెనే తప్ప, సరకులను చేరవేర్చే ఓడకు కెప్టెన్ కాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి కలిపారు! ఆలోచించిన కొద్దీ మర్వా మళ్లీ మళ్లీ నివ్వెరపోతోంది. పురుషాధిక్య ప్రపంచంలో ఇలాంటి నివ్వెరపాట్లు ప్రతి మహిళకూ అనుభవంలోనికి వచ్చేవేనని ఆమెకు తెలియంది కాదు. ఒక మహిళపై వచ్చిన నిందను నమ్మేవారు నమ్ముతారు. కానీ, పుట్టించేవాళ్లు ఎలా పుట్టిస్తారు?! ‘‘నాకొకటి అనిపిస్తోంది. అలవాటు లేని రంగంలోనైనా అరుదైన విజయం సాధించిన మహిళలకు ఇలాంటివి తప్పవు. నాకూ అలాగే జరిగి ఉండొచ్చు’’ అంటోంది మర్వా. సముద్రంపై ఒక మహిళ ఉద్యోగం చేస్తోందంటే ఆమెను వీలైనంత త్వరగా ‘ఒడ్డుకు చేర్చేందుకు’ అక్కడి ప్రతికూలతలు అనుక్షణం అలల్లా నెట్టేస్తుంటాయి. ‘ఇంటర్నేషనల్ మారీటైమ్ ఆర్గనైజేషన్’ నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద కేవలం 2 శాతం మంది మహిళలు మాత్రమే సముద్ర ఉద్యోగాలు చేస్తున్నారు. మర్వాకు సముద్రం అంటే ఇష్టం. ఆ ఇష్టాన్ని చూసి ఆమె సోదరుడు ఆమె పేరును ఎ.ఎ.ఎస్.టి.ఎం.టి. (అరబ్ అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్ట్)లో నమోదు చేయించాడు. అరబ్ లీగ్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రాంతీయ విశ్వవిద్యాలయం అది. ఈజిప్టులోని అలెగ్జాండ్రి యా నగరంలో ఉంది. అయితే పురుష అభ్యర్థులకే ఆ యూనివర్సిటీలో ప్రవేశం. మహిళలెందుకు చేరకూడదు అని మర్వా న్యాయపోరాటం చేసింది. ఆ పోరాటంతో స్త్రీలకూ తొలిసారి నేవీ మెరైన్‌లో ప్రవేశం లభించింది. పట్టు పట్టి చేరాక, నిలదొక్కుకోడానికి మర్వాకు మళ్లీ ఒక పోరాటం చేయడం అవసరమైంది! అదొక పురుష ప్రపంచం. అంతా తనకన్నా వయసులో పెద్దవాళ్లు. మహిళవు, నీకెందుకు ఇవన్నీ అన్నట్లే ఉండేది వారి చూపు, మాట. ట్రైనింగ్ పూర్తయ్యే సరికి మర్వాకు సప్త సముద్రాలలో మనకలేసి వచ్చినంత పనైంది. ‘‘నా మానసిక స్థితిని స్థిరంగా ఉంచుకునేందుకు నేను చాలా కష్టపడవలసి వచ్చేది’’ అని మర్వా ఈ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో బహిర్గతం చేసింది. కోర్సులో పట్టభద్రురాలయ్యాక మర్వా ఫస్ట్ మేట్ (ఫస్ట్ ఆఫీసర్) ర్యాంకుకు చేరుకుంది. ‘ఐదా 4’ శిక్షణ నౌకకు కెప్టెన్ అయింది! సూయజ్ కాలువను 2015లో ఆధునీకరించాక అందులో ప్రయాణించిన తొలి నౌక ‘ఐదా’ నే. అప్పుడే మర్వా.. సూయజ్ కెనాల్‌పై అతి చిన్న వయసులో నౌకను నడిపిన ఈజిప్టు మహిళగా గుర్తింపు పొందింది. ఆ గుర్తింపును దెబ్బతీసేలా ఇప్పుడు ఏ మూల నుంచో ఆమెపై నింద వచ్చి పడింది! ‘ఎవర్ గివెన్’ నౌకను నడిపి, కెనాల్ బ్లాక్ అవడానికి కారణం అయిందని!! అయితే అది నిలబడే నింద కాదని, సోషల్ మీడియా వికృత కల్పననేని వెనువెంటనే తేలిపోయింది. ఇటీవల సూయజ్ కెనాల్లో ఇరుక్కుపోయిన ‘ఎవర్’ నౌక; (కాలువలో అడ్డుగా, విడిగా) ఎవర్ గివెన్ నౌక ఆ రోజు సూయజ కెనాల్లో బ్లాక్ అయిన సమయానికి మర్వా అక్కడికి కొన్ని వందల మైళ్ల దూరంలోని అలెగ్జాండ్రియాలో ఐదా 4 నౌకలో ఫస్ట్ మేట్‌గా విధులు నిర్వహిస్తూ ఉన్నారు. ఈజిప్టు సముద్ర భద్రతా సంస్థకు చెందినా ఐదా ఆ రోజు ఎర్ర సముద్రంలోని లైట్ హౌస్‌కు అవసరమైన సామగ్రిని తీసుకువెళుతోంది. అందులో కెప్టెన్‌గా ఉన్న మర్వా ఫొటోను ఎవర్ గివెన్‌కు కెప్టెన్‌గా ఉన్నట్లుగా మార్పులు చేసి నెట్లో కొందరు తప్పుడు ప్రచారం చేశారు. ఆ ప్రచారాన్ని ఈజిప్టు నేవీనే స్వయంగా ఖడించడంతో మర్వా కాస్త ఊపిరి పీల్చుకుంది. సోషల్ మీడియాలో కూడా అధిక శాతం మర్వాకు మద్దతుగా నిలబడ్డారు. అయినా మర్వా గురించి ఈజిప్టు నేవీలో గానీ, ఈజిప్టులో గానీ తెలియనివారు లేరు. ధైర్యంగల అమ్మాయి. 2017 మహిళా దినోత్సవం సందర్భంగా నాటి అధ్యక్షుడు అబెల్ ఫతా ఆమెను సత్కరించారు కూడా. వచ్చే నెలలో మర్వా కెప్టెన్ ర్యాంకుకు చివరి పరీక్ష పూర్తవుతుంది. అప్పుడామె రాబోయే యవతరానికి శిక్షణ నిచ్చే కెప్టెన్ కూడా అవుతారు. ‘‘మనం ఒక ఉద్యోగాన్ని ఇష్టపడి చేస్తున్నప్పుడు మన మీద వచ్చే విమర్శలు మన పై, మన పనిపై ఏమాత్రం ప్రతికూల ప్రభావం చూపలేవు’’ అంటోంది మర్వా. l -
సూయెజ్ దిగ్బంధనం నేర్పుతున్న పాఠాలు
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది సూయెజ్ కాలువలో ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. చాలాకాలంగా నౌకారవాణా ప్రాధాన్యత కొనసాగుతూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలావరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఈజిప్ట్‌లోని సూయెజ్ కాలువకు అడ్డుపడి ఇరుక్కుపోయిన భారీ సరుకు రవాణా నౌక ఎవర్ గివెన్ వారంరోజుల పాటు ప్రపంచాన్ని దిగ్భ్రాంతిపరిచింది. ఎవర్ గివెన్ నౌక పొడవు 400 మీటర్లు (1,321 అడుగులు), బరువు 2 లక్షల టన్నులు. దీని గరిష్ట సామర్థ్యం 20 వేల సరుకుల కంటైనర్లు. సూయెజ్ కాలువకు అడ్డుపడిన ఘటనలో ఆ మార్గంలో ప్రయాణించే నౌకల ట్రాఫిక్‌ను ఈ భారీ నౌక పూర్తిగా అడ్డుకుంది. మార్చి 29 సోమవారం వేకువ జామున నౌక పాక్షికంగా కదలడంతో దాన్ని తిరిగి కాలువలోకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఫలించినట్లయింది. ఇరుకైన ప్రాంతాలగుండా రవాణా షిప్పింగ్ పరిశ్రమ సకాలంలో సరుకులు చేరవేసే అత్యంత సమర్థవంతమైన అనుసంధానాన్ని అందిస్తుంటుంది. అయితే కరోనా మహమ్మారి విరుచుకుపడిన కాలంలో చాలా దేశాలు నౌకల్లో పనిచేసేవారిని కీలకమైన సిబ్బందిగా పరిగణించేంతవరకూ ఈ లింక్ దాదాపుగా బయటకు కనిపించలేదు. నౌకా రవాణాలో సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాలు దిగ్బంధనకు గురైనప్పుడు సముద్ర వాణిజ్యం తప్పనిసరిగా ప్రతిష్టంభనకు గురికావలసిన అవసరం లేదు. సాధారణ పరిస్థితుల్లో సుదీర్ఘ దూరాలకు నౌకల ద్వారా అన్నిరకాల సరుకుల రవాణా కారు చౌకగా సాధ్యపడుతుంటుంది. నౌకలో చేర్చిన సరుకుల ధరతో పోలిస్తే వాటి రవాణా ఖర్చు చాలా తక్కువగా ఉంటుంది. నౌకా రవాణా చార్జీలు అధికంగా ఉంటే అది ఆర్థికంగా మొత్తం మీద పెద్ద సమస్యగా మారుతుంది. కాకుంటే సూయెజ్ కాలువలో సంభవించినటువంటి తాజా దిగ్బంధన పర్యవసానాలు చాలా రంగాలపై ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు, చమురు శుద్ధి కర్మాగారాలకు నిత్యం ముడిచమురు అవసరం. ఫ్యాక్టరీలకు ముడిసరుకులు అవసరం. అమ్మడానికి షాపులకు సరుకులు అవసరం. ఇదొక గొలుసుకట్టుగా నడుస్తుంటుంది. భద్రతా ప్రమాదాలు సముద్రయానంలో భద్రతా ప్రమాదాలను అతిశయించి చెప్పడం సులభమే కానీ వాటిని అర్థం చేసుకోవడం చాలా క్లిష్టంగా ఉంటుంది. సూయెజ్ కాలువలో ప్రతిష్టంభన నేపథ్యంలో ఆఫ్రికా చుట్టూ తిరిగి పోవలసిన మార్గంలో అదనంగా సముద్ర బందిపోట్ల ప్రమాదాన్ని మరీ అతిశయించి చూపుతున్నారని నా ఉద్దేశం. పైగా, అస్థిరతా ప్రాంతమైన సూయెజ్ కాలువ దక్షిణ కొసలో దిగ్బంధన కారణంగా వేచి ఉంటున్న షిప్పులు సముద్ర దొంగల దాడికి అనువుగా ఉంటున్నాయన్న వార్తలు పతాక శీర్షికలెక్కుతున్నాయి కూడా. ఎర్రసముద్రంలో నౌకా రవాణా కార్యక్రమాలకు కొంతమేరకు ప్రమాదం ఉండటం నిజమే కావచ్చు కానీ ఈ పరిస్థితులు రాత్రికిరాత్రే మారిపోవు. సూయెజ్ కాలువ గుండా సరుకుల నౌకల రవాణా కాన్వాయ్‌ల వారీగా సాగుతుంది కాబట్టి రవాణా నౌకలు ఎల్లప్పుడూ ఎంతో కొంత సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. పైగా అన్ని నౌకలకు ప్రమాద స్థాయి ఒకే రకంగా ఉంటుంది కానీ నష్ట ఫలితాలు అనేవి నౌక రకం, సరుకులు, నౌకా యజమాని జాతి వంటి కారణాలపై ఆధారపడి ఉంటాయి. కాబట్టే అనుకోని ప్రమాదాలను అధిగమించడానికి సముచిత చర్యలు తీసుకోవడానికి గాను పరిస్థితులకు అనుగుణమైన అప్రమత్తతో వ్యవహరించవలసి ఉంటుంది. భద్రత, రక్షణ భద్రతకు సంబంధించిన ప్రమాదాన్ని కూడా అదేవిధమైన సావధానతతో చూడాల్సి ఉంది. ఉగ్రవాద దాడుల వంటి ప్రమాదాలు అత్యధిక స్థాయిలో ఆర్థిక విచ్ఛిన్నతకు దారితీస్తాయి కాబట్టి ఇలాంటి ప్రమాదాలను అత్యంత ఘోర దురంతాలుగా చూపుతుంటారు. సూయెజ్ కాలువ వంటి ఇరుకైన జలసంధి ప్రాంతాల్లో ఇలాంటివాటినే నిర్దిష్ట ప్రమాద హేతువులుగా గుర్తిస్తుంటారు. ఇక భద్రతాపరమైన ప్రమాదాలు పతాక శీర్షికల్లో చోటు చేసుకోవు. నౌకల్లో ప్రమాదాలు తరచుగా జరుగుతుంటాయి కానీ ఇవి పెద్దగా చర్చనీయాంశాలు కావు. అయితే చాలా సందర్భాల్లో, భద్రత, రక్షణకు సంబంధించిన వాస్తవ చిక్కులు ఒకేరకంగా ఉంటాయి. నౌకల స్థితిస్థాపకతా శక్తిని పెంచేవిధంగా రూపొందిస్తూ యాజమాన్యాలు తీసుకునే చర్యలకు మరింత ప్రాధాన్యత లభించాల్సి ఉంటుంది. రక్షణకు సంబంధించిన ప్రమాదాలు చాలావరకు అస్థిరంగానూ, భద్రతకు సంబంధించిన ప్రమాదాలు మరింత గతిశీలంగానూ ఉంటాయి కనుక ఈ ప్రాంతంలో అన్ని రకాల ప్రమాదాల గురించి అప్రమత్తతను కలిగి ఉండటం కీలకం. సూయెజ్ కాలువలో జరిగిన ప్రమాదం చాలా అరుదైనది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నౌకా రవాణాపై ఎంత అధికంగా ఆధారపడి ఉందనేది ఈ ప్రమాదం వల్ల తేటతెల్లమైంది. అనేక సంవత్సరాలుగా నౌకా రవాణా ప్రాధాన్యత కొనసాగుతూ ఉంటూ వస్తోంది. కానీ అంతర్జాతీయ నౌకా పరిశ్రమ చాలా వరకు అదృశ్య రూపంలోనే ఉంటోంది. ప్రస్తుత సందర్భంలో ఎవర్ గివెన్ నౌక సూయెజ్ కాలువలో ఇరుక్కుపోవడం అనేది భద్రతాపరమైన ఘటన కాదు కానీ ఇలాంటి ఇరుకైన ప్రాంతాల సంక్లిష్ట స్వభావం గురించి ప్రపంచం ఇకపై చాలా సంవత్సరాలు చర్చించే అవకాశం మెండుగా ఉంది. మానవ నిర్మితమైన సూయెజ్ కెనాల్‌తో సహా ఇలాంటి ఇరుకైన జలమార్గాలతో పాటు పర్షియన్ గల్ఫ్‌లోని హోర్ముజ్ జలసంధి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ లేదా మాలే ద్వీపకల్పం, ఇండోనేషియాలోని సుమత్రా దీవి మధ్య ఉండే మలక్కా జలసంధి వంటి సహజ జలమార్గాలు కూడా కీలకమైన సముద్ర మార్గాలుగా ఉంటున్నాయి. వీటి గుండా వాణిజ్య నౌకలు పయనించలేని పరిస్థితులు ఎదురైనప్పుడు సరఫరాలో జాప్యం, నౌకా రవాణా చార్జీలు పెరిగిపోవడం కూడా జరుగుతుంది. చమురు మార్కెట్లో ఇది ఇప్పటికే కనిపిస్తోంది. కంటైనర్ షిప్పుల విషయానికి వస్తే, ఇప్పటికే కోవిడ్–19 సంబంధిత అంతరాయాలతో కల్లోల పరిస్థితిలో ఉన్నం దున తాజా ఘటన మరింత విషమ పరిస్థితులను నెలకొల్పుతుంది. షిప్పింగ్ పరిశ్రమపై, దాని కొనసాగింపుగా ప్రపంచ వాణిజ్యంపై వాణిజ్య ప్రభావాలు ఇప్పటికే గుర్తించదగిన స్థాయిలో ఉంటున్నాయి. పైగా షిప్పింగ్ పరిధికి మించి అనేక రంగాల్లో దీని పర్యవసానాలు ప్రపంచం అనుభవంలోకి రానున్నాయి. సూయెజ్ కాలువ గుండా నౌకా రవాణాకు ప్రత్యామ్నాయంగా ఆఫ్రికా ఖండం చుట్టూ సుదీర్ఘంగా సాగిపోయే మార్గం ఒకటుంది. పైగా ఇటీవల సంవత్సరాల్లో వాణిజ్య నౌకల కార్యనిర్వాహకులకు సముద్ర దొంగల దాడి పెద్ద తలనొప్పిగా మారింది. మొదటగా సోమాలియా తీరప్రాంతం.. తర్వాత ఇటీవల గల్ఫ్ ఆఫ్ గినియా ఇందుకు ఉదాహరణలు. ఈ ప్రత్యామ్నాయ మార్గంలో ఎదురవుతున్న సముద్ర దొంగల దాడుల గురించి కొన్ని షిప్పింగ్ కంపెనీలు ఇప్పటికే ఆందోళనను వ్యక్తం చేశాయి. ఇటీవల సంవత్సరాల్లో సోమాలియా కేంద్రంగా సాగుతున్న సముద్ర బందిపోట్ల దాడులను కాస్త అణచివేశారు తప్పితే పూర్తిగా ఓడించలేదని షిప్పింగ్ పరిశ్రమ సంస్థలు, అంతర్జాతీయ నౌకాయాన సంస్థలు సూచించాయి. అదే సమయంలో హిందూ మహాసముద్రం గుండా దక్షిణాఫ్రికా వైపు నౌకా ప్రయాణంతో పోలిస్తే గల్ఫ్ ఆఫ్ ఏడెన్ గుండా సూయెజ్ కెనాల్ వైపు పయనించే నౌకలకు సముద్ర దొంగల నుంచి ఎదురవుతున్న ప్రమాదం ఏమంత తక్కువ స్థాయిలో ఉండటం లేదు. కేప్ ఆఫ్ గుడ్ హోప్‌ని దాటిన తర్వాత యూరప్ చేరవలసిన నౌక సెనెగల్, కేబో వర్డే మధ్య ఉన్న ఇరుకు జలమార్గం గుండా పయనించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో వెళ్లే ఏ నౌక అయినా సరే పశ్చిమాఫ్రికాలో సముద్ర బందిపోట్లతో తలపడాల్సి ఉంది. పైగా ఆఫ్రికా చుట్టూ మరింత దగ్గర మార్గంలో వెళ్లాలనుకుంటే నైజీరియా నుంచి వెయ్యి నాటికల్ మైళ్ల దూరంలో రవాణా నౌకలు పయనించి తీరాల్సి ఉంటుంది. డిర్క్ సీబెల్స్ వ్యాసకర్త పీహెచ్డీ (సముద్ర భద్రత) స్కాలర్ గ్రీన్విచ్ యూనివర్సిటీ -
ఓడా.. ఓడా.. ఎందుకాగావు?
సూయెజ్: ఈజిప్టులోని ప్రఖ్యాత సూయెజ్ కాలువలో ఎవర్‌గివెన్ నౌక అడ్డం తిరగడం, దీంతో ప్రపంచ వాణిజ్యానికి దాదాపు వారం పాటు విఘాతం కలగడంపై విచారణ షురూ అయింది. వారం ప్రయత్నాల అనంతరం నౌకా ప్రతిష్ఠంభన ముగిసి తిరిగి నౌకల పయనం ఆరంభమవడంతో ఇప్పుడందరి దృష్టి అసలేం జరిగిందనే అంశంపైకి మరలింది. ఈజిప్టు ప్రభుత్వం, బీమా సంస్థలు, నౌకా సంస్థలతో పాటు పలువురు ఈ అంశంపై వివరాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కాలవ గట్ల ఆధునీకరణ, నౌకల రిపేరు వ్యయాలు, నౌకల కార్గో షిప్మెంట్ ఇన్సూ్యరెన్సుల్లాంటి పలు అంశాలు చర్చకురానున్నాయి. ఎవెర్గివెన్ నౌక ఓనర్ జపనీస్ కంపెనీ కాగా, దాన్ని నిర్వహిస్తున్నది తైవాన్ కంపెనీ, బయలుదేరింది పనామా నుంచి కాగా ప్రస్తుతం ఈజిప్టులో ఉంది, నౌకా సిబ్బంది భారతీయులు. దీంతో ఈ నౌక విషయం పలు దేశాలతో ముడిపడిఉందని షిప్పింగ్ నిపుణుడు జాన్కోనార్డ్ అభిప్రాయపడ్డారు. రోజుల తరబడి చిక్కుకుపోవడంతో నౌకకు భారీగానే డ్యామేజి జరిగి ఉంటుందంటున్నారు. సమగ్ర విచారణ కావాలి ప్రతిష్ఠంభనపై జరిగే విచారణలో పాల్గొంటామని నౌక సొంతదారైన జపాన్ కంపెనీ షోయి కిసెన్ కైషా తెలిపింది. అయితే విచారణ సమయంలో ఏ విషయాలు బహిర్గతం చేయరాదంటూ ఈ విషయంపై బహిరంగ ప్రకటనకు నిరాకరించింది. నౌక ఎందుకు నిలిచిపోయింది, నౌకకు ఏమి అడ్డం తగిలింది, నౌకకు రిపేర్లు ఎక్కడ చేయిస్తారు, ప్రమాద సమయంలో నౌకా వేగం ఎంత తదితర అంశాలనేవీ చెప్పలేమని పేర్కొంది. మరోవైపు నౌక కారణంగా జరిగిన రోజూవారీ నావిక నష్టాలు(పర్డే మారిటైమ్ లాస్) బిలియన్ డాలర్లలో ఉంటాయని, ఇవన్నీ క్రమంగా దావాల రూపంలో బయటకు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. నౌకకు 300 కోట్ల డాలర్ల మేర బీమా ఉంది, కానీ ఈ బీమా సంస్థలేవీ బడా బీమా సంస్థలు కావు. ప్రస్తుతానికి నౌకా చిక్కుదలను విడిపించేందుకు అయిన ఖర్చులను కెనాల్ అథార్టీకి ఎవెర్ గివెన్ ఓనర్ చెల్లిస్తుందని అంతర్జాతీయ లీగల్ సంస్థ క్లైడ్ అండ్ కో తెలిపింది. నౌకపై కెనాల్ అథార్టీ పెనాల్టీ విధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయితే ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరపాలని కంపెనీ కోరుతోంది. కెనాల్‌లోని నౌకా ట్రాఫిక్ క్లియరయ్యేందుకు మరో పదిరోజులు పట్టవచ్చని అంచనా. నౌక అడ్డం తిరగడంతో పలు నౌకలు సూయజ్ కెనాల్ మార్గం బదులు కేప్ ఆఫ్ గుడ్‌హోప్ మీదుగా ప్రయాణం చేయాల్సి వచ్చింది. చదవండి: ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది -
‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది
సూయెజ్(ఈజిప్ట్): సూయెజ్ కాలువలో కూరుకుపోయిన అత్యంత భారీ కంటెయినర్ ఓడ ‘ఎవర్ గివెన్’ ఎట్టకేలకు కదిలింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా దాదాపు వారం క్రితం ఈ ఓడ.. అంతర్జాతీయ సరుకు రవాణాలో కీలకమైన సూయెజ్ కాలువలో అడ్డం తిరిగి చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. దాంతో సూయెజ్ కాలువలో సరుకు రవాణా ఒక్కసారిగా ఆగిపోయింది. వారం రోజులుగా అంతర్జాతీయ సరుకు రవాణా నిలిచిపోయి, వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఈ నేపథ్యంలో ఆ భారీ రవాణా నౌకను కదిలించేందుకు అంతర్జాతీయ నిపుణులు గత వారం రోజులుగా చేస్తున్న కృషి సోమవారానికి ఫలించింది. వాతావరణ పరిస్థితులు, పోటెత్తిన అలలు కొంతవరకు వారికి సహకరించాయి. కూరుకుపోయిన నౌక భాగాన్ని కదిలించేందుకు ఒకవైపు డ్రెడ్జింగ్ చేస్తూ, మరోవైపు 10 టగ్ బోట్లతో వెనక్కు లాగుతూ నిపుణులు ప్రయత్నించారు. అలాగే, నౌక చుట్టూ 18 మీటర్ల లోతు వరకు 27 వేల క్యూబిక్ మీటర్ల ఇసుకను తొలగించారు. అనంతరం, కెనాల్ ఉత్తర, దక్షిణ తీరాలకు మధ్యనున్న వెడల్పైన ‘గ్రేట్ బిట్టర్ లేక్’ వద్దకు 2.2 లక్షల టన్నుల బరువైన ఆ నౌకను తీసుకు రాగలిగారు. అక్కడ ఆ నౌకను క్షుణ్నంగా పరిశీలిస్తారు. నౌక సాంకేతిక సామర్థ్యాన్ని పరీక్షిస్తారు. నౌక కదులుతున్న దృశ్యాలను ఉపగ్రహ ఛాయాచిత్రాలతో ‘మెరైన్‌ట్రాఫిక్.కామ్’ వెబ్సైట్లో పొందుపర్చారు. ఈ విధానం సఫలం కానట్లైతే, నౌకలోని దాదాపు 20 వేల కంటెయినర్లను వేరే షిప్‌లోకి మార్చి, అనంతరం, బరువు తగ్గిన ఈ నౌకను కదిలించాల్సి వచ్చేది. ఇసుక, బురదలో కూరుకుపోయిన ‘ఎవర్ గివెన్’ నౌకను తిరిగి కదిలించి, ప్రధాన మార్గంలోకి తీసుకువచ్చే బాధ్యతను ‘బొస్కాలిస్’ అనే నౌకా నిర్వహణ, మరమ్మత్తుల సంస్థకు అప్పగించారు. ఆ పని పూర్తికాగానే ‘మా పని పూర్తి చేశాం. సూయెజ్ కెనాల్ అథారిటీస్‌తో కలిసి మా నిపుణులు ఎవర్‌గివెన్‌ను జలాల్లోకి తీసుకురాగలిగారు. ఈ కాలువ ద్వారా రవాణా మళ్లీ ప్రారంభమయ్యేందుకు మార్గం సుగమమయింది’ అని ఆ సంస్థ సీఈఓ పీటర్ ప్రకటించారు. కాలువ మార్గానికి అడ్డంగా గత మంగళవారం జపాన్‌కు చెందిన సరకు రవాణా నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుపోవడంతో వారం రోజులుగా అంతర్జాతీయ రవాణా నిలిచింది. దాంతో రోజుకు దాదాపు 900 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లింది. సూయెజ్ కాలువ మార్గంలో వారం రోజుల పాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడిన నేపథ్యంలో.. ఎవర్ గివెన్ నౌకను కదిల్చినప్పటికీ.. ఈ కాలువ గుండా సాధారణ స్థాయిలో నౌకల రవాణా జరిగేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. ఇప్పటికే దాదాపు 367 నౌకలు ఇరువైపులా నిలిచిపోయాయి. ఇవన్నీ క్లియర్ అయ్యేందుకు 10 రోజులు పడుతుందని రిఫినిటివ్ అనే సంస్థ అంచనా వేసింది. పలు నౌకలు ప్రత్యామ్నాయ, సుదూర మార్గమైన ‘కేప్ ఆఫ్ గుడ్‌హోప్’ ద్వారా వెళ్తున్నాయి. అంతర్జాతీయ సరకురవాణా వాణిజ్యంలో 10% సూయెజ్ కాలువ ద్వారా జరుగుతుంది. క్రూడాయిల్ రవాణాలో ఈ మార్గం వాటా దాదాపు 7%. గత సంవత్సరం ఈ మార్గం గుండా 19 వేలకు పైగా నౌకలు వెళ్లాయి. -
కదిలిన ఓడ.. దృశ్యాలు వైరల్
సూయజ్ కాలువలో ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ భారీ ఓడ ఎట్టకేలకు కదిలింది. ఆ ఓడ కదలడంతో ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. ఇక వాణిజ్య ఓడలు రాకపోకలు సాగించేందుకు మార్గం సుగమమైంది. దాదాపు వారం పాటు సముద్రంలో ఏర్పడిన ట్రాఫిక్ జామ్ క్లియర్ కానుంది. ఓడ కదులుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఉన్న ఈ కాలువలో పెద్ద ఎత్తున ఓడలు ప్రయాణిస్తుంటాయి. వాణిజ్య ఓడల ప్రయాణం కోసం ఈ కాలువ నిర్మించారు. కాలువలో చిక్కుకున్న భారీ నౌకతో రోజుకు రూ.72 వేల కోట్ల చొప్పున వారం రోజులుగా నష్టం ఏర్పడింది. దీంతో ప్రపంచ ఆర్థికవ్యవస్థ అతలాకుతలమైంది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కాలువలో ఇరుక్కున్న ఈ భారీ నౌక ఎట్టకేలకు కదిలింది. ఈ ఓడను కదిలించడంలో భారతదేశానికి చెందిన నౌక నిపుణులు కూడా వెళ్లారని తెలుస్తోంది. ఈ నౌకను కదిలించేందుకు పలు దేశాలు కూడా ముందుకు వచ్చి చర్యలు తీసుకున్నాయి. సమష్టి కృషితో ఎట్టకేలకు ఎవర్ గ్రీన్ ఓడను కదిలించారు. ఆ ఓడ నీటిలోకి చేరడంతో అక్కడి శ్రామికులు, అధికారులు హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ తెలిపారు. మధ్యదరా సముద్రం నుంచి ఎర్ర సముద్రం మధ్య ఈ సూయజ్ కాలువ ఉంది. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు హర్షం వ్యక్తం చేశాయి. 🎥: The #EVERGIVEN vessel is sailing North in the #SuezCanel. #Suez #SuezUnblocked #SuezBLOCKED #Evergreen pic.twitter.com/jm3AgOgAJZ — Mohammed Soliman (@ThisIsSoliman) March 29, 2021 🌇 #مشاريع_مصر🇪🇬| The Suez Canal Authority (SCA) announced that Ever Given container ship is currently sailing north on its way to the Bitter Lakes in the canal.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #قناة_السويس #السفينة_الجائحة pic.twitter.com/1flUiNliFv — مشاريع مصر Egypt (@EgyProjects) March 29, 2021 -
రోజుకు 72వేల కోట్లు నష్టం : తాజా శుభవార్త
సాక్షి, న్యూఢిల్లీ : సూయజ్ కెనాల్లో చిక్కుకున్న భారీ నౌక ప్రపంచవ్యాప్తంగా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రోజుకు 72వేల కోట్ల రూపాయల చొప్పున గత వారం రోజులుగా సంభవించిన నష్టం ప్రపంచ ఆర్థికవ్యవస్థను అతలాకుతలం చేసింది. ప్రపంచంలో పదోవంతు వ్యాపారం జరిగే సూయజ్ కెనాల్లో ఇరుక్కున్న ఈ భారీనౌకను దారిలోకి తీసుకొచ్చేందుకు మల్లగుల్లాలు పడుతున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన ఒక గుడ్‌న్యూస్ ఊరటనిస్తోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పెను సవాల్‌గా భారీ కంటైనర్ షిప్ ఇపుడు పాక్షికంగా ముందుకు కదిలింది. తాజా పరిణామంతో ఈ ప్రతిష్టంభనకు త్వరలోనే తెరపడనుందనే ఆశలు భారీగా వ్యాపించాయి. షిప్పింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ మారిటైమ్ సర్వీసెస్ సంస్థ ఇంచ్‌కేప్ ఈ వార్తను ధృవీకరించింది. ఈ మేరకు ‘ఎవర్ గివెన్’ నౌక కదిలిందంటూ సోమవారం సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేసింది. అటు "ఇది శుభవార్త" అని సూయజ్ కెనాల్ అథారిటీ చైర్మన్ ఒసామా రాబీ మీడియాకు చెప్పారు. ఇంకా పూర్తి కాలేదు, కానీ కొంచెం కదిలిందని వెల్లడించారు. కానీ 400కి పైగా నౌకల ప్రతిష్టంభనకు ముగింపు ఎపుడనేదిమాత్రం స్పష్టం చేయలేదు. షిప్-ట్రాకింగ్ సిస్టం వెసెల్ ఫైండర్ వెబ్సైట్లో ఎవర్ గివెన్ స్టేటస్‌ను అండర్వేగా మార్చుకుందని, తద్వారా జలమార్గం త్వరలో తిరిగి తెరుచుకోనుందనే ఆశలు పెంచుతోందంటూ ఈజిప్ట్ టుడే మ్యాగజీన్ ట్వీట్ చేసింది. కాగా ఈ షిప్‌ను ముందుకు కదిలించే ప్రయత్నాలు నిలిపివేశామని సూయజ్ కెనాల్ అథారిటీ (ఎస్‌సిఎ) ఈ ప్రయత్నాన్ని వాయిదా వేశామని ఆదివారం ప్రకటించారు. తగినంత టగ్ శక్తి అమలయ్యే వరకు తదుపరి రిఫ్లోటింగ్ ప్రయత్నాన్ని సోమవారం సాయంత్రానికి వాయిదా వేయాలని నిర్ణయించింది. రాబోయే 24-48 గంటల్లో ఓడను తరలించే అవకాశం ముందని కూడా షిప్పింగ్ డేటా, న్యూస్ కంపెనీ లాయిడ్స్ లిస్ట్ ఎడిటర్ రిచర్డ్ మీడే వ్యాఖ్యానించారు ఈ నేపథ్యంలో తాజా వార్తలు భారీ ఊరటనిస్తున్నాయి. అటు వేల కిలోమీటర్ల ఇసుకలో ఆఫ్రికా నుంచి సినాయ్ పెనిన్సులా మధ్యలో ఉన్న ఈ కెనాల్లో చిక్కుకుపోయిన ఈషిప్ను ఎవర్ గ్రీన్ అనే పనామా షిప్పింగ్‌కి చెందిన నౌకని కదల్చలేని పరిస్థితిలో ఇక చేసేదిలేక డ్రెడ్జింగ్‌కూడా సిద్ధమవుతున్నట్లు ఒసామా రాబేయ్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ షిప్‌ను విడిపించేందుకు మరిన్ని టగ్బోట్లు అవసరమని ఈజిప్టు అధికారులు ఆదివారం నిర్ణయించారు. సుమారు 20వేల కంటైనర్లను తొలగించడానికి సన్నాహాలు ప్రారంభించారు. మరోవైపు రష్యా ఇప్పటికే సహాయాన్నిఅందించగా, అమెరికాతో సహా ఇతర దేశాలు కూడా ముందు కొస్తున్నాయి. ఈజిప్ట్ ప్రభుత్వం కోరితే సాయం చేయడానికి తాము సిద్దమంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. (సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) #BREAKING: watch video of the Ever Given, which was previously clogging the Suez Canal and has now been refloated. Good news in #Egypt. pic.twitter.com/6HbkeBpA40 — Steve Hanke (@steve_hanke) March 29, 2021 #BREAKING | Ship-tracking service VesselFinder has changed Ever Given’s status to under way on its website. raising hopes the busy waterway will soon be reopened.#Egypt #Suez #SuezCanal #EVERGIVEN #Evergreen #BreakingNews|#قناة_السويس #السفينة_الجائحة #عاجل pic.twitter.com/lz5EuNM5Ty — Egypt Today Magazine (@EgyptTodayMag) March 29, 2021 -
సూయజ్‌కు ఎందుకంత ప్రాధాన్యం, మీకీ విషయాలు తెలుసా?
సూయజ్ కెనాల్లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా? 1967 జూన్‌లో 14 కార్గో నౌకలు సూయజ్ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరిగింది కొన్ని రోజులే.. కానీ కాల్వ మూసేయడంతో నౌకలు మాత్రం ఎనిమిదేళ్లు అక్కడే చిక్కుకుపోయాయి. ఇంతకీ జగడమెందుకు? సూయజ్ కెనాల్.. కేవలం సరుకు రవాణాకే కాదు.. సుమారు శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికీ కేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్ వంటి యూరప్ దేశాలు వ్యాపారం పేరిట ఆసియా దేశాలను ఆక్రమించినప్పటి సమయం అది. ఆ దేశాల వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాసియా దేశాలకు చేరాల్సి వచ్చేది. ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టేది. ఖర్చు ఎక్కువగా అయ్యేది. ఆ క్రమంలోనే మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రానికి మార్గం కలిపేందుకు.. 1859లో ఈజిప్ట్ మీదుగా 193 కిలోమీటర్ల పొడవునా భారీ కాల్వ తవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఫ్రాన్స్ ఎక్కువగా ఖర్చుపెట్టింది, బ్రిటన్ కూడా జత కలిసింది. 1869 నుంచి నౌకలు వెళ్లడం మొదలైంది. అప్పటి నుంచీ సూయజ్ కాల్వ మీద ఫ్రాన్స్, బ్రిటన్ల పెత్తనం కొనసాగింది. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాల్వను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ టైంలోనే ఈజిప్ట్‌పై ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాలు వంటివి జరిగాయి. (చదవండి: సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) కాల్వలో పడవలు ముంచి.. యుద్ధం తర్వాతి ఉద్రిక్తతలు ఎఫెక్ట్ సూయజ్ కెనాల్‌పై పడింది. కాల్వను మూసేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. కొన్ని పడవలను ముంచేసి, మట్టి, ఇసుక వంటివి వేసి అక్కడక్కడా కాల్వలో అడ్డంకులు కల్పించారు. దాంతో అప్పటికే ప్రయాణిస్తున్న నౌకలన్నీ కాల్వ మధ్యలో చిక్కుకుపోయాయి. గాలుల వల్ల పక్కనే ఉన్న ఎడారి నుంచి వచ్చిన ఇసుక, దుమ్ముతో నౌకలు నిండిపోయాయి. దీనినే ‘ది యెల్లో ఫ్లీట్ (పసుపు దళం)’గా పిలుస్తారు. మళ్లీ యుద్ధంతోనే తెరుచుకుని.. యుద్ధంతో మూతపడిన సూయజ్ కాల్వ తిరిగి తెరుచుకోవడానికి కూడా మరో యుద్ధమే కారణమైంది. 1973లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం జరిగి.. రెండు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఆ దెబ్బతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితే 1975లో కెనాల్‌ను తిరిగి ఓపెన్ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఏడు వేల కిలోమీటర్లు తిరిగిపోవాలి ప్రపంచంలో 70 శాతానికిపైగా జనాభా ఉన్న యూరప్, ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి సూయజ్ కాల్వ ఎంతో కీలకం. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం వరకు ఈ కాల్వ మీదుగానే జరుగుతుంది. ఈ కాల్వ లేకుంటే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు.. మొత్తంగా ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ రూట్ అంటారు. మన ముంబై నుంచి లండన్‌కు సూయజ్ కాల్వ మీదుగా వెళితే 11,600 కిలోమీటర్ల దూరం వస్తుంది. వాతావరణం, ఇతర అంశాల పరంగా ఇది భద్రమైన మార్గం. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళితే ఏకంగా 19,800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ మార్గంలో తుపానులు, ఇతర సమస్యలు ఎన్నో ఉంటాయి. నౌకలకు ప్రమాదకరం కూడా. అందుకే సూయజ్ కాల్వకు ఇంత ప్రాధాన్యత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మన పోర్టులపై సూయజ్ ప్రభావం అంతంతే
సాక్షి, అమరావతి: సూయజ్ కాలువలో తలెత్తిన సమస్య ప్రభావం రాష్ట్ర పోర్టులపై పెద్దగా లేదని.. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుంచి నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రకటించింది. విశాఖ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టులపై సూయజ్ ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ నుంచి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా వంటి దేశాలకు నౌకా వాణిజ్యం ఎక్కువని, యూరప్ దేశాలతో లావాదేవీలు తక్కువగా ఉండటంతో ‘సూయజ్’ సమస్య అంతగా ప్రభావం చూపదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మధ్యధరా, హిందూ మహా సముద్రాలను కలుపుతూ ఈజిప్టు వద్ద నిర్మించిన సూయజ్ కాలువలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కార్గో నౌక ‘ఎవర్ గివెన్’ పెనుగాలులకు అడ్డం తిరిగి నిలిచిపోవడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ కాలువ ద్వారా ఆసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు నిత్యం 35కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. ఎవర్ గివెన్ నౌక అడ్డంగా నిలిచిపోవడంతో ఇప్పటివరకు 300 నౌకలు వరకు నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత సముద్ర వాణిజ్యంపై తీవ్రంగానే ఉంది. సూయజ్ కాలువ ద్వారా మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రూ.14,80,000 కోట్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నట్టు కేంద్ర నౌకాయాన శాఖ అంచనా వేసింది. తాజా సమస్య చమురు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యవసర సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీంతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇక్కడి పోర్టుల్లో పరిస్థితిని సమీక్షించింది. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 4 రాష్ట్ర పోర్టుల ద్వారా ఏటా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఒక్క విశాఖ పోర్టు ద్వారానే 100 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతుండగా, గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం ద్వారా 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా అవుతోంది. వీటిలో బియ్యం, జొన్నలతోపాటు గ్రానైట్, బొగ్గు, ముడి ఇనుము, బెరైటిస్ వంటి ఖనిజాలే ఎక్కువ. ఈ పోర్టుల నుంచి యూరప్‌కు వెళ్లే నౌకలు లేకపోవడంతో సూయజ్ ప్రభావం ఏపీ మారిటైమ్‌పై పెద్దగా ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు. -
రోజుకి వెయ్యి కోట్ల డాలర్ల నష్టం
ఇస్మాలియా(ఈజిప్ట్): అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కీలక పాత్ర పోషించే ఈజిప్టులోని సూయజ్ కాలువలో అత్యంత భారీ సరకురవాణా నౌక చిక్కుకుపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. 180కిపైగా చమురు, సరకు రవాణా నౌకలు ఎటూ వెళ్లలేక ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రోజుకి దాదాపుగా వెయ్యి కోట్ల డాలర్లు నష్టం వస్తున్నట్టుగా అంచనా. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరుకు రవాణా చేసే పనామాకు చెందిన ఎవర్ గివెన్ అనే భారీ నౌక సూయజ్ కాలువ మార్గంలో అడ్డంగా ఇరుక్కుంది. 2 లక్షల మెట్రిక్ టన్నుల బరువు ఉండే ఈ నౌకని ముందుకి కదల్చడం సాంకేతిక నిపుణులకు సవాల్‌గా మారింది. కాగా, ఈ నౌకలో మొత్తం 25 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారని, వీరంతా భారతీయులేనని నౌక యజమాని చెప్పారు. నౌక ఎలా చిక్కుకుంది ? సూయజ్ కాలువ మానవ నిర్మితం కావడంతో అక్కడక్కడా మార్గాలు చాలా ఇరుగ్గా ఉంటాయి. చైనా నుంచి నెదర్లాండ్స్‌కు వెళుతున్న ఈ భారీ నౌక మంగళవారం ఇరుకు మార్గం దగ్గరకు వచ్చేసరికి ఆ ప్రాంతంలో తుపాను వాతావరణం నెలకొని ఉంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. ఆ రాకాసి గాలుల ధాటికి తీర ప్రాంతంలో ఇసుక కాల్వలో చేరి మేటలు వేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ముందున్న మార్గం కనిపించకపోవడంతో సిబ్బంది నౌకపై నియంత్రణ కోల్పోయారు. దీంతో ఆ నౌక ఇసుక మేటల్లో అడ్డంగా కూరుకుపోయింది. ఎంత భారీ నౌక ?..: ఈ నౌక ఈఫిల్ టవర్ కంటే పొడవైనది. మూడు ఫుట్‌బాల్ గ్రౌండ్ల కంటే పెద్దది. ఈ నౌకలో మొత్తం పన్నెండు అంతస్తులు ఉన్నాయి. ఈ నౌక ఇంచుమించుగా 1300 అడుగుల పొడవు, 193 అడుగుల వెడల్పు ఉంటుంది. నౌకని బయటపడేయడం ఎలా ? నౌకను మళ్లీ కదల్చడం అంత సులభంగా జరిగేది కాదని నావికారంగ నిపుణులు చెబుతున్నారు. నౌక చుట్టూ పేరుకుపోయిన ఇసుక బురదను తొలగించడానికి డ్రెడ్జింగ్ పరికరాలతో గత రెండు రోజులుగా యత్నిస్తున్నారు. నౌక అడుగున ఉన్న బురద వదులైతే నౌకని నిలువుగా తిప్పడానికి కుదురుతుందని ఆ నౌక మేనేజర్ బెర్న్‌హర్డ్ చెబుతున్నారు. అయితే దీనికి ఎంత సమయం పడుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఒకట్రెండు రోజుల్లోనే నౌకని ముందుకు కదలేలా చేయవచ్చునని, లేదంటే వారాలైన పట్టవచ్చునని ఈ సహాయ కార్యక్రమంలో పాల్గొంటున్న డచ్ కంపెనీ బోస్కలిస్ సీఈవో పీటర్ బెర్డోవ్స్కి తెలిపారు. కాలువలో భారీగా కెరటాలు వస్తే నౌక ముందుకు కదిలే అవకాశం ఉందని, ఆ స్థాయిలో కెరటాలు రావాలంటే ఆది, సోమవారాల వరకు వేచి చూడాలని సాల్వేజ్ మాస్టర్ నిక్ సోలెన్ చెప్పారు. ఎందుకింత ఆందోళన ? 120 మైళ్లున్న సూయజ్ కాలువను 1869లో నిర్మించారు. ఉత్తరాన మధ్యధరా సముద్రాన్ని, దక్షిణాన ఉన్న ఎర్ర సముద్రాన్ని ఇది కలుపుతుంది. ఆసియా, యూరప్ దేశాల మధ్య సరకు రవాణా జరగాలన్నా, అరబ్ దేశాల నుంచి చమురు యూరప్ దేశాలకు , అక్కడ్నుంచి అమెరికాకు వెళ్లాలంటే ఈ కాలువే ఆధారం. అంతర్జాతీయ వాణిజ్యంలో 12% ఈ కాలువ ద్వారా జరుగుతుంది. ప్రపంచంలోని వాణిజ్య నౌకల్లో 30% ఈ కాలువ మీదుగా ప్రయాణిస్తాయి. కరోనా సంక్షోభం ప్రపంచ దేశాలను కుదిపేసినప్పటికీ 2020లో 19వేల నౌకలు ఈ మార్గం వెంబడి ప్రయాణించాయి. అంటే సగటున రోజుకి 52 నౌకలు రాకపోకలు సాగించాయి. 1.17 బిలియన్ టన్నుల సరకు రవాణా జరిగింది. ఇప్పుడు భారీ నౌక కాలువలో అడ్డంగా ఇరుక్కుపోవడంతో కాల్వకి రెండు వైపుల నుంచి రాకపోకలు నిలిచిపోయినట్టుగా ఈజిప్టు అధికారులు వెల్లడించారు. రవాణా స్తంభించడంతో యూరప్ దేశాల్లో వాణిజ్యంపై ప్రభావం పడింది. చమురు ధరలు భగ్గుమన్నాయి. బారెల్‌కు 5శాతం పెరిగిపోయాయి. కాలువ మార్గంలో అడ్డంగానిలిచిన ఎవర్ గివెన్ -
‘ఎవర్ గివెన్’ చెప్పే గుణపాఠం
చరిత్రలో ఎన్నో ఉత్కంఠభరిత ఘట్టాలకు మౌన సాక్షిగా వున్న సూయిజ్ కెనాల్ మరోసారి వార్తల్లో కెక్కింది. మంగళవారం వేకువజామున హఠాత్తుగా విరుచుకుపడిన ఇసుక తుపానులో సరుకులతో వెళ్తున్న భారీ నౌక ‘ఎవర్ గివెన్’ చిక్కుకుంది. గత రెండురోజులుగా ఆ నౌక అంగుళం కూడా అటూ ఇటూ కదులుతున్న జాడ లేదు. పర్యవసానంగా ముంబై, ఢిల్లీ, బెంగళూరువంటి మహా నగరాల్లో మనం తరచుగా చూసే నరకప్రాయమైన ట్రాఫిక్ జామ్‌లను తలదన్నే రీతిలో ఇప్పుడు సూయిజ్ కెనాల్ వుంది. ‘ఎవర్ గివెన్’ మొరాయించిన సమయానికి కెనాల్లో ప్రవేశించివున్న దాదాపు 200 నౌకలు చిక్కుకుపోయాయి. ఎర్ర సముద్రాన్నీ, మధ్యధరా సముద్రాన్ని అనుసంధానించి తూర్పు, పడమరలను ఏకం చేసి, ఖండాంతర వాణిజ్యంతో ఎవరూ అందుకోలేనంత ఎత్తులో వుండాలని కలగని 1859లో ఈ కాలువ నిర్మాణానికి శ్రీకారంచుట్టారు. వాస్తవానికి ఇది అప్పుడు కొత్తగా పుట్టుకొచ్చిన ఆలోచన కాదు. ప్రాచీన ఈజిప్టు రాచరిక వ్యవస్థలు క్రీస్తుపూర్వమే దీన్ని కలగన్నాయి. నెపోలియన్ సైతం ఈ కెనాల్ నిర్మిస్తే బ్రిటన్‌ని దారికి తేవొచ్చని, దానిపై పైచేయి సాధించవచ్చని ఆలోచించాడు. కానీ చివరకు ఫ్రాన్స్ ఏలుబడిలోని ఈజిప్టుకే కాలం కలిసొచ్చింది. ఒక ఫ్రాన్స్ దౌత్యవేత్త చొరవతో ఏర్పాటైన కంపెనీ 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన దాదాపు 194 కిలోమీటర్ల పొడవైన ఈ కాలువను నిర్మించింది. దీనివల్ల కలిగే లాభాన్ని గుర్తించి బ్రిటన్ ఇందులో 40 శాతం వాటాను పోరుపెట్టి సాధించుకుంది. ప్రపంచంలో ఇంకా పనామా కెనాల్, వోల్గా డాన్ కెనాల్, గ్రాండ్ కెనాల్ వంటివి వున్నాయి. కానీ సూయిజ్ ప్రధాన సముద్ర మార్గాలను అనుసంధానించే మెరుగైన కెనాల్. పర్యావరణవేత్తలు కావొచ్చు, నౌకాయాన రంగ నిపుణులు కావొచ్చు... రాకాసి నౌకా నిర్మాణం జోలికిపోవద్దని చాన్నాళ్లుగా వేడుకుంటున్నారు. అనుకోని ప్రమాదాలు ఎదురైతే భారీ నౌకలతో చేటు తప్పదని ప్రాణ నష్టంతోపాటు సముద్ర జలాలు కాలుష్యమయమై పర్యావరణానికి హాని కలుగుతుందని చెబుతున్నారు. కానీ పెద్ద మొత్తంలో సరుకు పంపిణీ చేయటానికి, భారీగా ఆదాయం రాబట్టడానికి భారీ నౌకలే మేలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే వారి హెచ్చ రికలను ఎవరూ పట్టించుకుంటున్న దాఖలా లేదు. ఇప్పుడు ‘ఎవర్ గివెన్’ అడ్డం తిరిగిన వైనం వారి హితవచనాలను మరోసారి గుర్తుకుతెస్తోంది. 2,20,000 టన్నుల సరుకును మోసుకుపోగల సామర్థ్యం దానికుంది. అయితే ఆ నౌక పూర్తిగా కుంగిపోయే స్థితి ఏర్పడకపోవటం ఒక రకంగా అదృష్టమే. ప్రపంచ వాణిజ్యం గత రెండున్నర దశాబ్దాల్లో వందల రెట్లు విస్తరించింది. ఒకప్పుడు ఆహారం, సరుకులు, చమురు, ఖనిజాలు వంటివే ప్రధానంగా రవాణా కాగా, ఇంటర్నెట్ అందు బాటులోకి రావటంతో విశ్వవ్యాప్త వస్తు సేవలు విపరీతంగా పెరిగాయి. విమానయానం ఎంత వేగంతో కూడినదైనా, విమానాల ద్వారా సరుకు రవాణా ఎంతగా విస్తరించినా వాణిజ్యంలో ఈనాటికీ 90 శాతం వాటా సముద్ర మార్గాలదే. ఇందులో సూయిజ్ కెనాల్ ద్వారా సాగే వాణిజ్యం దాదాపు 15 శాతం. పశ్చిమాసియా నుంచి యూరప్, అమెరికాలకు... రష్యా నుంచి ఆసియా దేశాలకు ముడి చమురు రవాణా సాగుతున్నదీ ఇటునుంచే. అందుకే ఈ దిగ్బంధం సాధ్యమైనంత త్వరగా పరిష్కారం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా సరుకు పంపిణీలో అస్తవ్యస్థ పరిస్థితులు తలెత్తవచ్చన్న ఆందోళన వుంది. ఆసియా, ఆఫ్రికా ఖండాలను విడదీసే ఈ కెనాల్... యూరప్‌కు రాకపోకలు సాగించే నౌకలు దక్షిణ అట్లాంటిక్, హిందూ మహాసముద్రాల మీదుగా వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తోంది. అందువల్ల దాదాపు ఏడువేల కిలోమీటర్ల దూరం తగ్గుతోంది. వారం రోజుల సమయాన్ని ఆదా చేస్తోంది. రోజూ సగటున 50 నౌకలకు వరకూ ప్రయాణించే సూయిజ్ కాల్వ ఈజిప్టు ఖజానాకు డాలర్ల వర్షం కురిపిస్తోంది. ప్రస్తుతం ఆ దేశం ఏటా దాదాపు 1,500 కోట్ల డాలర్ల ఆదాయాన్ని పొందుతోంది. సూయిజ్ కెనాల్‌ను మరింత విస్తరించటానికి ఆ దేశం ఇప్పటికే పనులు ప్రారంభించింది. అదంతా మరో రెండేళ్లలో పూర్తయితే ఈజిప్టు ఆదాయం మూడింతలు పెరుగుతుంది. అంతర్జాతీయ నావికా సంస్థ(ఐఎంఓ) విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం నౌకాయానం వల్ల ఏటా వాతావరణంలోకి వేయి మెట్రిక్ టన్నుల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతోంది. ఇది ప్రపంచ వార్షిక ఉద్గారాల్లో 3.1 శాతం. 2050నాటికి ఉద్గారాలను కనీసం 50 శాతం తగ్గించుకోవాలని ఐఎంఓ కోరుతోంది. భారీ నౌకల వల్ల పొంచివుండే ఇతరత్రా ప్రమాదాల సంగతలావుంచి వాటి ఇంధన సామర్థ్యం తక్కువని ఐఎంఓ చెబుతోంది. కనీసం కొత్త సాంకేతికతలను పెంచుకుని, మెరుగైన డిజైన్లతో నౌకల్ని నిర్మిస్తే, వాటి వేగాన్ని నియంత్రణలోవుంచితే కర్బన ఉద్గారాల బెడదను గణనీయంగా తగ్గించుకోవచ్చన్నది దాని సూచన. నౌకల వేగాన్ని సగటున పదిశాతం తగ్గిస్తే కర్బన ఉద్గారాలను నియంత్రించటం వీలవుతుందని సూచిస్తోంది. నౌకల వేగంపై నిరంతరం నిఘా వుంచుతూ అవి ఎక్కడ సంచరిస్తున్నాయో, వాటి వేగం, దిశ ఎలావున్నాయో తెలుసుకునే సాంకే తికతలు అందుబాటులోకొచ్చాయి. వాటిని అమర్చుకోవటాన్ని తప్పనిసరి కూడా చేశారు. 150 ఏళ్లక్రితం అందుబాటులోకొచ్చి, ప్రపంచ వాణిజ్యంలో కీలకపాత్ర పోషించే సూయిజ్ కెనాల్లో చోటుచేసుకున్న తాజా ఉదంతం నౌకా యానంలో ఇమిడివుండే సమస్యలను మరోసారి అందరి దృష్టికీ తెచ్చింది. -
సూయజ్‌కు అడ్డంగా నౌక.. గంటకు రూ.3వేల కోట్ల నష్టం
‘హోల్డింగ్ అప్ ఏ ట్రైన్’.. అని హెన్రీ కథ ఒకటి ఉంది. అందులో కథానాయకుడు గన్ పాయింట్ లో ట్రైన్ రాబరీ చేస్తుంటే.. బోగీల్లో ఉన్న పురుష ప్రయాణికులు గజగజ వణికి పోతుంటారు. మహిళా ప్రయాణికులు మాత్రం భయమన్నదే లేకుండా.. ‘రైలు దోపిడీ ఇలాగుంటుందా..’ అన్నట్లు కళ్లు టపటపలాడిస్తూ కుతూహలంగా చూస్తుంటారు! మంగళవారం ఉదయం సూయజ్ కెనాల్ లో ఓ భారీ షిప్పు.. కడుపు లో బిడ్డ అడ్డం తిరిగినట్లుగా.. అడ్డంగా నిలిచి పోగానే అటు ఇటు ట్రాఫిక్ జామ్ అయింది. వెనుక షిప్ లలో ఉన్న మగాళ్ల బీపీ పెరిగిపోతోంది. వాళ్లలో ఉన్న జూలియాన్ అనే ఆవిడ మాత్రం ‘ఇట్స్ ఫన్నీ’ అని చిరునవ్వులు చిందిస్తూ తను ఉన్న షిప్ లోంచి, ఆగిపోయిన ఆ భారీ షిప్ ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అయితే మన స్టోరీ జూలియా పై కాదు. పురుషుల బీపీ మీదా కాదు. సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ క్లియర్ అయిందా? అసలు అలా ఎలా ఆ షిప్పు ఇరుక్కుపోయింది? సూయజ్ కెనాల్‌కు ఇలాంటి సమస్య ఇదే మొదటిసారా? సూయజ్ లో రోజుకు ఎన్ని షిప్ లు ప్రయాణిస్తాయి? ఆ కెనాల్‌ను ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు? సూయజ్ పై హటాత్తుగా ఇన్ని ప్రశ్నలు రేకెత్తించి, ఇంత ఆసక్తిని కలుగజేసిన జూలియాన్కు ధన్యవాదాలు తెలువుకుంటూ ‘సూయజ్ కాలవ’లో కాసేపు ప్రయాణిద్దాం. కొన్ని జలమార్గాల్లోనే భారీ ఓడలు వెళ్లగలవు. అందుకే పనామా కాలువ నుంచి వెళ్లలేని అల్ట్రా లార్జ్ కంటెయినర్ షిప్.. ‘ఎవర్ గివెన్’ చైనా నుంచి నెదర్లాండ్స్ వెళ్లేందుకు సూయెజ్ కాలువ ను ఎన్నుకుంది. అయితే ఊహించని విధంగా పెను గాలులు వీచడంతో మంగళవారం ఉదయం ఎవర్ గివెన్ నౌక ఒక్కసారిగా కెనాల్‌పై అడ్డంగా తిరిగి, ఉన్నచోటే ఉండిపోయింది. బుధవారం సాయంత్రం వరకు కూడా నౌకను తిరిగి యథాస్థితికి తెచ్చి కాలువపై ట్రాఫిక్‌ను పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. మార్గానికి రెండువైపులా ఎక్కడి ఓడలు అక్కడే ఆగిపోయాయి! ‘ఎవర్ గివెన్’ తైవాన్‌లో తయారై, పనామాలో రిజిస్టర్ అయిన నౌక. అందులో వందలాదిగా కంటెయినర్లు ఉండిపోయాయి. సూయజ్ కాలువపై రవాణా మొత్తం స్తంభించిపోయింది. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజ వాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ప్రస్తుతం షిప్ చిక్కుకున్న కారణంగా గంటకు సుమారు 3వేల కోట్ల నష్టం జరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. 400 మీటర్ల పొడవు, 59 మీటర్ల వెడల్పు ఉన్న ఈ అతి భారీ నౌక సూయజ్ నగర సమీపంలో సూయజ్ కాలువ ముఖద్వారానికి దక్షిణం వైపు నుంచి ఉత్తరానికి 6 కి.మీ. దూరంలో చిక్కుకుపోయింది. ఈ అనూహ్య ఘటనకు సంబంధించి ప్రపంచానికి అందిన తొలి ఫొటో.. జూలియన్ కోనా అనే మహిళ తీసి షేర్ చేసిన ఫొటో. ఎవర్ గివెన్ నౌక వెనక ఉన్న మేరస్క్ డెన్వర్ అనే ఓడలో ఆమె ప్రయాణిస్తున్నారు. తమ ముందున్న నౌక అలా విడ్డూరంగా కాలువకు అడ్డం తిరిగి ఆగిపోవడం ఆమెకు ఫన్నీగా అనిపించి ఫొటో తీసి ఇన్‌స్టాలో పెట్టుకున్నారట. గతంలో ఇలాంటివి జరగలేదని కాదు. జరిగినా ఐదారు గంటల్లో రద్దీని తొలగించ గలిగారు. ఈ సారి 36 గంటలు దాటుతున్నా ఎవర్ గివెన్‌ను కదిలించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. టగ్ బోట్లు, డిగ్గర్ నిర్విరామంగా పని చేస్తున్నాయి. ఆ నౌకను దారిలో పెట్టడానికి బహుశా కొన్ని రోజులు పట్టవచ్చని ఈజిప్టులోని కెనాల్ నిర్వాహకులు ఇప్పటికే ఒక ఆందోళన సంకేతాన్ని విడుదల చేశారు కూడా! రెండు లక్షల 20 వేల టన్నుల బరువైన ఎవర్ గివెన్‌ను కదలిస్తే తప్ప ప్రస్తుతం ఆ మార్గంలో ఆగిపోయి ఉన్న సౌదీ, రష్యన్, ఒమన్, యు.ఎస్. ఇంధన ట్యాంకర్ ఓడలు ముందుకు కదలడానికి వీల్లేని పరిస్థితి. రోజూ కనీసం 50 నౌకలు ప్రయాణించే ఈ మార్గంలో ప్రస్తుతం చిన్న పెద్ద కలిపి వందకు పైగా నౌకలు నిలిచిపోయాయి. జూలియన్ కోలన్కు ఈ ఘటన ఫన్నీగా అనిపించినట్లే.. ట్విటిజెన్‌లు కొందరు ఫన్నీగా కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. ‘‘మున్ముందు టగ్ బోట్లు, డిగ్గర్లలో అనుభవం కలిగిన వారికి ఉద్యోగావకాశాలు ఎక్కువ కావచ్చు. అందుకని ఫైనాన్స్ కోర్సులు బోర్ కొట్టేసిన విద్యార్థులు ఈ కోర్సులు చేయడం మంచిది’’ అని జే జాకబ్స్ అనే అతడు ట్వీట్ చేశారు. ‘షిప్ కేప్టన్లూ.. దయచేసి మీరు త్రీ పాయింట్ టర్న్‌లను (ఫార్వర్డ్, బ్యాక్వర్డ్, మళ్లీ ఫార్వర్డ్) మరింతగా ప్రాక్టీస్ చేయండి’ అని జిమ్ ఆర్మిటేజ్ అనే ఆయన ట్వీట్ చేశారు. సమస్యే సానుకూలతల్ని చూపిస్తుంది. అదే సానుకూలత రాగల కొద్ది గంటల్లో సూయజ్‌లోని ఈ తాత్కాలిక అడ్డును తొలగించి, ఎప్పటిలా సందడిగా మార్చవచ్చు. సూయజ్ కాలువ (కృత్రిమ జలమార్గం) ఎక్కడ ఉంది? : ఈజిప్టులో కాలువ పొడవు : 193 కి.మీ. కాలువ లోతు : 78 అడుగులు కాలువ వెడల్పు : నీళ్ల అడుగున 21 మీటర్లు.; ఉపరితలంపై 60 నుంచి 90 అడుగులు) ఎక్కడి నుంచి ఎక్కడికి? : మధ్యదరాసముద్రం నుంచి ఎర్ర సముద్రం వరకు. కట్టింది ఎక్కడ? : సూయెజ్ భూసంధిపై (జలాల మధ్య భూమార్గం) బయల్దేరే రేవు: పోర్ట్ సయెద్ (మధ్యధరా తీరం వెంబడి ఈశాన్య ఈజిప్టు) చేరుకునే రేవు: పోర్ట్ ట్యూఫిక్ (ఎర్ర సముద్రపు పాయను ఆనుకుని ఈశాన్య ఈజిప్టు) నిర్మాణం మొదలైంది : 1859 నిర్మాణం పూర్తయింది : 1869 కెనాల్ ఉపయోగం : ఆసియా ఐరోపాల మధ్య షిప్పింగ్‌కి దగ్గరి దారి. కెనాల్ లేకుంటే? : షిప్పింగ్‌కి ఆఫ్రికా మీదుగా 7 వేల కి.మీ. దూరం చుట్టూ తిరగవలసి వచ్చేది. నౌక ప్రయాణ సమయం : వేగాన్ని బట్టి 11 నుంచి 16 గంటలు నౌక ప్రయాణ వేగం : గంటలకు 15 కి.మీ. (8 నాటికల్ కి.మీ.). చదవండి: సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా! -
సూయజ్ కాలువ బంద్.. ఇంధన ధరలు పెరుగుతాయా!
కైరో: ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే సముద్ర వాణిజ్య మార్గాలలో సూయజ్ కాలువ ఒకటి. ఎర్ర సముద్రాన్ని, మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఈజిప్ట్ భూ భాగంలో సుయాజ్ కాలువను నిర్మించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం కొద్దిరోజులపాటు ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోనున్నాయి. దీనికి కారణం, మంగళవారం కాలువలో ఒక భారీ షిప్ చిక్కుకుంది. 400 మీటర్ల పొడవు.. 59 మీటర్ల వెడల్పు ఉన్న ఎవర్ గ్రీన్ కంపెనీ కంటైనర్ షిప్ కాలువకు అడ్డుగా నిలిచింది. ఈ షిప్ ఇసుకలో కూరుకపోయి ఉండవచ్చునని నిపుణులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం గుండా వెళ్లే సుమారు 100 షిప్‌ల రవాణాకు ఆటంకం ఏర్పడనుంది. కాగా 193 కిలోమీటర్ల పొడవైన సూయజ్ కాలువ ద్వారా, మధ్య ప్రాచ్యం నుంచి యూరప్, ఉత్తర అమెరికాకు ఆయిల్ ట్యాంకర్ల రాకపోకలు సాగుతాయి. ఇక ప్రపంచ వాణిజ్యంలో ప్రతి ఏటా సుమారు 12 శాతం ఈ కాలువ ద్వారానే వ్యాపారం జరుగుతుంది. అంతేకాకుండా 8 శాతం సహజవాయువు ఈ కాలువ ద్వారా వివిధ దేశాలకు రవాణా జరగుతోంది. ప్రతిరోజూ పది లక్షల బ్యారెల్స్ ఆయిల్ సరఫరా అవుతోంది. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం షిప్ కారణంగా ఈ మార్గం గుండా రాకపోకలు నిలిచిపోవడంతో, ఆయా దేశాల్లో ఇంధన ధరలు పెరగవచ్చని వాణిజ్య నిపుణులు భావిస్తోన్నారు. ఈ షిప్‌ను మళ్లీ సరైన మార్గంలోకి తెచ్చేందుకు ప్రత్యేకమైన పడవలను ఏర్పాటు చేశారు. ఇక్కడ పరిస్థితి సాధారణ స్థితికి వచ్చేందుకు కొన్ని రోజులు పట్టవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. దీంతో ఆసియా-యూరప్‌ల మధ్య వాణిజ్యంపై దీని ప్రభావం పడే అవకాశం ఉంది. చదవండి: గాల్లో తేలుతున్న భారీ నౌకలు -
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
-
2040 నాటికి ఉత్తర ధ్రువ జలమార్గం
ఏటేటా పెరుగుతున్న భూతాపోన్నతి కారణంగా భూమి ఉత్తరధ్రువంలోని ఆర్కిటిక్ మంచుకొండలు మరో 23 ఏళ్లలో, అంటే 2040 సంవత్సరం వచ్చే ఎండాకాలంలో పూర్తిగా కరిగిపోతాయని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. గతంలో అంచనావేసిన దానికన్నా 30 ఏళ్ల ముందే ఆర్కిటిక్ మంచుకొండలు కరిగిపోతాయన్నది వారి తాజా అంచనా. గత 30 ఏళ్లలో సగానికి సగం మంచుకొండలు కరగిపోయాయి. ఇప్పటికే మొత్తంగా మూడొంతుల మంచుకొండలు కరిగిపోగా, మిగిలిన నాలుగో వంతు భాగం రానున్న 23 ఏళ్లలో కరిగిపోతుంది. మంచుకొండలు కరిగిపోవడం వల్ల నష్టాలతో పాటు కొన్ని లాభాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఉత్తర యూరప్ నుంచి ఈశాన్య ఆసియాకు వెళ్లాలంటే సూయెజ్ కెనాల్ మీది నుంచి వెళ్లాల్సి వస్తుంది. ఆర్కిటిక్ మంచు కొండలు కరిగిపోతే ఉత్తర జలమార్గంలో దూరం ఐదింట రెండు వంతులు తగ్గుతుంది. దక్షిణ హాలండ్‌లోని ప్రధాన ఓడరేవు అయిన రోటర్‌డామ్ నుంచి జపాన్‌లోని యొకోహమా, షాంఘై నగరాలకు ఉత్తర జలమార్గం ద్వారా త్వరగా చేరుకోవచ్చు. రోటర్‌డామ్ నుంచి యొకోహమాకు మధ్య 3,840 నాటికల్ మైళ్ల దూరం ఉంది. ఈ దూరం ప్రయాణించడానికి 9 రోజులు పడుతుంది. 2,361 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న షాంఘై నగరానికి చేరుకోవాలంటే ఐదున్నర రోజులు పడుతుంది. ప్రస్తుతం సూయజ్ కాలువ మీదుగా దక్షిణ ధ్రువాన్ని చుట్టి పోవాల్సి వస్తోంది. 2040 నాటికి ఆర్కిటిక్ సముద్రంలోని మంచు కొండలు కరిగిపోయినా ఆ మార్గం గుండా నౌకాయానం చేసే అవకాశం ఉంటుందో, లేదో చెప్పలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. దాని కారణంగా దక్షిణ ధ్రువ ప్రాంతాలకన్నా సముద్ర జలాలు వేగంగా వేడెక్కడం, తుఫానులు సంభవించడం, సముద్రం అల్లకల్లోలంగా తయారవడమే అందుకు కారణమని వారంటున్నారు. ఉత్తర జలమార్గం కోసం ఉత్తరధ్రువ ప్రాంతాల్లోని దేశాలన్నీ పరస్పర రవాణా ఒప్పందాలు చేసుకోవాలని ఎప్పటి నుంచో ఆశిస్తున్నాయి.