Bonus Bonanza
-
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..!
తైవాన్ షిప్పింగ్ కంపెనీ ‘ఎవర్గ్రీన్ మెరైన్’ ఉద్యోగులకు కళ్లు చెదిరేలా భారీ బోనస్ అందిస్తోంది. ఒకటి.. రెండు కాదు.. ఏకంగా ఐదు సంవత్సరాల జీతాన్ని ఆ కంపెనీలో పనిచేస్తున్న 3,100 మంది ఉద్యోగులు బోనస్‌గా అందుకుంటున్నారని ఓ ఆస్ట్రేలియన్ న్యూస్ వెబ్సైట్ (news.com.au) నివేదించింది. ఇదీ చదవండి: సైబర్ దాడులను తట్టుకునే సామర్థ్యం మనకుందా? సిస్కో సైబర్ సెక్యూరిటీ కీలక సర్వే అంతేకాకుండా ఆ కంపెనీలో ఈ సంవత్సరం వేతన పెరుగుదల కూడా భారీగా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. 2022లో 10 నుంచి 11 నెలల వేతనాలకు సమానంగా ఈ ఏడాది వేతనాలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. గతేడాది డిసెంబర్లో అందుకున్న 50 నెలల బోనస్‌తో కలుపుకొంటే మొత్తంగా ఆ కంపెనీ ఉద్యోగులు అందుకుంటున్న బోనస్ దాదాపు ఐదు సంవత్సరాల జీతానికి సమానంగా ఉంటుంది. కాగా ప్రకటించిన బోనస్‌లు ఉద్యోగుల వ్యక్తిగత పనితీరు ఆధారంగా ఉంటున్నాయి. ఇదీ చదవండి: గోపీనాథన్‌ను వదులుకోలేకపోతున్న టీసీఎస్.. కీలక బాధ్యతలపై చర్చలు! ఈ ఎవర్గ్రీన్ కంపెనీకి చెందిన కంటైనర్ షిప్ 2021లో సూయజ్ కెనాల్లో మునిగిపోయిన విషయం తెలిసిందే. ఎవర్‌గ్రీన్‌లో వార్షిక వేతనాలు 44,745 డాలర్లు (రూ.37,00,807) నుంచి 171,154 డాలర్లు (రూ.1,41,55,950) మధ్య ఉంటాయని ఆస్ట్రేలియన్ వెబ్సైట్ పేర్కొంది. ఇదీ చదవండి: హౌసింగ్ బూమ్.. బడ్జెట్ ఇళ్లకు బాగా డిమాండ్ ది స్ట్రెయిట్స్ టైమ్స్ ప్రకారం.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఎవర్గ్రీన్ 16.25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఆ సంవత్సరం కంపెనీ లాభం 39.82 శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ సంక్షోభం, పలు దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో వినియోగ వస్తువులకు డిమాండ్ పెరగడమే భారీ లాభాలకు కారణమని నివేదిక పేర్కొంది. -
నాలుగేళ్ల జీతం బోనస్ బొనాంజా: ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ?
న్యూఢిల్లీ: తైవాన్‌కు చెందిన కంపెనీ తన ఉద్యోగులకు కళ్లు చెదిరే బోనస్ ప్రకటించింది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా నాలుగేళ్ల జీతాన్ని బోనస్ ప్రకటించింది తన సిబ్బందిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. 2021లో చెల్లించిన 40 నెలల బోనస్‌తో పోలిస్తే తాజాగా తన రికార్డ్‌ను తనే అధిగమించింది. గతంలో అత్యధిక సంవత్సరాంత బోనస్ అందించిన సంస్థగా ఇది రికార్డు సృష్టించింది. తైపీకి చెందిన షిప్పింగ్ కంపెనీ సంవత్సరాంతపు బోనస్‌లను 50 నెలల జీతం,సగటున నాలుగు సంవత్సరాల కంటే ఎక్కువ జీతం అందించిందట. ఎవర్గ్రీన్ మెరైన్ కార్పోరేషన్ తన సిబ్బందిలో కొంతమందికి అద్భుతమైన న్యూ ఇయర్ కానుక అందించింది. సంవత్సరాంతపు బోనస్‌లు ఎప్పుడూ కంపెనీ పనితీరు, ఉద్యోగుల వ్యక్తిగత పనితీరుపై ఆధారపడి ఉంటాయని ప్రకటించిన ఎవర్గ్రీన్ మెరైన్ ఇతర వివరాలను అందించడానికి నిరాకరించింది. అయితే కంపెనీకి చెందిన చాలామంది ఉద్యోగులను ఈ అదృష్టం వరించలేదు. దీంతో షాంఘైకి చెందిన ఉద్యోగులు అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తమ నెలవారీ జీతాల కంటే ఐదు-ఎనిమిది రెట్లు మాత్రమే బోనస్ ప్రకటించడం అన్యాయమని వారు ఆరోపించారని స్థానిక మీడియా నివేదించింది. కాగా గత రెండేళ్లలో ఈ కంపెనీ వ్యాపారం బాగా పెరిగింది. కరోనా మహమ్మారి లాక్డౌన్ల తర్వాత గ్లోబల్ కంటైనర్ షిప్పింగ్ లైన్లు పుంజుకోవడం, అలాగే షిప్పింగ్ ధరలు పెరగడంతో 2022లో పోలిస్తే, మూడు రెట్లు ఎక్కువగా సంస్థ ఆదాయం 20.7 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనా. -
లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్న వేళ ఒక లేడీ బాస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 80-82 లక్షల రూపాయల 'క్రిస్మస్ బోనస్' ప్రకటించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ మహిళా బాస్ పేరు గినా రైన్‌హార్ట్. 34 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆస్ట్రేలియాలో టాప్ బిలియనీర్. ఆస్ట్రేలియాలోపనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఆమె తండ్రి స్థాపించిన మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీ హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ కి జార్జినా (గినా) రైన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచి, ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ మంచి లాభాలతో నడుస్తుండటం గమనార్హం. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) అయితే రైన్‌హార్ట్ తన ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని ప్రటకించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో 10 మంది పేర్లను పిలవ బోతున్నట్లు ప్రకటించారు. అసలే దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ముఖ్యమైన ప్రకటన అనగానే అందరూ బెంబేలెత్తిపోయారు. సడెన్‌గా ఆ పదిమందికి లక్ష డాలర్లు బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులకు కూడా లక్షల్లో బోనస్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం విశేషం. కాగా కంపెనీ గత 12 నెలల్లో 3.3 బిలియన్ల డాలర్లు (రూ. 190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించి నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గినా. కంపెనీ లాభాలు దేశానికి కూడా ఉపయోగ పడ్డాయని, అందుకే ఈ కానుక అని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురి కావడం ఉద్యోగుల వంతైంది. -
రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ బోనస్!
న్యూఢిల్లీ: ఇండియన్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ శుభవార్త తెలిపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనాలకు సమానమైన బోనస్ అందించేందుకు కేంద్ర మంత్రివర్గం నేడు ఆమోదం తెలిపింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఖజానా మీద ₹1,984.73 కోట్లు ఆర్ధిక భారం పడనుంది. సుమారు 11.56 లక్షల నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ప్రయోజనం చేకూరనుంది. "అర్హత కలిగిన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులందరికీ(ఆర్పిఎఫ్/ఆర్పిఎస్ఎఫ్ సిబ్బంది మినహా) 2020-21 ఆర్థిక సంవత్సరానికి 78 రోజుల వేతనాలకు సమానమైన ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్(పిఎల్‌బి)కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది" అని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అర్హులైన రైల్వే ఉద్యోగులకు బోనస్ కింద 78 రోజులకు చెల్లించాల్సిన మొత్తం ₹17,951 అని కేంద్రం పేర్కొంది. అర్హులైన నాన్ గెజిటెడ్ రైల్వే ఉద్యోగులకు పిఎల్‌బి చెల్లించడానికి సూచించిన వేతన లెక్కింపు పరిమితి ₹7,000/నెలకు అని తెలిపింది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) "అర్హత కలిగిన రైల్వే ఉద్యోగులకు ప్రతి సంవత్సరం దసరా సెలవులకు ముందు పిఎల్‌బి చెల్లింపు చేయబడుతుంది. ఈ ఏడాది కూడా సెలవులకు ముందే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్నట్లు" కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. వాస్తవానికి ఫార్ములాను బట్టి 72 రోజుల వేతనాన్ని బోనస్ గా ఇవ్వాలి. కానీ ప్రధాని మోదీ, కేబినెట్ 78 రోజుల వేతనాన్ని బోనస్‌గా అందించి వారి ముఖాల్లో చిరునవ్వు చూడాలని ఈ నిర్ణయం తీసుకుంది. (చదవండి: టీమిండియా స్పాన్సర్‌కు భారీ షాక్...!) Union Cabinet approves Productivity Linked Bonus equivalent to 78 days' wage to eligible non-gazetted Railway employees (excluding RPF/RPSF personnel) for FY20-21. About 11.56 lakh non-gazetted Railway employees are likely to benefit from the decision:Union Minister Anurag Thakur pic.twitter.com/cv7IDkulZb — ANI (@ANI) October 6, 2021 -
మైక్రోసాప్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్
-
మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్!
మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ అంధించింది. ఈ కరోనా మహమ్మరి కారణంగా ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొనడం వల్ల 1,500 డాలర్లు(రూ.1.12 లక్షలు) సింగిల్ టైమ్ బోనస్ గా ఇస్తున్నట్లు ప్రకటించింది. కరోనా మహమ్మారి కారణంగా కష్టాలతో గడిచిన ఈ ఆర్థిక సంవత్సరం ముగిసిన నేపథ్యంలో ఉద్యోగుల చేసిన కృషికి గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్, కాథ్లీన్ హొగన్ ఈ రోజు ఉద్యోగులకు ఈ సింగిల్ టైమ్ బోనస్ ను ప్రకటించారు. ఈ బోనస్ యుఎస్, అంతర్జాతీయంగా అర్హులైన ఉద్యోగులందరికీ వర్తిస్తుంది. ఈ బోనస్ మార్చి 31, 2021కు ముందు కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ స్థాయికి దిగువన ఉన్న సిబ్బంది అందరికీ బహుమతిగా అందించింది. ఇందులో పార్ట్ టైమ్ వర్కర్లు కూడా ఉన్నారు. మైక్రోసాఫ్ట్ సంస్థకు ప్రపంచవ్యాప్తంగా 1,75,508 మంది ఉద్యోగులు ఉన్నారు. కానీ మైక్రోసాఫ్ట్ అనుబంధ సంస్థలైన లింక్డ్ ఇన్, గిట్ హబ్, జెనిమాక్స్ ఉద్యోగులకు ఈ బోనస్ కు అర్హులు కాదు. ఈ బోనస్ కోసం సుమారు $200 మిలియన్ల డాలర్లు కేటాయించినట్లు సంస్థ పేర్కొంది. ఇంతక ముందు ఫేస్బుక్ తన 45,000 ఉద్యోగులకు ఒక్కొక్కరికి $1,000 బహుమతిగా ఇవ్వగా, అమెజాన్ ఫ్రంట్ లైన్ కార్మికులకు $300 సెలవు బోనస్, బీటీ గ్రూప్ తన 60,000 ఉద్యోగులకు £1,500(సుమారు $2,000) బహుమతిగా ఇచ్చింది. -
షావోమి ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ మొబైల్ తయారీదారు షావోమి ఇండియా తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. హార్డ్‌షిప్ బోనస్‌కింద ఉద్యోగులకు15 రోజుల జీతాన్ని బోనస్ ప్రకటించింది. కరోనా వైరస్ మహమ్మారి సంక్షోభంలో ఇబ్బందులను ఎదుర్కొన్న కార్పొరేట్ ఉద్యోగులతోపాటు ఇతరలకు వార్షిక బిజినెస్ బోనస్‌కు అదనంగా ఈ బోనస్‌ను అందించనుంది. అలాగే తన ఉద్యోగులందరికీ కోవిడ్-19 వ్యాక్సిన్‌ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యులతోపాటు, ఉద్యోగులందరికీ కరోనా వ్యాక్సిన్ ఖర్చులను తామే భరిస్తామని షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ తెలిపారు. వీరందరికీ అర్హత ప్రమాణాల ప్రకారం కరోనావైరస్ వ్యాక్సిన్ తీసుకునేలా అన్ని ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం కంపెనీ 60వేల ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగులను కలిగి ఉంది. కరోనా మహమ్మారి, లాక్డౌన్ తరువాత దేశీయ డిమాండ్ పెరగడంతో, ఎగుమతులను నిలిపివేయాలని భావిస్తున్నట్టు ఇటీవల ప్రకటించింది. స్థానిక డిమాండ్‌కే తమ తొలి ప్రాధాన్యమని జైన్ తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తి-అనుసంధాన ప్రోత్సాహక (పిఎల్ఐ) పథకంలో భాగంగా తన భాగస్వాములతో కలిసి దేశంలో ఉత్పత్తి సామర్థ్యాన్ని విస్తరిస్తున్నామని చెప్పారు. కాగా సీఎంఆర్ ఇండియా డేటా ప్రకారం 2020 మూడవ త్రైమాసికంలో భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో టాప్‌లో ఉంది షావోమి. 27 శాతం మార్కెట్ వాటాతో మార్కెట్ లీడర్‌గా ఉంది. దేశంలో స్మార్ట్ఫోన్లతో పాటు, ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఫిట్నెస్ బ్యాండ్లు, వీఆర్ హెడ్సెట్లు వర్ బ్యాంక్‌లను షావోమి విక్రయిస్తున్న సంగతి తెలిసిందే. -
కాగ్నిజెంట్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. బోనస్‌లు, ప్రమోషన్లతో వారిలో ఉత్సాహాన్ని నింపుతోంది. 2019తో పోలిస్తే ఎక్కువగా తాజా బోనస్‌ను ప్రకటించింది. అలాగే 24,000 మందికి పైగా ఉద్యోగులను భారీగా ప్రమోట్ చేయనుంది. సంస్థ అట్రిషన్ (కంపెనీల మార్పు) తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అంచనా. దేశీయంగా 24వేల మందికి ప్రమోషన్లతో పాటు ఉద్యోగులకు బోనస్ ఇవ్వనున్నట్లు కాగ్నిజెంట్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ రాజేష్ నంబియార్ ప్రకటించారు. అలాగే సీనియర్ అసోసియేట్స్, అంతకంటే కింది స్థాయి ఉద్యోగులకు ఇకనుంచి ప్రతి మూడు నెలలకు ప్రమోషన్లు అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలిపారు. 2021 జూన్ త్రైమాసికంనుంచే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ప్రపంచవ్యాప్తంగా లక్షా అరవై వేల మంది ఉద్యోగులకు బోనస్‌లను ఇవ్వనున్నామని నంబియార్ చెప్పారు. (కాగ్నిజెంట్ తీపికబురు : భారీ ఉద్యోగావకాశాలు) కాగా కాగ్నిజెంట్ డిసెంబర్ 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో 4,184 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని నమోదు చేసింది. కరెన్సీపరంగా ఇది వార్షిక ప్రాతిపదికన 3 శాతం క్షీణించింది. భారతదేశంలో 2.9 లక్షలకు పైగా ఉద్యోగులను కలిగి ఉంది. 2020 క్యూ 3 ముగింపు నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,89,500. సంస్థ మొత్తం అట్రిషన్ 19 శాతంగా ఉంది. -
హెచ్‌సీఎల్ టెక్ ఉద్యోగులకు బొనాంజా
న్యూఢిల్లీ: ఐటీ దిగ్గజం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ తాజాగా 10 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 72,800 కోట్లు) ఆదాయ మైలురాయిని అధిగమించిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగులకు ప్రత్యేకంగా వన్–టైమ్ బోనస్ ప్రకటించింది. ఇందుకోసం సుమారు రూ. 700 కోట్లు వెచ్చిస్తోంది. 2021 ఫిబ్రవరిలో ఈ స్పెషల్ బోనస్‌ను చెల్లించనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఏడాది పైగా సర్వీసులో ఉన్న ఉద్యోగులకు దాదాపు 10 రోజుల వేతనానికి సరిసమానంగా ఇది ఉంటుందని పేర్కొంది. సంస్థలో 1,59,000 పైచిలుకు సిబ్బంది ఉన్నారు. 2020లో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 10 బిలియన్ డాలర్ల ఆదాయం మైలురాయిని అధిగమించింది. కరోనా వైరస్ మహమ్మారి విజృంభించిన తరుణంలోనూ ప్రతీ ఉద్యోగీ ఎంతో నిబద్ధతతో విధులు నిర్వర్తించి, సంస్థ వృద్ధికి తోడ్పడ్డారని కంపెనీ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ అప్పారావు వి.వి. తెలిపారు. డిజిటల్ సర్వీసులు, ఇతర ఉత్పత్తుల ఊతంతో డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ నికర లాభం 31.1 శాతం పెరిగి రూ. 3,982 కోట్లకు ఎగిసింది. అలాగే ఆదాయం 6.4 శాతం పెరిగి రూ. 19,302 కోట్లకు పెరిగింది. ఈ నేపథ్యంలో కంపెనీ ప్రస్తుత త్రైమాసికంలో ఆదాయం గైడెన్స్ అంచనాలను 1.5–2.5 శాతం నుంచి 2–3 శాతానికి పెంచింది. సోమవారం బీఎస్ఈలో హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ షేరు సుమారు 1 శాతం పెరిగి రూ. 958 వద్ద ముగిసింది. -
టెక్ దిగ్గజం బోనస్ బొనాంజా : పండగే
సాక్షి, ముంబై: టెక్ మేజర్ హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (హెచ్‌సీఎల్) తన ఉద్యోగులకు తీపికబురు అందించింది. అంచనాలకు మించిన త్రైమాసిక లాభాలను సాధించిన సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న 1.5 లక్షల మంది ఉద్యోగులకు భారీ ప్రత్యేక బోనస్ బొనాంజా ప్రకటించింది. సుమారు 700 కోట్ల రూపాయల విలువైన వన్‌టైమ్ స్పెషల్ బోనస్‌ను అందిస్తున్నట్టు వెల్లడించింది. కోవిడ్-19 మహమ్మారి సంక్షోభ సమయంలో కూడా తమ ప్రతీ ఉద్యోగి అపారమైన నిబద్ధతతో సేవలందించారని ఇదే సంస్థ వృద్ధికి దోహదపడిందని సంస్థ పేర్కొంది. అంతేకాదు ఉద్యోగులే తమకు అత్యంత విలువైన ఆస్తి అని కంపెనీ ప్రకటించడం విశేషం. 2020 జనవరి-డిసెంబర్ మధ్యకాలంలో తొలిసారి 10 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అధిగమించిన తరువాత హెచ్‌సీఎల్ ఈ బంపర్ఆఫర్ ప్రకటించింది. సుమారు 90 మిలియన్ డాలర్లు (రూ. 650 కోట్లకు పైగా) ప్రత్యేక బోనస్‌ను ఫిబ్రవరిలో ఉద్యోగులకు చెల్లించనుంది. ఒక సంవత్సరం లేదా అంతకంటే ఎక్కువ సర్వీసు ఉన్న ఉద్యోగులందరికీ ఈ బోనస్ అందుతుందని, ఇది పది రోజుల జీతానికి సమానమని హెచ్‌సీఎల్ టెక్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా సంస్థలోని ప్రతీ ఉద్యోగికి హెచ్‌సీఎల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ వీవీ అప్పారావు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాగా హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2020 డిసెంబర్ త్రైమాసికంలో సంవత్సరానికి నికర లాభం 31.1 శాతం ఎగిసి 3,982 కోట్ల రూపాయలుగా నమోదైంది. త్రైమాసిక ప్రాతిపదికన, హెచ్‌సిఎల్ లాభం 26.7 శాతం పెరిగింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఈక్విటీ షేరుకు రూ .4 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
అద్భుత విజయం : బీసీసీఐ భారీ నజరానా
సాక్షి, న్యూఢిల్లీ : బ్రిస్బేన్‌లోని గబ్బాలో టీమిండియా చారిత్రక విజయంపై అటు విశ్వవ్యాప్తంగా టీమిండియా క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా భారీ నజరానా ప్రకటించింది. గబ్బాలో ఆస్ట్రేలియా 32 సంవత్సరాల అజేయ చరిత్రకు చెక్ పెట్టిన టీమిండియా సంచలన విజయానికి భారీ గిఫ్ట్ ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు. (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన) గబ్బాలో జరిగిన సిరీస్ ఆఖరి టెస్టులో అజింక్యా రహానె నేతృత్వంలోని భారత్ టీం 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమంటూ జట్టులోని ప్రతి ఆటగాడిని గంగూలీ ప్రశంసించారు. టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బోనస్‌గా 5 కోట్లు ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలు. భారత జట్టుఅద్భుత నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించిందంటూ కార్యదర్శి జే షా తన ట్వీట్ చేశారు. -
ఒక్కొక్కరికి రూ.14లక్షల క్రిస్మస్ బోనస్
ఇండియాలో దీపావళికి సూరత్ డైమండ్ వ్యాపారులు ఖరీదైన ఇళ్లు, కార్లు బహుమతులుగా ఇవ్వడం మనం చూశాం. తాజాగా ఈ కోవలోకి అమెరికాకు చెందిన కంపెనీ బాస్ కూడా చేరిపోయారు. క్రిస్మస్ సందర్భంగా తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరికీ రూ.14 లక్షల రూపాయల క్రిస్మస్ బోనస్ అందిస్తున్నారట. కోట్ల రూపాయల క్రిస్మస్ బోనస్‌ను యజమాని ప్రకటించగానే కొంతమంది ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. మిచిగాన్కు చెందిన ఫ్లోరాక్రాఫ్ట్ కంపెనీ అధిపతి లియో స్కోనర్ర్ (82)సంస్థలోని దాదాపు 200మంది ఉద్యోగులకు శాంతా వెలుగులు నింపేశారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చేసిన కృషికి, శ్రమకు గుర్తింపుగా ఈ బోనస్ ఇస్తున్నట్టు లియో ప్రకటించారు. అంతేకాదు ఉద్యోగులే కంపెనీకి సర్వస్వం అని సగర్వంగా ప్రకటించారు. సంస్థలో పనిచేసిన పీరియడ్ అధారంగా ఈ బోనస్ విలువ పెరుగుతుంది. 40 సంవత్సరాల పాటు సంస్థలో పనిచేసిన వారికి 60వేల డాలర్లు (రూ.42లక్షలు) ఈ బహుతి అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ బోనస్ మొత్తంలో 75శాతం ఉద్యోగుల రిటైర్మెంట్ ప్లాన్‌లోజమచేసి, మిగిలిన సొమ్మును నగదు రూపంలో ఉద్యోగులకు అందించనున్నారు. 1946లో లుడింగ్టన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఫ్లోరాక్రాఫ్ట్ వాల్‌మార్ట్, అమెజాన్, మైఖేల్స్, జోన్, హాబీలాబీ లాంటి రిటైలర్లకు ఫోమ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. -
రెవెన్యూ ఉద్యోగులకు ‘బోనస్’
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసిన రెవెన్యూ శాఖ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ బహుమతి ప్రకటించారు. వారికి ఒక నెల మూల వేతనాన్ని ప్రోత్సాహకంగా ఇవ్వాలని అధికారులను ఆదేశిం చారు. ‘ప్రక్షాళన’లో ప్రత్యక్షంగా పాల్గొన్న 10,809 మంది రెవెన్యూ ఉద్యోగులు, 24,410 మంది వీఏవో లు, 530 మంది సర్వే విభాగం ఉద్యోగులు కలిపి మొత్తంగా 35,749 మందికి ఒక నెల మూల వేతనం బోనస్‌గా అందనుంది. ముఖ్యమంత్రి శనివారం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం, కొత్త పాస్ పుస్తకాల పంపిణీపై ప్రగతిభవన్‌లో సమీక్షించారు. ఈ సందర్భంగా అధికారులను ప్రశంసించారు. ‘‘రెవెన్యూ ఉద్యోగులు దేశంలో ఎక్కడా లేనివిధంగా కేవలం వంద రోజుల వ్యవధిలోనే రేయింబవళ్లు పనిచేసి భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమాన్ని విజయవంతం చేశారు..’’అని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలు, రైతుల పక్షాన రెవెన్యూ ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు. గందరగోళాన్ని సరిచేశాం.. దాదాపు 80 ఏళ్లుగా భూరికార్డుల నిర్వహణ సరిగా లేదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. క్రయవిక్రయాలు, యాజమాన్యంలో వచ్చిన మార్పులను ఎప్పటికప్పుడు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చేశారు. భూరికార్డులు గందరగోళంగా మారిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడి సాయం పథకం అమలుకు ఏ భూమికి ఎవరు యజమానో కచ్చితంగా తేలాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. దీంతో భూరికార్డులను సరిచేయాలని సంకల్పించాం. ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా కేవలం వంద రోజుల్లోనే రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు గ్రామాల్లో తిరిగి, రైతులతో మాట్లాడి భూమి యాజమాన్య హక్కులపై స్పష్టత తెచ్చారు. సొంత భూములున్నవారు, అసైన్డ్‌దారుల వివరాలను కూడా కొలిక్కి తెచ్చారు. రాష్ట్రంలో పంచిపెట్టిన 22.5 లక్షల ఎకరాల భూమికి గాను 20 లక్షల ఎకరాల విషయంలో స్పష్టత వచ్చింది. రెండున్నర లక్షల ఎకరాల విషయంలో స్పష్టత కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. కోర్టు కేసుల్లో ఉన్న భూములు, అటవీ–రెవెన్యూ శాఖల మధ్య వివాదంలో ఉన్న భూములు మినహా మిగతా భూములన్నీ క్లియర్ అయ్యాయి. దేశంలో ఎవరూ సాధించని ఘనత మన రెవెన్యూ ఉద్యోగులు సాధించారు. వారికి ప్రోత్సాహకంగా ఒక నెల మూల వేతనాన్ని బోనస్‌గా అందిస్తున్నాం..’’అని చెప్పారు. కలెక్టర్లకూ అభినందన కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుందో భూరికార్డుల ప్రక్షాళన నిరూపించిందని కేసీఆర్ పేర్కొన్నారు. చిన్న జిల్లాలు ఉండడం వల్లనే భూరికార్డుల ప్రక్షాళన విజయవంతంగా నిర్వహించగలిగామని.. కొత్త కలెక్టర్లు తమ విధిని గొప్పగా నిర్వహించారని ప్రశంసించారు. రాష్ట్రంలోని అధికారులు, ఉద్యోగులు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారన్నారు. గతంలో ప్రభుత్వాస్పత్రుల్లో ఏటా రెండు లక్షలలోపే ప్రసవాలు జరిగేవని, ఇప్పుడా సంఖ్య చాలా పెరిగిందని చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో ఇంజనీర్లు, రోడ్ల నిర్మాణంలో పంచాయితీరాజ్, ఆర్అండ్బీ అధికారులు, ఇతర అభివృద్ధి పనుల్లో మిగతా శాఖల అధికారులు చాలా కష్టపడి పనిచేస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. అవినీతికి ఆస్కారమివ్వని విధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్న ఉద్యోగులకు మంచి వేతనాలు లభించాలన్నదే తమ అభిమతమని.. అందుకే తెలంగాణ ఇంక్రిమెంటుతో పాటు 42 శాతం ఫిట్మెంట్తో వేతన సవరణ చేశామని తెలిపారు. భవిష్యత్తులో కూడా మంచి జీతభత్యాలు ఇస్తామని వెల్లడించారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, ప్రభుత్వ సలహాదారు జి.ఆర్. రెడ్డి, సీనియర్ ఐఏఎస్ అధికారులు ఎస్.నర్సింగ్‌రావు, రాజేశ్వర్ తివారీ, రామకృష్ణారావు, శివశంకర్, వాకాటి కరుణ, స్మితా సభర్వాల్, కలెక్టర్లు రఘునందన్‌రావు, ఎంవీ.రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బజాజ్ ఫినాన్స్ బోనస్ బొనాంజా
ముంబై: బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ బజాజ్ ఫినాన్స్ ఆర్థిక ఫలితాల్లో అదరగొట్టింది. జూన్ త్రైమాసికంలో అంచనాలకు మించి ఫలితాలను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ ప్రకటించిన క్యూ 1 ఫలితాల్లో 54 శాతం వృద్ధితో రూ.424 కోట్ల నికర లభాలను ఆర్జించింది. ఆదాయంలో 38 శాతం వృద్థితో రూ. 2,166 కోట్ల నికర ఆదాయాన్ని సాధించింది. మెరుగైన ఫలితాలను ప్రకటించిన బజాజ్ ఫినాన్స్ బోర్డ్ 1:1 బోనస్ ప్రకటించింది. అలాగే 10రూ. గా ఫేస్ వాల్యూ వున్న షేరును విడగొట్టి (స్ప్లిట్) 2 రూ.నిర్ణయించింది. అంటే ప్రతీ షేరుకు అయిదు షేర్లు అదనంగా వాటాదారులకు అందించనుంది. దీంతో మార్కెట్లో ఈ కంపెనీ షేరు లాభాల్లో దూసుకుపోతోంది. ఈ బంపర్ బొనాంజాతో దాదాపు 5 శాతం లాభాలతో ఫ్లాట్ గా ట్రేడవుతున్న స్టాక్ మార్కెట్లో ప్రధాన విజేతగా నిలిచింది. కాగా పుణేకు చెందిన బజాజ్ ఫినాన్స్ రూ.373కోట్ల నికర లాభాలను, 2039కోట్ల నికర ఆదాయన్ని నమోదు చేస్తుందని ఎనలిస్టులు అంచనా వేశారు. ఈ అంచనాలకు భిన్నంగా బజాజ్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించడం విశేషం.