గెయిల్ బోనస్ షేర్లు
• ప్రతి మూడు షేర్లకు ఒక షేర్ బోనస్
• ఒక్కో షేర్‌కు రూ.8.5 మధ్యంతర∙డివిడెండ్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ గ్యాస్ సంస్థ.. గెయిల్ బోనస్ షేర్లను ఇవ్వనుంది. రూ.10 ముఖవిలువ గల ప్రతి 3 షేర్లకు 1 షేర్‌ను బోనస్‌గా ఇవ్వడానికి డైరెక్టర్ల బోర్డ్ ఆమోదం తెలిపింది. దీనికి వాటాదారుల ఆమోదం పొందాల్సి ఉంది. ఇక ఈ ఆర్థిక సంవత్సరానికి 85% (ఒక్కో షేర్‌కు రూ.8.50) మధ్యంతర డివిడెండ్‌ను ప్రకటించింది.
బోనస్ షేర్ల జారీతో కంపెనీ చెల్లించిన వాటా మూలధనం రూ.1,268 కోట్ల నుంచి రూ.1,691 కోట్లకు పెరుగుతుంది. దాదాపు పదేళ్ల తర్వాత గెయిల్ బోనస్ షేర్లను జారీ చేస్తోంది. 2008, అక్టోబర్‌లో ప్రతి రెండు షేర్లకు ఒక షేర్‌ను బోనస్‌గా గెయిల్ జారీ చేసింది. స్టాక్ మార్కెట్లో లిస్టయిన తర్వాత బోనస్ షేర్లనివ్వడం ఇది రెండోసారి. మరోవైపు రూపీ బాండ్ల ద్వారా రూ.750 కోట్ల సమీకరణకు బోర్డ్ ఆమోదం తెలిపింది.