suez canal vs ever given ship settled: ఎవర్ గివెన్ షిప్ గుర్తుందా? అదేనండి మార్చి నెలలో సరకు సూయాజ్ కాలువలో వెళ్తూ టైం బాలేక అక్కడే అడ్డంగా ఇరుక్కుపోయింది కదా. ఇక అప్పటి నుంచి ఆ షిప్, దాని యాజమాన్యానికి నష్టాలు, కష్టాలు కంటిన్యు అవుతూనే ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం షిప్ యాజమాన్యానికి వీటి నుంచి ఊరట లభించింది. సూయాజ్‌లో ఇరుక్కుపోయిన ఆ భారీ నౌక కదిలించడం కోసం కెనాల్ యంత్రాంగం వారం రోజులు అష్టకష్టాలు పడి చివరకు దాన్ని మళ్లీ కదిలేలా చేశారు.
హమ్మయ్యా కదిలింది కదా! అనుకుంటే ఇక్కడే అసలు చిక్కు వచ్చింది. అది వారం రోజులు బ్లాక్ కావడంతో ఇతర షిప్‌లు రాకకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో కెనాల్ అథారిటీ రవాణా ఫీజును కోల్పోవడం వల్ల తీవ్ర నష్టాన్ని చూశారు. అలానే షిప్ కదిలికకు చేసిన ఖర్చును కలిపి మొదట 916 మిలియన్ డాలర్లను పరిహారాన్ని డిమాండ్ చేసినప్పటికీ తర్వాత 550 మిలియన్ డాలర్లను చెల్లించాలన్నారు. ఈ నేపథ్యంలో నష్టం పరిహారం ఇచ్చిన తర్వాతే నౌకను వదులుతామని ఈజిప్ట్ దానిని తన ఆధీనంలోకి తీసుకుంది.
ఇక తాజాగా ఎవర్ గివెన్ నౌక యజమాని జపాన్‌కు చెందిన షూయీ కిసెన్ కైషా లిమిటెడ్ సంస్థ బుధవారం సూయాజ్ కాలువ యాజమాన్యంతో ఓ ఒప్పందానికి వచ్చింది. దీంతో వంద రోజులకుపైగా నడిచిన డ్రామాకు తెరపడింది. దీనిపై కోర్టులో కేసు కూడా దాఖలైంది. అయితే ఈ ఒప్పందం తర్వాత కోర్టు ఆ కేసు కొట్టేసింది. ఈ సెటిల్మెంట్‌తో ఎవర్ గివెన్ నౌక మధ్యధరా సముద్రం వైపు కదిలింది.
Comments
Please login to add a commentAdd a comment