బోనస్ షేర్ల క్రెడిట్, ట్రేడింగ్ ప్రక్రియను వేగవంతం చేసే ప్రయత్నంలో భాగంగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. దీని ప్రకారం.. మదుపరులు రికార్డు తేదీ నుండి కేవలం రెండు రోజుల తర్వాత నుంచే బోనస్ షేర్లను ట్రేడ్ చేయగలుగుతారు. అక్టోబర్ 1 నుంచి ఈ సర్దుబాటు అమల్లోకి వస్తుంది.
ప్రస్తుత ఐసీడీఆర్ (ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్‌మెంట్స్) నియమాలు బోనస్ ఇష్యూ అమలుకు సంబంధించి మొత్తం టైమ్‌లైన్‌లను సూచిస్తాయి. అయితే ఇష్యూ రికార్డ్ తేదీ నుండి బోనస్ షేర్ల క్రెడిట్, అటువంటి షేర్ల ట్రేడింగ్ కోసం నిర్దిష్ట కాలక్రమం లేదు.
ప్రస్తుతం బోనస్ ఇష్యూ తర్వాత ఇప్పటికే ఉన్న షేర్‌లు అదే ఐఎస్‌ఐఎన్ కింద ట్రేడింగ్‌ను కొనసాగిస్తాయి. వీటికి కొత్తగా క్రెడిట్ అయ్యే బోనస్ షేర్‌లు రికార్డ్ తేదీ తర్వాత 2-7 పని దినాలలో ట్రేడింగ్‌కు అందుబాటులో ఉంటాయి.
నూతన మార్గదర్శకాల ప్రకారం, బోనస్ షేర్లలో ట్రేడింగ్ ఇప్పుడు రికార్డ్ తేదీ తర్వాత రెండవ పని రోజు (T+2) ప్రారంభవుతుంది. దీంతో మార్కెట్ సామర్థ్యం పెరగడంతోపాటు ఆలస్యం తగ్గుతుంది. అక్టోబర్ 1న లేదా ఆ తర్వాత ప్రకటించిన అన్ని బోనస్ ఇష్యూలకు ఇది వర్తిస్తుంది అని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) ఒక సర్క్యులర్‌లో తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment