శానిటైజేషన్ వర్క్‌ర్ల(పారిశుధ్య కార్మికులు)కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఎన్నడూ లేని విధంగా ఉద్యోగుల కొరత తీవ్రంగా వేధిస్తుండడంతో ఆయా కంపెనీలు పోటీ పడి మరి భారీ ఎత్తున జీతాల్ని చెల్లిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ ఇంజినీర‍్లు, డాక్టర్లకు చెల్లించే జీతం కంటే ఎక్కువగానే ఆఫర్ చేస్తున్నాయి. ఇంతకీ శానిటైజేషన్ వర్కర్లకు చెల్లించే జీతం ఎంతో తెలుసా? అక్షరాల కోటి రూపాయిలు. ఇది వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ఆ పనికి ఉన్న డిమాండ్ దృష్ట్యా సదరు సంస్థలు వేతనాల విషయంలో ఏమాత్రం వెనకడుగు వేడయం లేదని పలు నివేదికలు చెబుతున్నాయి.
సాధారణంగా డాక్టర్లు, ఇంజినీర్ల శాలరీలు ఎక్కువగా ఉంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఆస్ట్రేలియాలో క్లీనింగ్ సర్వీస్ కంపెనీలు..క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటల వ్యవధిలో భారీ ఎత్తున ప్యాకేజీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాయి. 2021 నుంచి దేశం మొత్తం క్లీనింగ్ విభాగంలో డిమాండ్ ఎక్కువైంది. గతంలో అంటే 2021 ముందు క్లీనింగ్ చేసే ఉద్యోగులకు గంటకు రూ.2700 ఇస్తే ఇప్పుడు రూ.3600వరకు చెల్లిస్తున్నాయి. అంతేకాదు అత్యవసర సమయాల్లో గంటకు రూ.4700 చెల్లించేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని సిడ్నీకి చెందిన అబ్సిల్యూట్ డొమెస్టిక్ (Absolute Domestics) సంస్థతో పాటు పలు నివేదికలు చెబుతున్నాయి.
ఇళ్లలో ఉండే చిన్న చిన్న కాలువలు మొదులుకొని, కిటికీలు శుభ్రం చేసే ఉద్యోగులకు చాలా కంపెనీలు గంటల వ్యవధికి శాలరీలు ఇస్తుంటాయి. ఆ లెక్కన ఉద్యోగులు ప్రతి నెలా సగటున రూ. 8లక్షల జీతం పొందేవారు. ఆశ్చర్యకరంగా దేశంలో ఉద్యోగుల కొరతతో వారి సగటు జీతం ప్యాకేజీ రూ. 72లక్షల నుండి రూ.80లక్షల వరకు చేరింది. అయితే చాలా కంపెనీలు ఆ వేతానాల్ని రూ.98 లక్షల పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. కొన్ని కంపెనీలైతే ఏకంగా రూ.కోటి ఇస్తున్నాయి. కాగా, ఆస్ట్రేలియాలో శానిటైజేషన్ సిబ్బంది పరిస్థితి ఇలా ఉంటే..బ్రిటన్‌కు చెందిన క్లీనింగ్ ఉద్యోగుల శాలరీలు కూడా అదేస్థాయిలో ఉన్నాయి. అక్కడ క్యాబేజీని పండించిన ఉద్యోగులకు సంవత్సరానికి రూ.65లక్షల జీతం ఇస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment