Christamas
-
క్రిస్మస్ శాంటా తాత ఎవరు? ఏ ఊరి నుంచి వస్తాడు? అసలు నిజమేంటి?
"క్రిస్మస్ రోజున శాంటా తాత వస్తాడు. బహుమతులెన్నో తెస్తాడు. శాంటా ఉత్తర ధ్రువం నుంచి వస్తాడని అందరూ అంటారు. కాదు శాంటా మా ఊరి నుంచి వస్తాడు అంటారు ఫిన్లాండ్ దేశస్తులు. ఫిన్లాండ్లోని ‘రొవానియమి’ పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్. ప్రతి క్రిస్మస్కు పర్యాటకులు అక్కడకు వెళ్లి శాంటా ఊరు ఇదేనంటూ సందడి చేస్తారు. ఈ ఊరి విశేషాలు చాలానే ఉన్నాయి. పిల్లలకు చెప్తే అబ్బుర పడతారు." ‘జింగిల్ బెల్స్ జింగిల్ బెల్స్ జింగల్ ఆల్ ద వే’.. ఎర్రని దుస్తుల్లో, తలమీద టోపీతో, గుబురు గెడ్డంతో, రైన్ డీర్లు లాగే స్లెడ్జ్ బండి మీద, బోలెడన్ని కానుకలు మూటగట్టుకుని క్రిస్మస్ రాత్రి ఆకాశ వీధుల గుండా క్రిస్మస్ తాత వస్తాడని పిల్లలకు ఒక నమ్మకం. క్రిస్మస్ వచ్చే ముందే తల్లిదండ్రులు పిల్లల్ని ‘క్రిస్మస్ తాత ఏం ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నావు’ అని అడుగుతారు. కొందరు పిల్లలు ‘ఫలానాది ఇవ్వు’ అని క్రిస్మస్ తాతకు లెటర్లు రాస్తారు. కొందరు పిల్లలు ఇవేవీ అడక్కుండా తమకోసం ఏం ఇస్తాడో చూద్దాం అని ఉత్సుకతతో ఎదురు చూస్తారు. ఎవరి బాల్యంలో అయినా ఇది అద్భుతమైన జ్ఞాపకం. క్రిస్మస్ తాత అంటూ ఎవరూ రారు అని పిల్లలకు తెలిసినా.. ఏమో వస్తాడేమో అనుకునే అమాయకమైన వయసు అది. వస్తాడేమో అనిపించే ఉత్సుకత ఉండేప్రాయం అది. అందుకే తల్లిదండ్రులు, బంధువులు చిన్నారులు ఉన్నచోట వారు నిద్రపోయాక వారి కోసం తల దగ్గర కానుకలు పెట్టి వెళతారు. పిల్లలు తెల్లారి లేచి వాటిని చూసుకుని ‘శాంటా ఇచ్చాడు’ అని సంబర పడతారు. శాంటా తాత ఎవరు? ఇది బైబిల్ పాత్ర కాదు. క్రీ.శ.280 కాలంలో టర్కీలో సెయింట్ నికొలస్ అనే ఒక బిషప్ క్రిస్మస్ పండుగ నాడు పేదవారికి, ముఖ్యంగా పిల్లలకు ఎంతో కొంత సహాయం చేసేవాడట. నిద్రపోతున్న వారి పక్కన కానుకలు, డబ్బు పెట్టి వెళ్లేవాడట. సాక్సుల్లో బంగారు నాణెలు పెట్టి ఇళ్లల్లో పడేసేవాడని అంటారు. పండగంటే ఆనందం పంచడమే కదా. ఇది అందరికీ నచ్చింది. ఇలా ఒక తాత వచ్చి కానుకలు ఇస్తే బాగుండు అనే కోరిక పెరిగింది. మంచి కోరికను తీర్చడానికి ప్రపంచమంతా ముందుకొస్తుంది. అందుకే క్రిస్మస్ తాత అందరి తాత అయ్యాడు. సెయింట్ నికోలస్ కాస్తా శాంటా క్లాజ్ అయ్యాడు. శాంటా ఊరు.. నిజమైన శాంటా క్లాజ్ టర్కీ వాడైనా కాలక్రమంలో నార్త్‌పోల్ వాడయ్యాడు. దీనికి కారణం 1893–96ల మధ్య థామస్ నాస్ట్ అనే అమెరికన్ కార్టూనిస్టు శాంటా క్లాజ్ బొమ్మలు పత్రికలకు గీసి శాంటా నార్త్‌పోల్ వాడని అడ్రస్ పెట్టాడు. దానికి కారణం ఆ రోజుల్లో నార్త్ పోల్ (ఉత్తర ధ్రువం) ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కనుక దాని చుట్టూ ఒక దైవిక కల్పనలు సాగేవి. సెయింట్స్ అక్కడే ఉంటారని అనుకొని ఉండొచ్చు. అదీగాక అక్కడ ఎప్పుడూ మంచు పడుతూ ఉంటుంది కనుక క్రిస్మస్ అంటే మంచుకాలం కనుక థామస్ నాస్ట్ ఏకంగా 24 గంటలూ మంచు ఉండే ప్రాతాన్ని శాంటా క్లాజ్ తావును చేసి ఉంటాడు. ఇక అక్కడ రైన్డీర్లు ఉంటాయి కాబట్టి వాటిని వాహనంగా మార్చారు. ఫిన్లాండ్ ఊరు.. ఫిన్లాండ్ దేశం వారు శాంటా తమ ఊరి వాడేనని ఒక వాదన మొదలుపెట్టారు – పర్యాటక ఎత్తుగడే కావచ్చు. ఫిన్లాండ్ ఆర్కిటిక్ సర్కిల్లో వచ్చే దేశం కాబట్టి అక్కడ ఎప్పుడూ మంచే కాబట్టి శాంటా ఊరు తమ దేశంలోదే అనుకుని ఉండొచ్చు. అంతటితో ఆగక ‘రొవానిఎమి’ అనే ఊరిని శాంటా ఊరిగా టూరిస్ట్ ఎట్రాక్షన్ చేశారు. ఇక్కడ శాంటా ఇల్లు, శాంటా పోస్టాఫీసు, శాంటా తిరిగే స్లెడ్జ్బళ్లు అన్నీ ఉంటాయి. మైనస్ 12 డిగ్రీల చల్లదనం ఉండే క్రిస్మస్ కాలంలో కూడా టూరిస్టులు శాంటా ఊరికి వెళ్లి సందడి చేస్తారు. మత భావనలు పొందుతారు. ఈ ఊరి వారు శాంటాతో మాట్లాడాలనుకునే పిల్లల కోసం ఒక టెలిఫోన్ నంబర్ కూడా ఇచ్చారు. ఇక్కడి పోస్టాఫీసుకు ప్రతి సంవత్సరం 200 దేశాల నుంచి రెండు లక్షల ఉత్తరాలు శాంటా నుంచి పిల్లలకు వస్తాయి. ఇక్కడకు వెళ్లిన పర్యాటకులు ఇక్కడి పోస్టాఫీసులో ఉత్తరం రాసి పడేస్తే కరెక్ట్‌గా క్రిస్మస్కు అందేలా పంపుతారు. అంటే శాంటా పంపినట్టు పంపుతారు. అదో సరదా. 'శాంటా అబద్ధం కావచ్చు. కాని శాంటా ఉంటాడన్న పిల్లల అమాయక కామన అబద్ధం కాకూడదు. ఈ క్రిస్మస్ రోజున అందరు పిల్లలకూ, ముఖ్యంగా ఆట వస్తువులు లేని పేద పిల్లలకు మీరే శాంటాగా మారండి. హ్యాపీ క్రిస్మస్. ఇవి చదవండి: ముక్కోటి ఏకాదశిన ఉత్తర ద్వార దర్శనమే మేలు.... ఎందుకు? -
మీరంతా ప్రపంచంతో పోటీ పడేలా ఉండాలి: సీఎం జగన్
అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం జగన్ మాట్లాడుతూ.. ►నాడు-నేడుతో స్కూల్స్ రూపురేఖలు మార్చాం ►రాబోయే రోజుల్లో మన పిల్లల తలరాతలు మారతాయి ►విద్యకు సంబంధించి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నాం ►విద్యార్థులు భవిష్యత్తు బావుండాలనే తపనతోనే విద్యకు పెద్ద పీట వేస్తున్నాం ►మనం కాంపిటేషన్‌తో ఉండేది పులివెందులతోనో, ఆంధ్ర రాష్ట్రంతోనో కాదు.. ►మీరంతా ప్రపంచంతో పోటీ పడేందుకే ఈ తరహా మంచి కార్యక్రమాలు చేపట్టాం ►అందుకే అంతా చక్కగా చదువుకోవాలి. ►విద్యార్థుల తల్లులకు ఒక అన్నగా, విద్యార్థులకు మేనమామగా అండగా ఉంటా 03:53PM అహోబిలపురం స్కూల్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 03:16PM పులివెందులలో బస్టాండ్‌ను ప్రారంభించిన తర్వాత ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం జగన్ ►మనం చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం ►జరుగుతున్న అభివృద్ధి వారికి కనిపించడం లేదు ►గతంతో పోలిస్తే అప్పుల్లో పెరుగుదల ఇప్పుడే తక్కువ ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►గ్లాసులో 75 శాతం నీళ్లున్నా.. నీళ్లే లేవని బాబు ప్రచారం చేస్తున్నారు ►అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►విద్యార్థులు, పేదలు, రైతుల తలరాతలు మారుతున్నాయి ►మనకు ఓటు వేయని వారికి కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం ►కేవలం సీఎం మారడంతోనే పేదల తలరాతలు మారుతున్నాయి ►రూ. 1.71లక్షల కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేశాం ►గత ఎన్నికల్లో 151 సీట్లు.. ఈసారి వైనాట్ 175కి 175 సీట్లు ►లంచాలకు తావులేకుండా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం ►నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే నగదు జమ చేస్తున్నాం ►గతంలో అదే బడ్జెట్.. ఇప్పుడూ అదే బడ్జెట్ ►గత ప్రభుత్వం ఇన్ని పథకాలు ఎందుకు ఇవ్వలేకపోయింది ►పులి వెందులను ఆదర్శవంత నియోజకవర్గంగీ తీర్చిదిద్దుతున్నాం ►అత్యాధునిక వసతులతో వైఎస్సార్ బస్ టెర్మినల్‌ను ప్రారంభించాం ►రాష్ట్రంలోని బస్ టెర్మినల్‌కు పులివెందుల బస్ టెర్మినల్ ఆదర్శం 03.14PM ►పులివెందులలో సీఎం జగన్ ►కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందులలో కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ ►పులివెందుల బస్టాండ్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 02:11PM ►వైఎస్సార్ కడప జిల్లా కూరగాయల మార్కెట్ అనుకుని నూతనంగా నాలుగుకోట్ల 30 లక్షలతో నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ మెమోరియల్ పార్క్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 58 PM ►పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో కోటి ఇరవై లక్షలతో నూతనంగా నిర్మించిన డాక్టర్ వైఎస్సార్ కూరగాయల మార్కెట్‌ను ప్రారంభించిన సీఎం జగన్ 01: 15 PM వైఎస్సార్ జిల్లా ►పులివెందులకు చేరుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ►విజయ హోమ్ వద్ద జంక్షన్‌ను, దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ జగన్ 10: 25 AM ►వైఎస్సార్ జిల్లాలో రెండో రోజు సీఎం జగన్ పర్యటన ►ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన సీఎం జగన్ ►పులివెందులలో పలు అభివృద్ధి పనులకు సీఎం ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ►పులివెందులలో ఆర్టీసీ బస్టాండ్‌ను ప్రారంభించనున్న సీఎం జగన్ సాక్షి, పులివెందుల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం పులివెందులకు రానున్నారు. పులివెందులలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు.సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం మధ్యాహ్నం 12.30గంటలకు ఇడుపులపాయ నుంచి భాకరాపురం హెలీప్యాడ్‌కు చేరుకుంటారు. 1.10గంటల నుంచి 1.20 వరకు విజయ హోమ్స్ వద్ద ఉన్న జంక్షన్‌ను ప్రారంభిస్తారు. 1.30 నుంచి 1.45గంటల వరకు కదిరి రోడ్డు జంక్షన్, విస్తరణ రోడ్డును, 1.50 నుంచి 2గంటల వరకు నూతన కూరగాయల మార్కెట్‌ను, 2.05 నుంచి 2.20 గంటల వరకు మైత్రి లేఅవుట్లో వైఎస్సార్ మెమోరియల్ పార్కును ప్రారంభిస్తారు. 2.35 నుంచి 2.50 గంటల వరకు రాయలాపురం నూతన బ్రిడ్జిని ప్రారంభిస్తారు. 3గంటల నుండి 3.30గంటల వరకు డాక్టర్ వైఎస్సార్ బస్ టర్మినల్‌ను ప్రారంభించి బస్టాండు ఆవరణంలో ప్రజలనుద్ధేశించి ప్రసంగిస్తారు. 3.35గంటల నుంచి 3.55గంటల వరకు నాడు – నేడు ద్వారా అభివృద్ధి చేసిన అహోబిలాపురం స్కూలును ప్రారంభిస్తారు. 4.05గంటల నుంచి 4.20గంటల వరకు మురుగునీటిశుద్ధి కేంద్రాన్ని, 4.30గంటల నుంచి 4.45గంటల వరకు గార్బేజీ ట్రాన్స్ఫర్ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం 5.00గంటలకు భాకరాపురం హెలీఫ్యాడ్‌కు చేరుకుని అక్కడ నుంచి ఇడుపులపాయకు బయలుదేరి వెళతారు. సీఎస్ఐ చర్చిలో ప్రార్థనలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదివారం క్రిస్మస్ పండుగ సందర్భంగా పులివెందుల సీఎస్ఐ చర్చిలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అక్కడే క్రిస్మస్ కేక్‌ను కట్ చేయనున్నారు. సీఎం పర్యటనా ప్రాంతాల పరిశీలన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శని, ఆదివారాలు పులివెందుల పర్యటన దృష్ట్యా అందుకు సంబంధించిన ఏర్పాట్లను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డిలతో కలిసి శుక్రవారం ఉదయం పరిశీలించారు. నూతనంగా నిర్మించిన ఆర్టీసీ బస్టాండులో సీఎం బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు తగిన సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించే అభివృద్ధి పనులను కూడా ఆయన పరిశీలించారు. సీఎం పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇడుపులపాయకు చేరుకున్న ముఖ్యమంత్రి వేంపల్లె: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23 నుంచి 25వ వరకు మూడు రోజులపాటు జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకు చేరుకున్నారు. శుక్రవారం కడప, కమలాపురం ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ముగించుకుని హెలీకాప్టర్ ద్వారా ఇడుపులపాయకు వచ్చారు. సాయంత్రం 5.51 గంటలకు ఇడుపులపాయలోని వ్యవసాయ క్షేత్రంలో ఉన్న హెలీపాడ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డి, డీసీఓ సుభాషిణి, స్పెషల్ కలెక్టర్ రోహిణి, జమ్మలమడుగు ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి వాహనం ద్వారా రోడ్డు మార్గాన బయలుదేరి వైఎస్సార్ గెస్ట్‌హౌస్‌కు చేరుకుని రాత్రికి అక్కడే బస చేశారు. -
లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్న వేళ ఒక లేడీ బాస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 80-82 లక్షల రూపాయల 'క్రిస్మస్ బోనస్' ప్రకటించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ మహిళా బాస్ పేరు గినా రైన్‌హార్ట్. 34 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆస్ట్రేలియాలో టాప్ బిలియనీర్. ఆస్ట్రేలియాలోపనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఆమె తండ్రి స్థాపించిన మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీ హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ కి జార్జినా (గినా) రైన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచి, ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ మంచి లాభాలతో నడుస్తుండటం గమనార్హం. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) అయితే రైన్‌హార్ట్ తన ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని ప్రటకించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో 10 మంది పేర్లను పిలవ బోతున్నట్లు ప్రకటించారు. అసలే దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ముఖ్యమైన ప్రకటన అనగానే అందరూ బెంబేలెత్తిపోయారు. సడెన్‌గా ఆ పదిమందికి లక్ష డాలర్లు బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులకు కూడా లక్షల్లో బోనస్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం విశేషం. కాగా కంపెనీ గత 12 నెలల్లో 3.3 బిలియన్ల డాలర్లు (రూ. 190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించి నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గినా. కంపెనీ లాభాలు దేశానికి కూడా ఉపయోగ పడ్డాయని, అందుకే ఈ కానుక అని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురి కావడం ఉద్యోగుల వంతైంది. -
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. రాష్ట్రాలకు, కేంద్రం కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో కోవిడ్ కాలంలో అనుసరించాల్సిన విధానాలు (కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్– సీఏబీ) తప్పక పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనాపై పోరు ఇంకా ముగిసిపోలేదని హెచ్చరించారు. వ్యాక్సినేషన్ తక్కువ, కేసులు ఎక్కువ, మౌలిక వసతులు అంతంతమాత్రంగా ఉన్న రాష్ట్రాలకు సహాయక బృందాలను పంపాలని, పరిస్థితి మెరుగుపడేందుకు సహకరించాలని అధికారులను ఆదేశించారు. ఒమిక్రాన్ కల్లోల నేపథ్యంలో కరోనా పరిస్థితులపై ఆయన గురువారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమయంలో అందరం అప్రమత్తంగా, జాగరుకతతో ఉండాలని పిలుపునిచ్చారు. దేశంలో కరోనా నియంత్రణ, నిర్వహణ, ఆరోగ్య వసతుల కల్పన, ఔషధాలు, ఆక్సిజన్ లభ్యత, వెంటిలేటర్లు, ఆస్పత్రి బెడ్స్ లభ్యత, మానవ వనరులు, టీకా కార్యక్రమ పురోగతి తదితర అంశాలపై సమావేశంలో సమీక్షించారని ప్రధాని కార్యాలయం(పీఎంఓ) తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వల్ల తలెత్తుతున్న పరిస్థితులను, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన చర్యలను అధికారులు ప్రధానికి వివరించారు. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి, అధిక కేసులు నమోదు చేస్తున్న రాష్ట్రాలు, పాజిటివిటీ అధికంగా ఉన్న జిల్లాల సమాచారాన్ని ప్రధాని ముందుంచారు. నవంబర్ 25 నుంచి తీసుకున్న చర్యలను, అంతర్జాతీయ విమానప్రయాణికుల నూతన నిబంధనలు, రాష్ట్రాలతో నిర్వహించిన సమావేశాల సారాన్ని ప్రధానికి వివరించారు. పర్యవేక్షణ అనంతరం రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ తగిన సహాయం అందించాలని కేంద్ర అధికారులను మోదీ ఆదేశించారు. చదవండి: దేశం ఓ మైలు రాయిని అధిగమించింది! 60% జనాభాకు.. పీఎం ఆదేశాలివే.. ► కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. ► జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. ► రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సదుపాయాలు, సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ► ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. ► టెలిమెడిసిన్, టెలి కన్సల్టేషన్ వంటి ఐటీ సాంకేతికతలను ఉపయోగించుకోవాలి. ► కేసుల సత్వర గుర్తింపుతో పాటు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు ఆటంకం లేకుండా చర్యలు తీసుకోవాలి. ► కాంటాక్ట్ ట్రాకింగ్ సమర్ధవంతంగా నిర్వహించడం ద్వారా వ్యాప్తిని అరికట్టే చర్యలపై శ్రద్ధవహించాలి. ► తక్కువ టీకా రేటు, ఎక్కువ కేసులున్న ప్రాంతాలకు బృందాలను పంపాలి. కరోనాపై కేంద్రీకృత, సహకారయుక్త పోరు సాగించాలి. జిల్లాస్థాయి నుంచి సమీక్షించుకుంటూ ఆరోగ్య వ్యవస్థలను బలపరచాలి. రాష్ట్రాల్లో తగినంత ఆక్సిజన్ సరఫరా యంత్రాంగం ఉండేలా, అవన్నీ సరిగ్గా పనిచేసేలా చర్యలు తీసుకోవాలి. ఎప్పటికప్పుడు ఆరోగ్య మౌలిక వసతుల గురించి రాష్ట్రాలతో సమీక్ష నిర్వహించాలి. – ప్రధాని మోదీ -
క్రిస్మస్కి ఓటీటీ, థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే!
కరోనా తగ్గుముఖం పట్టాక ఇండస్ట్రీ సినిమా రిలీజ్‌ల మీద దృష్టిపెట్టింది. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్ వరకు కదిలి వస్తారని అఖండ, పుష్ప సినిమాలు నిరూపించడంతో చిన్న చిత్రాల నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు బాక్సాఫీస్ బరిలో దూకుతున్నాయి. ముఖ్యంగా ఈ వారం పెద్దపెద్ద సినిమాలు కూడా రిలీజవుతున్నాయి. అటు థియేటర్‌తో పాటు ఓటీటీలో కూడా పలు చిత్రాలు సందడి చేయనున్నాయి. అవేంటో చూద్దాం.. క్రిస్మస్కు థియేటర్లో సందడి చేయబోయే చిత్రాలివే! నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం ‘శ్యామ్ సింగరాయ్’. రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిపల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేచురల్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 24న థియేటర్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా గతంలో నాని నటించిన టక్ జగదీశ్ ఓటీటీలో విడుదల కావడంతో ఆయన అభిమానులు నిరాశపడ్డారు. ఇప్పుడు ‘శ్యామ్ సింగరాయ్’ థియేటర్లోనే విడుదలవుతుండటంతో అతడి ఫ్యాన్స్ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 1983 వరల్డ్ కప్ నేపథ్యంలో కబీర్ ఖాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘83’. రణ్వీర్ సింగ్, దీపికా పదుకోన్, జీవా, తాహీర్ రాజ్ భాసీన్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. టిమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ బయోపిక్‌గా రూపొందిన ఈ చిత్ర రణ్వీర్ సింగ్ లీడ్ రోల్ పోషిస్తుండగా దీపికా ఆయన భార్య రోమి భాటియాగా నటిస్తోంది. కబీర్ ఖాన్, విష్ణు ఇందూరి, దీపిక పదుకొనె, సాజిద్ నడియాడ్వాలా, ఫాంటమ్ ఫిలిమ్స్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్, 83 ఫిలిమ్ లిమిటెడ్‌లు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా డిసెంబర్ 24 దేశ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. సప్తగిరి, నేహా సోలంకి జంటగా కె.యమ్.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గూడు పుఠాణి’. పరుపాటి శ్రీనివాస్‌రెడ్డి, కటారి రమేష్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ థ్రిల్లర్ డిసెంబరు 25న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రఘు కుంచె ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలతో రూపొందించిన ఈ చిత్రం ఆరంభం నుంచి చివరి వరకు ఆసక్తిని రేకెత్తిస్తూ సాగుతుందని ప్రచార చిత్రాలను చూస్తే అర్థమవుతోంది. పూర్ణ ప్రధాన పాత్రలో కర్రి బాలాజీ తెరకెక్కించిన చిత్రం ‘బ్యాక్‌డోర్’. బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మాత. ప్రణవ్ స్వరాలందించారు. ఈ సినిమాని డిసెంబర్ 25న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ‘‘వైవిధ్యభరితమైన కథాంశంతో.. చక్కటి సందేశమిస్తూ సినిమాని రూపొందించాం. పూర్ణ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. కచ్చితంగా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అని నిర్మాత తెలియజేశారు. యాక్షన్ ప్రియులను విశేషంగా అలరించిన చిత్రం ‘ది మ్యాట్రిక్’. 1999లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత ‘ది మ్యాట్రిక్స్ రీలోడెడ్’, ‘ది మ్యాట్రిక్స్ రెవెల్యూషన్స్’ చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దాదాపు 13ఏళ్ల తర్వాత ఈ సిరీస్‌లో వస్తున్న చిత్రం ‘ది మ్యాట్రిక్స్ రీసర్కషన్స్’ లానా వచౌస్కీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబరు 22న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కీనూ రీవ్స్, క్యారీ అన్నె మోస్‌లతో పాటు, బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్ర పోషిస్తుస్తోంది. ఈ చిత్రంలో ఆమె సతి అనే సాహసోపేతమైన పాత్ర పోషిస్తున్నారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఆనంద్ చంద్ర తెరకెక్కించిన చిత్రం ‘ఆశ ఎన్కౌంటర్’. 2010లో యావత్ దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన హైదరాబాద్ గ్యాంగ్‌రేప్‌ను ఆధారంగా ఈ మూవీని రూపొందించారు. హైదరాబాద్ నగరశివారులోని చటాన్‌పల్లి వద్ద ఓ యువతిపై కొందరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడి.. అనంతరం ఆమెను అతి క్రూరంగా హత్య చేశారు. ఇదే కథను నేపథ్యంగా చేసుకుని ఆనంద్ చంద్ర ‘ఆశ ఎన్కౌంటర్’ తెరకెక్కించాడు. డిసెంబరు 25న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్జీవీ సమర్పణలో అనురాగ్ కంచర్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఓటీటీలోకి స్ట్రీమింగ్ అయ్చే చిత్రాలు ఇవే డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు) ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కేవి గుహన్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు (ఎవరు, ఎక్కడ, ఎందుకు)'. తొలిసారిగా కంప్యూటర్ స్క్రీన్ బేస్డ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ జంటగా నటించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ నేరుగా ఓటీటీలో విడుదల అవుతుంది. ప్రముఖ ఓటీటీ సంస్థ 'సోని లివ్', డిసెంబర్ 24న స్ట్రీమింగ్ కానుంది. సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పణలో రామంత క్రియేషన్స్ పతాకంపై డా. రవి ప్రసాద్ రాజు దాట్ల ఈ చిత్రాన్ని నిర్మించాడు. ‘వరుడు కావలెను’ నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన చిత్రం ‘వరుడు కావలెను’. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించారు. ప్రేమ, కుటుంబం, అనుబంధాల నేపథ్యంలో సాగే కథతో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు జీ5 ఓటీటీ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అతరంగీ రే బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్, కోలీవుడ్ నటుడు ధనుష్ కలిసి నటిస్తున్న చిత్రం ‘అతరంగీ రే’. సారా అలీఖాన్ కథానాయిక. ఆనంద్ ఎల్. రాయ్ దర్శకుడు. ఈ సినిమా ఓటీటీ ‘డిస్నీ ప్లస్ హాట్‌స్టార్’ వేదికగా డిసెంబరు 24 నుంచి స్ట్రీమింగ్కానుంది. ఇంద్రజాలికుడిగా అక్షయ్‌కుమార్, ప్రేమికులుగా ధనుష్, సారా అలీఖాన్ కనిపించనున్నారు. సత్యమేవ జయతే జాన్ అబ్రహం కథానాయకుడిగా తెరకెక్కి విజయం సాధించిన చిత్రం ‘సత్యమేవ జయతే’. దానికి కొనసాగింపుగా ‘సత్యమేవ జయతే 2’ వచ్చిన సంగతి తెలిసిందే. మిలాప్ జవేరీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దివ్యా కోస్లా కుమార్ ఓ కీలక పాత్రలో నటించింది. యాక్షన్ సన్నివేశాలకు ఇందులో పెద్ద పీట వేశారు. కాగా, డిసెంబరు 24వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. పరంపర మూవీ సరిగ్గా ఉండడానికి, మంచిగా ఉండడానికి మధ్య జరిగే పోరాటంలో ఎప్పుడైనా స్పష్టమైన విజేత ఉంటాడా? కుటుంబ సంబంధాలలో చెడు వారసత్వాన్ని ఉంచడం దీర్ఘకాలంలో ఉపయోగపడుతుందా?లక్ష్యాలను సాధించడంలో సహాయపడుతుందా? వంటి విషయాలకు సమాధానం కావాలంటే ‘పరంపర’ చూడాల్సిందే అంటున్నారు ‘బాహుబలి’ నిర్మాతలు. ఆర్కా మీడియా వర్క్స్ బ్యానర్‌పై కృష్ణ విజయ్ ఎల్, విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని ఈ సిరీస్‌ను నిర్మించారు. హరి యెల్లేటి కథను అందించారు. డిసెంబర్ 24న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ‘పరంపర’ స్ట్రీమింగ్ కానుంది. మానాడు తమిళ నటుడు శింబు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మానాడు’. గత నెలలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. తెలుగులోనూ ‘లూప్’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టైం లూప్ అనే వినూత్న కథాంశంతో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరో పాత్రతోపాటు పోలీసు ఆఫీసర్ ‘డీసీపీ ధనుష్కోటి’ పాత్ర కూడా ఎంతో కీలకం. ఈ పాత్రను నటుడు, దర్శకుడు ఎస్.జె సూర్య పోషించారు. కాగా, ఇప్పుడు ఈ చిత్రం డిసెంబరు 24న ప్రముఖ ఓటీటీ సోనీలివ్‌లో స్ట్రీమింగ్ కానుంది. -
పిల్లలకు సర్ప్రైజ్ ఇచ్చిన విరాట్
క్రిస్మస్ పండగంటే చాలా మంది పిల్లలు... సాంటా తాత వచ్చి బహుమతులెన్నో పంచి పెడతాడని ఆశగా ఎదురుచూస్తూ ఉంటారు. తల్లిదండ్రులు లేని చిన్నారుల సంగతైతే చెప్పాల్సిన అవసరమే లేదు. అలాంటి వారి కోసం సాంటా తాతలా మారిపోయాడు లెజెండరీ క్రికెటర్, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి. ఆటతో ఎప్పుడూ పుల్ బిజీగా ఉండే విరాట్ క్రిస్మస్ పండుగను ముందుగానే కొంతమంది పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్నాడు. సాంటా తాతలా వేషం వేసుకుని పిల్లలకు సర్ఫ్రైజ్ ఇచ్చాడు. క్రిస్మస్ సందర్భంగా వారికి బహుమతులు పంచిపెట్టాడు. వారితో కాసేపు సరదాగా గడిపిన విరాట్.. పిల్లలతో ముచ్చటించి సంతోషాన్ని పంచుకున్నాడు. సాంటా తాతల వేషం వేసుకున్న కోహ్లి వీడియో సోషల్ మీడియాలో వైర్‌ల్‌గా మారింది. ఈ సందర్భంగా అతన్ని పలువురు అభినందిస్తున్నారు. -
క్రిస్మస్ కానుకలు సిద్ధం
సాక్షి, కరీంనగర్: రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ కానుకలను సిద్ధం చేసింది. ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో వెయ్యి కుటుంబాలకు గిఫ్ట్ ప్యాకెట్లను అందజేయాలని, క్రిస్మస్ రోజు వారికి విందు ఏర్పాటు చేయాలని అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా.. ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను అధికారులు సిద్ధం చేశారు. ఒక్కో మనిషికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులను ఎంపిక చేసే బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. ఈ మేరకు క్రిస్మస్ పండుగ కిట్లతోపాటు విందు భోజనం ఏర్పాట్లపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఇటీవల కలెక్టరేట్లో క్రైస్తవ మతపెద్దలతో సమీక్ష నిర్వహించి పండుగ ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత నుంచి బతుకమ్మ పండుగకు చీరలు, రంజాన్‌కు దుస్తుల పంపిణీ చేసి ఇఫ్తార్ విందులు, క్రైస్తవులకు కానుకలను అందజేస్తోంది. ప్రభుత్వం 2014 నుంచి ఈ ఆనవాయితీని కొనసాగిస్తుండగా.. ఈసారి కూడా క్రిస్మస్కు వాటిని అందించేందుకు ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే కొత్త దుస్తులు అందించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక చీర, జాకెట్, ప్యాంట్, చొక్కా, చుడీదార్ డ్రెస్మెటీరియల్స్తో కూడిన గిఫ్ట్ ప్యాక్‌లను అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నియోజకవర్గానికి వెయ్యి కిట్లు.. జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్, చొప్పదండి, మానకొండూర్ నియోజకవర్గాలు ఉండగా ఒక్కో నియోజకవర్గానికి వెయ్యి చొప్పున నాలుగు వేల గిఫ్ట్ ప్యాక్‌లను సిద్ధం చేసి పంపించారు. గిఫ్ట్ ప్యాక్‌లు పొందే లబ్ధిదారులకు క్రిస్మస్ రోజున నియోజకవర్గాల్లో విందు భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కొక్కరికి రూ.200 వెచ్చించి విందు భోజనం ఏర్పాటు చేయాలని, వెయ్యి మందికి రూ.2 లక్షలు వెచ్చించాలని నిర్ణయించారు. నేటి నుంచి పంపిణీ.. చొప్పదండి నియోజకవర్గంలోని రామడుగు, కొడిమ్యాల మండల కేంద్రాల్లో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ చేతుల మీదుగా బుధవారం క్రైస్తవులకు కానుకలు అందజేయనున్నారు. ఈ నెల 21న కరీంనగర్లో మంత్రి గంగుల కమలాకర్, హుజూరాబాద్‌లో మంత్రి ఈటల రాజేందర్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ చేతుల మీదుగా క్రిస్మస్ గిఫ్ట్ ప్యాకెట్లను పంపిణీకి నిర్ణయించారు. క్రిస్మస్ రోజు ఏర్పాటు చేసే విందు భోజనాల కార్యక్రమంలో కూడా వీరు క్రైస్తవ మతపెద్దలు, ఇతర మతాలకు చెందిన పెద్దలు పాల్గొంటారు. చర్చి పాస్టర్ల ద్వారా లబ్ధిదారుల ఎంపిక... నియోజకవర్గానికి వెయ్యి మంది లబ్ధిదారుల ఎంపిక బాధ్యతను చర్చి పాస్టర్లకు అప్పగించారు. చర్చికి వచ్చే సభ్యుల్లో రేషన్‌కార్డుల ఆధారంగా నిరుపేదలను గుర్తించి వారిని లబ్ధిదారుల జాబితాలో నమోదు చేసి మైనార్టీ సంక్షేమ శాఖకు పంపించారు. కరీంనగర్‌లోనే 28 వేల మంది క్రైస్తవులు ఉండగా జిల్లా వ్యాప్తంగా వీరి సంఖ్య 50 వేల వరకు ఉంటుందని మత పెద్దలు పేర్కొంటున్నారు. వీరిలో అత్యధికులు నిరుపేదలు కాగా ప్రభుత్వం నాలుగు వేల మందికి మాత్రమే క్రిస్మస్ కానుకలు అందించి విందు భోజనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించడంపై క్రైస్తవుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. అన్ని ఏర్పాట్లు చేశాం క్రిస్టియన్ మైనార్టీలకు పంపిణీ చేసేందుకు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలకు గిఫ్ట్‌ప్యాకెట్లు సిద్ధం చేశాం. ప్రతీ నియోజకవర్గంలో వెయ్యి మంది నిరుపేద క్రైస్తవులను ఎంపిక చేశాం. పేదరికంలో ఉండి క్రిస్మస్కు కొత్తబట్టలు కొనుక్కోలేని స్థితిలో ఉన్న వారికి మాత్రమే ఈ కిట్స్ అందజేయడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం కిట్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశాం. – రాజర్షిషా, మైనార్టీ డెవలప్మెంట్ అధికారి -
కారు తుడిస్తే హగ్ ఇచ్చింది.. కానీ
-
వైరల్ : కారు తుడిస్తే హగ్ ఇచ్చింది.. కానీ
పాశ్చాత్య దేశాల్లో క్రిస్టమస్ వేడుకలు ఎంతో అట్టహాసంగా జరుగుతాయి. కొత్త బట్టలు ధరించడం, నూతన వస్తువుల కొనుగోలుతోపాటు కొంతమంది క్రిస్టమస్ హాలిడేస్ ఇంకాస్త భిన్నంగా సెలబ్రేట్ చేసుకుంటారు. సరదాగా రోడ్లను, పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. అపరిచిత వ్యక్తుల కారు అద్దాలను శుభ్రం చేసి వారిని ఆశ్చర్యంలో ముంచెత్తుతారు. అయితే, ఫన్నీ స్టోరీలతో అలరించే ఫ్లోరిడాకు చెందిన బ్లాగర్ మేరీ క్యాథరిన్ బ్యాక్స్టోర్మ్ మాత్రం ఇలాగే ఆలోచించి పప్పులో కాలేశారు. క్రిస్టమస్ పండగ సందర్భంగా షాపింగ్‌లో బిజీబిజీగా ఉన్న ఆమె పొరపాటున ఓ వ్యక్తికి హగ్ ఇచ్చారు. షాపింగ్ కాంప్లెక్స్ నుంచి బయటికొచ్చిన క్యాథరిన్ పార్క్ చేసి ఉన్న తన కారును చూసి ఒకింత ఆశ్చర్యం.. మరికొంత ఆనందంలో మునిగారు. తన కారు అద్దాలను శుభ్రం చేస్తున్న వ్యక్తిని హగ్ చేసుకున్నారు. కానీ, క్షణాల్లో ఆమె తన పొరపాటును గ్రహించారు. ఆ కారును పరిశీలించి చూడగా.. అది తనది కాదని ఆమెకు అర్థం అయింది. వెంటనే నాలుక్కరుచుకుని క్యాథరిన్ అక్కడి నుంచి జారుకున్నారు. తనకు ఎదురైన ‘చేదు’అనుభవాన్ని ఆమె ఫేస్బుక్లో పంచుకోవడంతో అది వైరల్ అయింది. ఈ వీడియో 31 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. ఇక సొంత కారును శుభ్రం చేసుకుంటున్న వ్యక్తికి హగ్ ఇవ్వడం.. నవ్వులు పూయిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో బాగా నవ్వు తెప్పించే సంఘటనల్లో ఇదొకటని అంటున్నారు. -
ఒక్కొక్కరికి రూ.14లక్షల క్రిస్మస్ బోనస్
ఇండియాలో దీపావళికి సూరత్ డైమండ్ వ్యాపారులు ఖరీదైన ఇళ్లు, కార్లు బహుమతులుగా ఇవ్వడం మనం చూశాం. తాజాగా ఈ కోవలోకి అమెరికాకు చెందిన కంపెనీ బాస్ కూడా చేరిపోయారు. క్రిస్మస్ సందర్భంగా తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఒక్కొక్కరికీ రూ.14 లక్షల రూపాయల క్రిస్మస్ బోనస్ అందిస్తున్నారట. కోట్ల రూపాయల క్రిస్మస్ బోనస్‌ను యజమాని ప్రకటించగానే కొంతమంది ఉద్యోగులు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారట. మిచిగాన్కు చెందిన ఫ్లోరాక్రాఫ్ట్ కంపెనీ అధిపతి లియో స్కోనర్ర్ (82)సంస్థలోని దాదాపు 200మంది ఉద్యోగులకు శాంతా వెలుగులు నింపేశారు. సంస్థ అభివృద్ధికి ఉద్యోగులు చేసిన కృషికి, శ్రమకు గుర్తింపుగా ఈ బోనస్ ఇస్తున్నట్టు లియో ప్రకటించారు. అంతేకాదు ఉద్యోగులే కంపెనీకి సర్వస్వం అని సగర్వంగా ప్రకటించారు. సంస్థలో పనిచేసిన పీరియడ్ అధారంగా ఈ బోనస్ విలువ పెరుగుతుంది. 40 సంవత్సరాల పాటు సంస్థలో పనిచేసిన వారికి 60వేల డాలర్లు (రూ.42లక్షలు) ఈ బహుతి అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే ఈ బోనస్ మొత్తంలో 75శాతం ఉద్యోగుల రిటైర్మెంట్ ప్లాన్‌లోజమచేసి, మిగిలిన సొమ్మును నగదు రూపంలో ఉద్యోగులకు అందించనున్నారు. 1946లో లుడింగ్టన్ ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు ప్రారంభించిన ఫ్లోరాక్రాఫ్ట్ వాల్‌మార్ట్, అమెజాన్, మైఖేల్స్, జోన్, హాబీలాబీ లాంటి రిటైలర్లకు ఫోమ్ ఉత్పత్తులను విక్రయిస్తుంది. -
క్రిస్మస్ రోజు విషాదం.. 20 మంది దుర్మరణం!
మనీలా: క్రిస్మస్ పండుగ పర్వదినాన ఉత్తర ఫిలిప్పీన్స్ లో సోమవారం ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 20 మంది చనిపోయారు. మృతుల్లో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. కొంతమంది యాత్రికులతో బయల్దేరిన మినీ బస్సు మరో బస్సును అగూ నగరంలో ఢీకొట్టింది. ఈ ఘటనలో మరో పదహేను మంది గాయపడ్డారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా వీరంతా శతాబ్దాల క్రితం నిర్మించిన మనాగ్ చర్చిని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్రిస్మస్ వేడుకలకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకోవడం పెనువిషాదం మిగిల్చింది. దక్షిణ ఫిలిప్పీన్స్‌లోని దావో నగరంలో ఉన్న ఎన్సీసీసీ షాపింగ్ మాల్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 37 మంది మరణించిన మరవకముందే మరో దుర్ఘటన జరిగింది. -
ఈ కార్లపై భారీ తగ్గింపు..భలే ఆఫర్ కూడా
సాక్షి,న్యూఢిల్లీ: జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ ఆడి భారీ ఆఫర్ ప్రకటించింది. రానున్న క్రిస్మస్ , న్యూ ఇయర్ సందర్భంగా లగ్జరీ కార్లవర్స్కోసం తీపి కబురు అందించింది. ఎంపిక చేసిన మోడళ్లపై దాదాపు మూడు నుంచి రూ.8.85 లక్షల వరకు ధరలు తగ్గించినట్లు ఆడి ప్రకటించింది. లిమిటెడ్ ఆఫర్‌గా ప్రకటించిన ఈ "ప్రత్యేక ధరల"తో పాటు సులభమైన ఈఎంఐ ఆప్షన్స్‌ను కూడా అందిస్తోంది.దీంతోపాటు మరో బంపర్ ఆఫర్కూడా ఉంది. 2017లో ఫేవరేట్ ఆడి కారును కొనుగోలు చేసిన కస్టమర్లు.. 2019లో చెల్లింపులు మొదలుపెట్టవచ్చని ఇది తమ కస్టమర్లకు అందిస్తున్న అదనపు ప్రయోజనమని కంపెనీ వెల్లడించింది. అమ్మకాల డ్రైవ్‌లో భాగంగా ఎంపిక చేసుకున్న మోడళ్లపై ఈ తగ్గింపును అందిస్తున్నట్టు ఆడి శుక్రవారం వెల్లడించింది. క్రిస్మస్, కొత్త ఏడాది సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఆడి ఏ3, ఆడి ఏ4, ఆడి ఏ6, ఆడి క్యూ3 మోడళ్లపై ఈ ప్రత్యేక ధరలు, సులభ ఈఎంఐని అందిస్తున్నట్టు ఆడి ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఆఫర్లో భాగంగా ఆడి ఏ3 ఇపుడు రూ.26.99 లక్షలకే లభ్యంకానుంది. దీని పాత ధర రూ.31.99 లక్షలు. ఇక ఆడి ఏ4 పాత ధర రూ.39.97 లక్షలు కాగా.. ప్రస్తుతం రూ.33.99 లక్షలకే అందుబాటులో ఉండనుంది. అలాగే ఆడి ఏ6 సెడాన్ ధర రూ.53.84 లక్షల నుంచి రూ.44.99 లక్షలకు, ఎస్యూవీ ఆడి క్యూ3 ధర రూ.33.4 లక్షల నుంచి రూ.29.99 లక్షలకు తగ్గింది. -
ఇంటూరులో 25 అడుగుల క్రిస్మస్ స్టార్
ఇంటూరు (అమృతలూరు): గ్రామాల్లో క్రిస్మస్ సందడి నెలకొంది. డిసెంబర్ మొదటి వారం నుంచే గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహిస్తుండటంతో చర్చిల వద్ద, క్రిస్టియన్ సోదరుల నివాసాల వద్ద భారీ స్టార్లను ఏర్పాటు చేశారు. అంబేడ్కర్ యూత్ ఆధ్వర్యంలో ఇంటూరు గ్రామంలో చెరువు వద్ద 25 అడుగుల భారీ స్టార్‌ను శుక్రవారం రాత్రి ఏర్పాటు చేశారు. విద్యుద్దీపాలను అమర్చడంతో కాంతులీనుతూ విశేషంగా ఆకట్టుకుంటోంది.