bonus shares
-
ఐజీఎల్ 1:1 బోనస్.. ప్రతి షేరుకీ మరో షేరు ఉచితం
న్యూఢిల్లీ: సిటీ గ్యాస్ రిటైల్ పీఎస్‌యూ.. ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) తొలిసారి వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించింది. 1:1 నిష్పత్తిలో షేర్లను జారీ చేయనుంది. ఇందుకు కంపెనీ నిర్వహించిన తాజా సమావేశంలో బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా కేటాయించనుంది.తద్వారా వాటాదారులకు రివార్డుతోపాటు.. రిటైల్ ఇన్వెస్టర్లను ఆకట్టుకోనుంది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ వాటా మూలధనం రెట్టింపు కానుంది. రూ. 140 కోట్ల నుంచి రూ. 280 కోట్లకు పెరగనుంది. కంపెనీ వద్దగల రూ. 8,412 కోట్ల రిజర్వు నిధుల నుంచి బోనస్ ఈక్విటీ(రూ. 140 కోట్లు) నిధులను సమకూర్చుకోనుంది. తదుపరి దశలో ప్రకటించనున్న రికార్డ్ డేట్ ప్రకారం రెండు నెలల్లోగా బోనస్ షేర్లను కేటాయించే వీలున్నట్లు ఐజీఎల్ స్టాక్ ఎక్స్చేంజీలకు తెలియజేసింది. గ్యాస్ పంపిణీ ఇలా దేశీయంగా సిటీ గ్యాస్ పంపిణీలో అతిపెద్ద రిటైలర్‌గా నిలుస్తున్న ఐజీఎల్ ఆటోమొబైల్స్‌కు సీఎన్జీ, పరిశ్రమలు, గృహాలకు పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)ను సరఫరా చేస్తోంది. ఢిల్లీసహా సమీప ప్రాంతాలైన నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో సిటీ గ్యాస్ పంపిణీ బిజినెస్‌ను నిర్వహిస్తోంది. వీటితోపాటు హర్యానా, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలలోనూ రిటైల్ గ్యాస్ సర్వీసులు అందిస్తోంది.ఇదీ చదవండి: వొడాఫోన్ ఐడియా షేర్ల జారీసుమారు 882 స్టేషన్ల ద్వారా 1.7 మిలియన్ వాహనాలకు సీఎన్జీ సరఫరా చేస్తోంది. 2.5 మిలియన్ గృహాలకు పీఎన్జీ అందిస్తోంది. పీఎస్‌యూ దిగ్గజాలు గెయిల్(ఇండియా), బీపీసీఎల్‌తోపాటు ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాగస్వామ్య కంపెనీ ఇది! బోనస్ వార్తల నేపథ్యంలో ఐజీఎల్ షేరు 1.6 శాతం లాభంతో రూ. 392 వద్ద ముగిసింది. -
ఏడేళ్ల తర్వాత రిలయన్స్ గుడ్‌న్యూస్
దేశంలోని ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా పేరున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏడేళ్ల తర్వాత తన మదుపర్లకు శుభవార్త చెప్పింది. ఈ దీపావళి పండగ నేపథ్యంలో ధన్‌తేరాస్‌కు ముందు అక్టోబర్ 28న బోనస్ షేర్ల రికార్డు తేదీని ప్రకటించింది. గత ఏడేళ్ల నుంచి కంపెనీ ఎలాంటి బోనస్ షేర్లను ప్రకటించకపోవడంతో మదుపర్లు కొంత నిరాశతో ఉన్నారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ధర ఇటీవల భారీగా పడిపోయింది. కేవలం ఈ కంపెనీ అనే కాదు, మార్కెట్ సూచీలు భారీగా నష్టాల బాటపట్టాయి. అక్టోబర్ 25తో ముగిసిన ట్రేడింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు ధర రూ.2,655.45గా ఉంది. తాజాగా కంపెనీ 1:1 బోనస్ ప్రకటించింది. అంటే డీమ్యాట్‌లో ఒక షేర్ ఉంటే అదనంగా మరో షేర్ జమ అవుతుంది. అందుకు అనుగుణంగా షేర్ ధర కూడా సమానంగా డివైడ్ అవుతుంది. ఫలితంగా ధర తగ్గినట్లు కనిపిస్తుంది. ఈ బోనస్‌కు అక్టోబర్ 28ను రికార్డు తేదీగా నిర్ణయించారు. ఆ తేదీలోపు డీమ్యాట్ ఖాతాలో కంపెనీ షేర్లు ఉంటే ఈ బోనస్‌కు అర్హులుగా పరిగణిస్తారు.ఇదీ చదవండి: గ్రామీణ బ్రాడ్‌బ్యాండ్ విస్తరణకు ఏం చేయాలంటే..రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫార్చ్యూన్ 500 కంపెనీ(అధిక రెవెన్యూ సంపాదిస్తూ అంతర్జాతీయంగా సర్వీసులు అందించే కంపెనీలకు ఇచ్చే గుర్తింపు). ఇది ఎనర్జీ, పెట్రోకెమికల్స్, టెక్స్టైల్స్, రిటైల్, టెలికమ్యూనికేషన్స్, పునరుత్పాదక ఇంధనం, ఎంటర్టైన్మెంట్ అండ్ మీడియా వంటి విభిన్న రంగాల్లో సేవలిందిస్తోంది. 2023-24లో రూ.80 వేలకోట్ల ఆదాయం సంపాదించింది. 2024 నాటికి కంపెనీ మార్కెట్ క్యాపిటల్ రూ.17,55,986 కోట్లుగా ఉంది. -
ఒక షేర్ ఉంటే మరో షేర్ ఉచితం
ముంబై: సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం విప్రో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) రెండో త్రైమాసికంలో ఆసక్తికర ఫలితాలు సాధించింది. జూలై–సెప్టెంబర్(క్యూ2)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 21 శాతంపైగా ఎగసి రూ. 3,209 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 2,646 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం నామమాత్రంగా తగ్గి రూ. 22,302 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో రూ. 22,516 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. ఇందుకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వెరసి వాటాదారులవద్దగల ప్రతీ షేరుకి మరో షేరుని డిసెంబర్ 15కల్లా ఉచితంగా కేటాయించే వీలుంది. గైడెన్స్ వీక్ ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో పనిదినాలు తగ్గడం, సీజనల్ బలహీనతలు ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు విప్రో సీఈవో, ఎండీ శ్రీని పల్లియా పేర్కొన్నారు. దీంతో క్యూ3 ఆదాయంలో వృద్ధి అంచనా(గైడెన్స్)లను –2 నుంచి 0 శాతానికి సవరించారు. ఇంతక్రితం –1 నుంచి +1% గైడె న్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాన క్లయింట్లను పెంచుకోవడంతోపాటు.. మరోసారి భారీ డీల్స్ బుకింగ్స్ బిలియన్ డాలర్లను దాటినట్లు పల్లియా వెల్లడించారు. ఆన్‌బోర్డింగ్ పూర్తిచేస్తాం ఈ డిసెంబర్‌కల్లా మొత్తం రిక్రూట్మెంట్ బ్యాక్‌లాగ్స్‌ను పూర్తి చేయనున్నట్లు విప్రో చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ సౌరభ్ గోవిల్ పేర్కొన్నారు. ఐటీ కంపెనీలు 6 నెలల నుంచి 2ఏళ్లవరకూ ఆన్‌బోర్డింగ్‌ను ఆలస్యం చేస్తున్నట్లు వెలువడుతున్న విమర్శలకు చెక్ పెడుతూ గోవిల్ క్యూ3(అక్టోబర్–డిసెంబర్)లో అన్ని ఆఫర్లను క్లియర్ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది ప్రతీ త్రైమాసికంలోనూ 2,500–3,000 మంది ఫ్రెషర్స్‌ను తీసుకుంటున్నట్లు వివరించారు. ప్రస్తుతం విప్రో మొత్తం సిబ్బంది సంఖ్య 2,33,889ను తాకింది. 44,000 మందికి శిక్షణ క్యాప్కో పురోగతి కొనసాగుతున్నట్లు పల్లియా పేర్కొన్నారు. బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్, టెక్నాలజీ, కమ్యూనికేషన్స్ రంగాలలో వృద్ధిని అందుకున్నట్లు తెలియజేశారు. ఏఐ ఆధారిత విప్రోను పటిష్టపరచేందుకు పెట్టుబడులు కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం అడ్వాన్స్డ్ ఏఐలో 44,000మంది ఉద్యోగులకు శిక్షణ పూర్తిచేసినట్లు వెల్లడించారు. సెపె్టంబర్లో ప్రతిభ ఆధారిత వేతన పెంపును చేపట్టినట్లు తెలియజేశారు. షేరు బీఎస్ఈలో 0.7% నీరసించి రూ. 529 వద్ద ముగిసింది. -
బోనస్ షేర్ల ట్రేడింగ్‌లో సెబీ మార్పులు
బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.ప్రస్తుత ఐసీడీఆర్ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్లు అదే ఐఎస్ఐఎన్ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే బోనస్ షేర్లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది. -
Reliance AGM 2024: రిలయన్స్ బొనాంజా
రిలయన్స్ ఇండస్ట్రీస్ 47వ సాధారణ వార్షిక సమావేశం (ఏజీఎం)లో చైర్మన్ ముకేశ్ అంబానీ వాటాదారులకు బోనస్ షేర్లను ప్రకటించారు. సమీప భవిష్యత్‌లో టాప్–30 గ్లోబల్ దిగ్గజాల్లో ఒకటి గా కంపెనీని తీర్చిదిద్దుతామన్నారు. ఇందుకు టెక్నా లజీ విస్తృత వినియోగం, ఆధునిక తయారీ విధానాలు దన్నుగా నిలుస్తాయని చెప్పారు. ముంబై: ప్రయివేట్ రంగ దిగ్గజం ఆర్ఐఎల్ విస్తృత స్థాయి టెక్నాలజీ కంపెనీగా మారు తోందని ముకేశ్ అంబానీ పేర్కొన్నారు. అన్ని వ్యాపా రాల్లోనూ ఏఐ సంబంధ డిజిటల్ ఇన్ఫ్రాను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తద్వారా కంపెనీ అత్యంత వృద్ధి పథంలో సాగనున్నట్లు చెప్పారు. వెరసి రానున్న కాలంలో కంపెనీ విలువ భారీగా మెరుగుపడనున్నట్లు వివరించారు. ఏజీఎంలో వాటాదారులను ఉద్దేశించి పలు అంశాలను ప్రస్తావించారు. వీటి ప్రకారం ఆర్ఐఎల్ గతేడాది ఆర్అండ్డీపై రూ. 3,643 కోట్లు వెచ్చించింది. గత ఐదేళ్లలో రూ. 11,000 కోట్లు ఇన్వెస్ట్ చేసింది. వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను జారీ చేయనుంది. అంటే వాటాదారుల వద్దగల ప్రతీ షేరుకీ మరో షేరుని ఉచితంగా(బోనస్) అందించనుంది. ఈ అంశాన్ని సెప్టెంబర్ 5న సమావేశంకానున్న డైరెక్టర్ల బోర్డు పరిశీలించనుంది. కంపెనీ ఇంతక్రితం 2017 సెప్టెంబర్, 2009 నవంబర్లోనూ 1:1 ప్రాతిపదికన బోనస్ షేర్లను జారీ చేసింది. రిటైల్ జోరు..: గతేడాది రిలయన్స్ రిటైల్ తొలిసారి రూ. 3 లక్షల కోట్ల టర్నోవర్ మైలురాయిని దాటింది. రానున్న 3–4ఏళ్లలో బిజినెస్‌ను రెట్టింపు చేసే లక్ష్యంతో ఉన్నట్లు ఆర్ఐఎల్ డైరెక్టర్ ఇషా అంబానీ పేర్కొన్నారు. మూడు ప్రయివేట్ లేబుళ్లు రూ. 2,000 కోట్ల వార్షిక అమ్మకాలను అందుకున్నాయి. లగ్జరీ జ్యువెలరీ విభాగంలోకి కంపెనీ ప్రవేశించనుంది. దేశవ్యాప్తంగా 18,836 స్టోర్లను నిర్వహిస్తోంది. దీంతో స్టోర్లరీత్యా టాప్–5 గ్లోబల్ రిటైలర్‌గా నిలుస్తోంది. ఆన్లైన్ గ్రోసరీ డెలివరీ సరీ్వసుల మిల్క్‌బాస్కెట్‌ను కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. కళానికేతన్, జివామే, క్లోవియా, అర్బన్ ల్యాడర్లలో పెట్టుబడులు ఫ్యాషన్ విభాగంలో పట్టుసాధించేందుకు దోహదం చేస్తున్నాయి. జియో.. బంపర్ ఆఫర్: 100జీబీ క్లౌడ్ స్టోరేజ్ ఫ్రీరానున్న దీపావళి కానుకగా రిలయన్స్ జియో యూజర్లకు ఉచితంగా 100 జీబీ క్లౌడ్ స్టోరేజీని అందించనుంది. తద్వారా ఫొటోలు, వీడియోలు ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రంగా దాచుకునేందుకు వీలుంటుంది. వచ్చే 3–5 ఏళ్లలో రిలయన్స్ రిటైల్, జియో, డిజిటల్ సర్వీసుల ఆదాయం, నిర్వహణ లాభం (ఇబిటా) రెట్టింపు కానున్నట్లు ముకేశ్ అచనా వేశారు. డేటా ఆధారిత ఏఐ సేవలను ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రీమియం డివైస్ల అందుబాటులోఉన్న క్లౌడ్ సేవలను లగ్జరీగా కాకుండా చౌకగా అందించనున్నట్లు వెల్లడించారు. టీవీ వినియోగదారులకు హలోజియో పేరుతో వాయిస్ అసిస్టెంట్ సేవలను ప్రారంభించింది. రిలయన్స్ డిస్నీ.. వినోదంలో కొత్త శకం డిస్నీతో ఒప్పందం దేశీ వినోద రంగంలో సరికొత్త శకానికి దారి చూపనున్నట్లు ముకేశ్ పేర్కొన్నారు. జియో, రిటైల్ తరహాలో మీడియా బిజినెస్ సైతం వృద్ధి బాటలో సాగుతుందని చెప్పారు. డిజిటల్ స్ట్రీమింగ్‌తో కంటెంట్ సృష్టిని జత చేస్తున్నట్లు వెల్లడించారు. గ్రీన్ ఎనర్జీ ప్రయాణంలో భాగంగా ఈ ఏడాది (2024–25) చివరికల్లా ఆర్ఐఎల్ తొలి సోలార్ గిగా ఫ్యాక్టరీని ప్రారంభించనున్నట్లు ముకేశ్ వెల్లడించారు. ఈ ప్లాంటు లో ఒకే చోట పీవీ మాడ్యూల్స్, సెల్స్, వేఫర్స్, పాలీసిలికాన్, గ్లాస్ తయారీని చేపట్టనున్నారు. తద్వారా ఈ యూనిట్ సౌరశక్తిని విద్యుత్‌గా మార్చనుంది. -
ఆర్తి డ్రగ్స్ బోనస్ భళా- బెర్జర్ బోర్లా
ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21 తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన హెల్త్‌కేర్ రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా.. బోనస్ షేర్ల ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఈ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్ పెరిగింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్-జూన్)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో బెర్జర్ పెయింట్స్ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ కౌంటర్ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం.. ఆర్తి డ్రగ్స్ లిమిటెడ్ ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్ తాజాగా వాటాదారులకు బోనస్ షేర్ల జారీకి ప్రతిపాదించింది. ఈ నెల 20న నిర్వహించనున్న సమావేశంలో బోనస్ షేర్ల అంశంపై కంపెనీ బోర్డు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్తి డ్రగ్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 2,399 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,227 వద్ద ట్రేడవుతోంది. క్యూ1లో ఆర్తి డ్రగ్స్ నికర లాభం 281 శాతం ఎగసి రూ. 85 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. బెర్జర్ పెయింట్స్ ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో బెర్జర్ పెయింట్స్ నికర లాభం 91 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 46 శాతం క్షీణించి రూ. 931 కోట్లకు చేరింది. అధిక ధరల్లో కొనుగోలు చేసిన చమురు నిల్వల కారణంగా ముడివ్యయాలు పెరిగి క్యూ1లో మార్జిన్లు 7.9 శాతంమేర మందగించినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ఫలితాలివి. ఈ నేపథ్యంలో బెర్జర్ పెయింట్స్ షేరు ప్రస్తుతం ఎన్ఎస్ఈలో 3 శాతం క్షీణించి రూ. 536 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 527 వరకూ వెనకడుగు వేసింది. -
గెయిల్ బోనస్ షేర్లు
• ప్రతి మూడు షేర్లకు ఒక షేర్ బోనస్ • ఒక్కో షేర్‌కు రూ.8.5 మధ్యంతర∙డివిడెండ్ న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ.. గెయిల్ బోనస్ షేర్లను ఇవ్వనుంది. రూ.10 ముఖవిలువ గల ప్రతి 3 షేర్లకు 1 షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి 85% (ఒక్కో షేర్‌కు రూ.8.50) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది. బోనస్ షేర్ల జారీతో కంపెనీ చెల్లించిన వాటా మూలధనం రూ.1,268 కోట్ల నుంచి రూ.1,691 కోట్లకు పెరుగుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత గెయిల్ బోనస్ షేర్లను జారీ చేస్తోంది. 2008, అక్టోబర్‌లో ప్రతి రెండు షేర్లకు ఒక షేర్‌ను బోనస్‌గా గెయిల్ జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారి. మరోవైపు రూపీ బాండ్ల ద్వారా రూ.750 కోట్ల సమీకరణకు బోర్డ్ ఆమోదం తెలిపింది. -
ఐఓసీ లాభం 25% అప్
క్యూ1లో రూ. 8,269 కోట్లు 1:1 బోనస్ షేర్లు న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీ) కంపెనీ చరిత్రలో అత్యధిక తొలి త్రైమాసిక లాభాన్ని ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌తో ముగిసిన త్రైమాసికం(2016-17, క్యూ1)లో కంపెనీ నికర లాభం 25 శాతం ఎగసి రూ.8,269 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.6,591 కోట్లుగా ఉంది. పటిష్టమైన పెట్రోకెమికల్ మార్జిన్లతో పాటు ఇన్వెంటరీ(నిల్వలు) సంబంధిత లాభాలు దీనికి దోహదం చేశాయి. గతేడాది క్యూ1లో రూ.1,14,200 కోట్లతో పోలిస్తే ఈ ఏడాది తొలి త్రైమాసికంలో రూ.1,07,671 కోట్లకు చేరింది. అయితే, స్థూల రిఫైనింగ్ మార్జిన్(జీఆర్ఎం) 10.77 డాలర్ల నుంచి 9.98 డాలర్లకు తగ్గింది. కాగా, ఐఓసీ డెరైక్టర్ల బోర్డు రూ.10 ముఖ విలువగల ఒక్కో షేరుకు ప్రతిగా మరో షేరును(1:1 ప్రాతిపదికన) బోనస్‌గా ఇచ్చేందుకు ఆమోదముద్ర వేసింది. ఫలితాల నేపథ్యంలో సోమవారం సల్పంగా 0.3 శాతం నష్టంతో రూ.572 వద్ద ముగిసింది. -
హెచ్‌పీసీఎల్ బోనస్ షేర్లు...
ప్రతి రెండు షేర్లకు ఒక షేరు జారీ.. న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ హెచ్‌పీసీఎల్ 2:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. ఇన్వెస్టర్ల వద్ద ఉన్న రూ.10ముఖ విలువ గల ఒకో షేరుకు 2 షేర్లను బోనస్‌గా ఇవ్వనున్నట్లు హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్(హెచ్‌పీసీఎల్) తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ 8న జరిగే వార్షిక సాధారణ సమావేశం(ఏజీఎం)లో ఈ బోనస్ షేర్ల ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంటుంది. అధీకృత వాటా మూలధనాన్ని రూ.2,500 కోట్లకు పెంచుకోవడానికి, రిజర్వ్‌లను మూలధనంగా మార్చుకోవడానికి గురువారం జరిగిన డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. అంతే కాకుండా ముంబై రిఫైనరీ వార్షిక సామర్థ్యాన్ని 6.6 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 7.5 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకోవడానికి కూడా డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. కాగా విశాఖ రిఫైనరీ సామర్థ్యాన్ని 8.3 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 15 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుకునే రూ.20,928 కోట్ల పెట్టుబడి ప్రణాళికకు డెరైక్టర్ల బోర్డ్ ఇప్పటికే ఆమోదం తెలిపింది. బోనస్ షేర్ల జారీ, ముంబై రిఫైనరీ విస్తరణ తదితర వార్తల కారణంగా హెచ్‌పీసీఎల్ షేర్ బీఎస్ఈలో ఇంట్రాడేలో ఏడాది గరిష్ట స్థాయిని(రూ.1,233) తాకింది. చివరకు 3.5 శాతం లాభంతో రూ.1,161 వద్ద ముగిసింది. -
వాటాదారులకు పీఎఫ్సీ 1:1 ‘బోనస్’
న్యూఢిల్లీ: పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్(పీఎఫ్సీ) తన వాటాదారులకు 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నది. వాటాదారుల వద్ద ఉన్న ఒక్కో ఈక్విటీ షేర్‌కు మరో ఒక్క షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపిందని పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తెలిపింది. అంతేకాకుండా అధీకృత షేర్ మూల ధనాన్ని రూ.2,000 కోట్ల నుంచి రూ.10,000 కోట్లకు పెంచుకోవడానికి కూడా బోర్డ్ ఆమోదం తెలిపిందని వివరించింది. భారత్‌తో పాటు విదేశాల్లో కూడా విద్యుత్, సంబంధిత రంగాల ప్రాజెక్ట్‌లకు పీఎఫ్సీ నిధులు అందిస్తోంది. బోనస్ వార్తల నేపథ్యంలో పీఎఫ్సీ షేర్ బీఎస్ఈలో 4.6 శాతం లాభంతో రూ.210 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో ఈ షేర్ 6.1 శాతం లాభపడి రూ.213ను తాకింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా ఉన్న రిజర్వ్‌లను ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లు జారీ చేయడానికి వినియోగించుకోవాలన్న ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పీఎఫ్సీ ఈ బోనస్ షేర్లను అందిస్తోంది. -
మైండ్ ట్రీ 1:1 బోనస్ షేర్లు
న్యూఢిల్లీ : అన్ని సెగ్మెంట్లలో పటిష్టమైన వృద్ధి కారణంగా మధ్య తరహా ఐటీ సంస్థ మైండ్‌ట్రీ ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.151 కోట్ల నికర లాభం ఆర్జించింది. గత క్యూ3లో ఆర్జించిన నికర లాభం(రూ.141 కోట్లు)తో పోల్చితే 7 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. ఆదాయం రూ.912 కోట్ల నుంచి 33 శాతం వృద్ధితో రూ.1,215 కోట్లకు పెరిగిందని వివరించింది. ఈ క్యూ3లో మంచి ఆదాయ వృద్ధిని సాధించామని కంపెనీ సీఈఓ కృష్ణకుమార్ నటరాజన్ తెలిపారు. డాలర్ టర్మ్‌ల్లో నికర లాభం 0.2 శాతం వృద్ధితో 2.28 కోట్ల డాలర్లకు, ఆదాయం 25 శాతం వృద్ధితో 18.44 కోట్ల డాలర్లకు పెరిగాయని పేర్కొన్నారు. 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్లను ఇవ్వనున్నామని నటరాజన్ తెలిపారు. రెండేళ్లలో బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారని పేర్కొన్నారు. రూ.10 ముఖ విలువ గల ఒక్కో షేర్‌కు రూ.4 మధ్యంతర డివిడెండ్‌ను కూడా ఇవ్వనున్నామని వివరించారు. మ్యాగ్నెట్ 360 సంస్థను 5 కోట్ల డాలర్లకు (రూ.338.3 కోట్లు)అంతా నగదులోనే కొనుగోలు చేశామని నటరాజన్ పేర్కొన్నారు.