ఏడేళ్ల తర్వాత రిలయన్స్‌ గుడ్‌న్యూస్‌ | Reliance Industries set for its bonus issue after seven years | Sakshi
Sakshi News home page

ఏడేళ్ల తర్వాత రిలయన్స్‌ గుడ్‌న్యూస్‌

Oct 26 2024 12:08 PM | Updated on Oct 26 2024 12:34 PM

Reliance Industries set for its bonus issue after seven years

దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్‌ 28న బోనస్‌ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్‌ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్‌ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి.  అక్టోబర్‌ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్‌ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్‌ ఉంటే అదనంగా మరో షేర్‌ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్‌ ధర కూడా సమానంగా డివైడ్‌ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్‌ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్‌ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.

ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్‌ విస్తరణకు ఏం చేయాలంటే..

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్‌టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్‌టైన్‌మెంట్ అండ్‌ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్‌ క్యాపిటల్‌ రూ.17,55,986 కోట్లుగా ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement