హరితం.. క్షేమకరం
పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు
మర్పల్లి: హరతిహారంలో భాగంగా ప్రతిఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పంచాయతీరాజ్ శాఖ ఈఈ మనోహర్‌రావు పిలుపునిచ్చారు. మండలంలోని రావులపల్లి గ్రామంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కమలమ్మ, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, పాఠశాల విద్యార్థులతో కలిసి గురువారం ఆయన మొక్కలు నాటారు. ముందుగా గ్రామంలోని పీతాంబరేశ్వర ఆలయం వద్ద 100 చింత చెట్లు, రావులపల్లి నుంచి మర్పల్లికి వెళ్లే పంచాయత్ రాజ్ రోడ్డు ప్రక్కల వేర్వేరు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకొనేందుకు వెంటనే మొక్కల చుట్టూ కంచె నాటాలని మండల స్థాయి అధికారులకు సూచించారు. నేడు నాటిన ప్రతి మొక్క భవిష్యత్తులో మహావృక్షాలుగా మారుతాయన్నారు. దీంతో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్నారు. చెట్లు వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ సుమిత్రమ్మ, సర్పంచ్ నాద్రీగ కములమ్మ, డీఈ రాజ్‌కుమార్, ఏఈ శ్రీనివాసులు, ఎంపీడీఓ దత్తాత్రేయరాజు, ఈఓపీఆర్‌డీ అశోక్‌కుమార్, ఏపీఓ శంకర్, ఏపీఎం మధుకర్, వైస్ ఎంపీపీ అంజయ్యగౌడ్, నాయకులు నారాయణ్‌రెడ్డి, రమేష్‌సాగర్, జైపాల్, శ్రీకాంత్‌రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, పంచాయత్‌రాజ్ డివిజన్ సిబ్బంది రాజశేఖర్, జగన్‌మోహన్‌రెడ్డి, సాక్షర భారత్ మండల కో ఆర్డినేటర్ రాజు, పంచాయతీ కార్యదర్శి సంగారెడ్డి, ఫారెస్టు సెక్షన్ అధికారి వెంకటేశ్వర్లు గ్రామస్తులు, విద్యార్థులు ఉన్నారు.