న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్న వేళ ఒక లేడీ బాస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 80-82 లక్షల రూపాయల 'క్రిస్మస్ బోనస్' ప్రకటించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ మహిళా బాస్ పేరు గినా రైన్‌హార్ట్. 34 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆస్ట్రేలియాలో టాప్ బిలియనీర్.
ఆస్ట్రేలియాలోపనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఆమె తండ్రి స్థాపించిన మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీ హాన్‌కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ కి జార్జినా (గినా) రైన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచి, ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ మంచి లాభాలతో నడుస్తుండటం గమనార్హం. (మీరు ఎస్‌బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్)
అయితే రైన్‌హార్ట్ తన ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని ప్రటకించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో 10 మంది పేర్లను పిలవ బోతున్నట్లు ప్రకటించారు. అసలే దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ముఖ్యమైన ప్రకటన అనగానే అందరూ బెంబేలెత్తిపోయారు. సడెన్‌గా ఆ పదిమందికి లక్ష డాలర్లు బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులకు కూడా లక్షల్లో బోనస్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం విశేషం.
కాగా కంపెనీ గత 12 నెలల్లో 3.3 బిలియన్ల డాలర్లు (రూ. 190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించి నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గినా. కంపెనీ లాభాలు దేశానికి కూడా ఉపయోగ పడ్డాయని, అందుకే ఈ కానుక అని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురి కావడం ఉద్యోగుల వంతైంది.
Comments
Please login to add a commentAdd a comment