ఆర్తి డ్రగ్స్‌ బోనస్‌ భళా- బెర్జర్‌ బోర్లా | Aarti drugs bouns- Berger paints weak Q1 | Sakshi
Sakshi News home page

ఆర్తి డ్రగ్స్‌ బోనస్‌ భళా- బెర్జర్‌ బోర్లా

Published Mon, Aug 17 2020 2:51 PM | Last Updated on Mon, Aug 17 2020 2:59 PM

Aarti drugs bouns- Berger paints weak Q1  - Sakshi

ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21 తొలి త్రైమాసికంలో ఆకర్షణీయ ఫలితాలు సాధించిన హెల్త్‌కేర్‌ రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్‌ తాజాగా.. బోనస్‌ షేర్ల ప్రతిపాదనను తీసుకువచ్చింది. దీంతో ఈ కౌంటర్‌కు ఒక్కసారిగా డిమాండ్‌ పెరిగింది. మరోపక్క ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో బెర్జర్‌ పెయింట్స్‌ కౌంటర్లో అమ్మకాలు తలెత్తాయి. దీంతో ఈ కౌంటర్‌ నష్టాలతో డీలా పడింది. వివరాలు చూద్దాం..

ఆర్తి డ్రగ్స్‌ లిమిటెడ్
ఫార్మా రంగ కంపెనీ ఆర్తి డ్రగ్స్‌ తాజాగా వాటాదారులకు బోనస్‌ షేర్ల జారీకి ప్రతిపాదించింది. ఈ నెల 20న నిర్వహించనున్న సమావేశంలో బోనస్‌ షేర్ల అంశంపై కంపెనీ బోర్డు నిర్ణయాన్ని తీసుకోనున్నట్లు వెల్లడించింది. దీంతో ఆర్తి డ్రగ్స్‌ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 13 శాతం దూసుకెళ్లింది. రూ. 2,399 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. ప్రస్తుతం 5.3 శాతం జంప్‌చేసి రూ. 2,227 వద్ద ట్రేడవుతోంది. క్యూ1లో ఆర్తి డ్రగ్స్‌ నికర లాభం 281 శాతం ఎగసి రూ. 85 కోట్లను అధిగమించిన సంగతి తెలిసిందే. 

బెర్జర్‌ పెయింట్స్
ఈ ఆర్థిక సంవత్సరం క్యూ1లో బెర్జర్‌ పెయింట్స్‌ నికర లాభం 91 శాతం పడిపోయి రూ. 15 కోట్లకు పరిమితమైంది. మొత్తం ఆదాయం సైతం 46 శాతం  క్షీణించి రూ. 931 కోట్లకు చేరింది. అధిక ధరల్లో కొనుగోలు చేసిన చమురు నిల్వల కారణంగా ముడివ్యయాలు పెరిగి క్యూ1లో మార్జిన్లు 7.9 శాతంమేర మందగించినట్లు కంపెనీ పేర్కొంది. కన్సాలిడేటెడ్‌ ఫలితాలివి. ఈ నేపథ్యంలో బెర్జర్‌ పెయింట్స్‌ షేరు ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 3 శాతం క్షీణించి రూ. 536 దిగువన ట్రేడవుతోంది. తొలుత రూ. 527 వరకూ వెనకడుగు వేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement