lady boss
-
లేడీ బాస్ సర్ప్రైజ్ బోనస్ బొనాంజా..ఒక్కొక్కరికీ రూ. 82 లక్షలు!
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద కంపెనీల్లో లక్షలాది మంది ఉద్యోగులు ఉద్వాసనకు గురవుతున్న వేళ ఒక లేడీ బాస్ తన ఉద్యోగులకు భారీ బోనస్ ఇచ్చి సంస్థ ఉద్యోగులనే కాదు, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తారు. క్రిస్మస్ సందర్భంగా 10 మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సుమారు 80-82 లక్షల రూపాయల 'క్రిస్మస్ బోనస్' ప్రకటించడం హాట్‌టాపిక్‌గా నిలిచింది. ఆ మహిళా బాస్ పేరు గినా రైన్‌హార్ట్. 34 బిలియన్ల డాలర్ల నికర సంపదతో ఆస్ట్రేలియాలో టాప్ బిలియనీర్. ఆస్ట్రేలియాలోపనిచేస్తున్న ప్రధాన కంపెనీలలో ఒకటి రాయ్ హిల్. ఆమె తండ్రి స్థాపించిన మైనింగ్, అగ్రికల్చరల్ కంపెనీ హాన్కాక్ ప్రాస్పెక్టింగ్‌కు చెందిన రాయ్‌హిల్ కి జార్జినా (గినా) రైన్‌హార్ట్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, డైరెక్టర్‌గా ఉన్నారు. తన వ్యాపార దక్షతతో మైనింగ్ మొఘల్‌గా పేరుగాంచి, ఆస్ట్రేలియాలో అత్యంత సంపన్నుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. గత కొన్నేళ్లుగా ఈ కంపెనీ మంచి లాభాలతో నడుస్తుండటం గమనార్హం. (మీరు ఎస్బీఐ ఖాతాదారులా? అయితే మీకో గుడ్ న్యూస్) అయితే రైన్‌హార్ట్ తన ఉద్యోగులకు ముఖ్యమైన ప్రకటన కోసం సిద్ధంగా ఉండమని ప్రటకించారు.ఈ సందర్బంగా నిర్వహించిన సమావేశంలో 10 మంది పేర్లను పిలవ బోతున్నట్లు ప్రకటించారు. అసలే దిగ్గజ సంస్థలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్న తరుణంలో ముఖ్యమైన ప్రకటన అనగానే అందరూ బెంబేలెత్తిపోయారు. సడెన్‌గా ఆ పదిమందికి లక్ష డాలర్లు బోనస్ ప్రకటించారు. అంతేకాకుండా ఇతర ఉద్యోగులకు కూడా లక్షల్లో బోనస్ ప్రకటించారు. దీంతో ఉద్యోగులంతా సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోయారు. బోనస్ పొందిన వారిలో ఒకరు మూడు నెలల క్రితమే కంపెనీలో చేరడం విశేషం. కాగా కంపెనీ గత 12 నెలల్లో 3.3 బిలియన్ల డాలర్లు (రూ. 190 బిలియన్లకు పైగా) లాభాన్ని ఆర్జించి నందుకు ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపారు గినా. కంపెనీ లాభాలు దేశానికి కూడా ఉపయోగ పడ్డాయని, అందుకే ఈ కానుక అని ప్రకటించారు. దీంతో తీవ్ర ఉద్వేగానికి గురి కావడం ఉద్యోగుల వంతైంది. -
లేడీ బాస్ ఉదారత.. ఒక్కో ఉద్యోగికి రూ.7.5లక్షలు గిఫ్ట్
సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్‌లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్‌లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్‌లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు. ఇప్పుడు ఈ బాస్‌ల టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా బాస్ మీద ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్‌ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్. ఆ వివరాలు... (చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే) స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్‌బైబిల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది సారా. ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది. (చదవండి: అద్భుతం చేసిన ఫేస్బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత) "ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని తమదైన రీతిలో జరుపుకోవాలని, జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు. చదవండి: ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు -
లేడీ బాస్‌లే నయం!
సాక్షి, అమరావతి: కార్పొరేట్ కంపెనీల్లో పురుషులతో పోలిస్తే మహిళా ఉద్యోగులే మెరుగ్గా పని చేస్తున్నారు. నైపుణ్యంలోనూ వారే ముందంజలో నిలుస్తున్నారు. పుణె కేంద్రంగా పని చేస్తున్న టెక్నాలజీ సంస్థ ఎస్‌సీఐకేఈవై నిర్వహించిన సర్వే ఈ విషయాన్ని తేటతెల్లం చేసింది. ఆ సంస్థ దేశంలోని పలు సాఫ్ట్వేర్, వివిధ కార్పొరేట్ కంపెనీల్లో పనిచేస్తున్న 5,388 మంది మహిళా, పురుష ఉద్యోగుల పనితీరుపై ఇటీవల అధ్యయనం చేసింది. సహచరులతో కలిసిపోవడం, సమస్యలు వచ్చినప్పుడు పరిష్కరించుకోవడం, మేనేజ్మెంట్ టెక్నిక్స్, ఒత్తిడిని ఎదుర్కోవడం వంటి 6 అంశాల ఆధారంగా ఈ అధ్యయనం జరపగా.. ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. లేడీ బాస్‌లే మేలు కంపెనీల్లో సహచరులను కలుపుకుని పని చేయడంలో మహిళా ఉద్యోగులు సమర్థవంతంగా ఉంటున్నారు. తమతో కలిసి పనిచేసే వారితో ఎటువంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించుకుని అమలు చేస్తున్నారు. మగ బాస్‌ల కంటే మహిళా బాస్‌లే తమ ఉద్యోగుల పనితీరును నిరంతరం పర్యవేక్షించడంతోపాటు వారిని మేలైన రీతిలో ప్రోత్సహిస్తున్నారు.(చదవండి: కరోనా ఎఫెక్ట్‌తో స్వయం ఉపాధిలోకి.. ) సంప్రదింపులు.. బేరసారాల్లోనూ మేటి ఇతర కంపెనీలు, వ్యక్తులతో సంప్రదింపులు జరపడం, బేరసారాలు కొనసాగించడంలో మహిళలు మగవారితో సమానంగా.. చాలాసార్లు వారి కంటే మెరుగ్గా మహిళా ఉద్యోగులు వ్యవహరిస్తున్నట్టు తేలింది. ఇలాంటి సమయాల్లో కచ్చితమైన డేటా, సంబంధిత అంశాలపై పూర్తి అవగాహనతో ఉంటున్నారు. మేనేజ్మెంట్ నైపుణ్యంలోనూ మహిళల సమర్థత పురుష ఉద్యోగుల కంటే బాగా ఉంటోంది. ఏదైనా పని అప్పగించినప్పుడు ప్రభావవంతంగా పూర్తిచేయడంలో ఉద్యోగినులే ముందుంటున్నారు. ఉద్యోగుల మధ్య అభిప్రాయ భేదాలు, సమస్యలు వచ్చినప్పుడు వాటిని అర్థం చేసుకుని పరిష్కరించడంలోనూ మహిళా ఉద్యోగులు చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. ఉద్వేగాలను నియంత్రించుకుంటున్నా.. తప్పని ఒత్తిడి భావోద్వేగాలను నియంత్రించుకోవడంలోనూ ఉద్యోగినులే మెరుగ్గా ఉన్నట్టు తేలింది. 16.8 శాతం మహిళా ఉద్యోగులు భావోద్వేగాలకు గురైన సమయంలోనూ స్థిరంగా పనిచేస్తుండగా.. 14.7 శాతం మంది పురుషులు మాత్రమే అలాంటి సమయాల్లో స్థిరంగా ఉండి పనిచేస్తున్నారు. కానీ.. ఒత్తిడిని ఎదుర్కొనే విషయంలో మాత్రం ఉద్యోగినులు బాగా ఇబ్బంది పడుతున్నట్టు గుర్తించారు. రెండేళ్ల అనుభవం ఉన్న ఉద్యోగుల్ని పరిశీలించగా.. ప్రతి 10 మంది ఉద్యోగినుల్లో ఆరుగురు భావోద్వేగాల వేళ ఒత్తిడికి గురవుతున్నారు. పురుషుల విషయానికి వస్తే ప్రతి 10 మందిలో నలుగురు మాత్రమే ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగ అనుభవం ఎక్కువ ఉన్న వారిని పరిశీలించినప్పుడు ప్రతి 10 మంది ఉద్యోగినుల్లో 8 మంది ఒత్తిడికి గురవుతున్నారు. ఫురుషులైతే ప్రతి 10 మందిలో ముగ్గురు మాత్రమే ఒత్తిడికి లోనవుతున్నారు. -
లేడీ బాస్‌పై హత్యాయత్నం.. నిందితుడి అరెస్టు
తన మాజీ లేడీ బాస్‌ను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ పన్వర్ అలియాస్ కల్లూ (27) అనే వ్యక్తి ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ అయిన కావేరి లాల్ (27) వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె బోయ్‌ఫ్రెండుతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తీసేసిన తర్వాత కూడా అతడు నెల రోజుల జీతం ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. ఈనెల 14వ తేదీన కారు సరిగా పార్కింగ్ చేయాలన్న పేరుతో కావేరిలాల్ను పన్వర్ ఆమె ఇంటినుంచి బయటకు పిలిచి, తన బాకీ ఏమైందని అడిగాడు. ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మాక్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతడు ఎక్కడ ఉంటాడోనన్న అనుమానంతో పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు అతడి ఏటీఎం లావాదేవీలపై కూడా కన్నేసి ఉంచారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక నైట్ షెల్టర్‌లో ఉన్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. పన్వర్‌కు పెళ్లయ్యి, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. -
లేడి బాస్‌ను వారు కష్టంగా అంగీకరిస్తారు!
మహిళలు అధికారంలో రావడాన్ని మగవారు చాలా కష్టంగా అంగీకరిస్తారని అమెరికా డిప్లొమెంట్స్ అభిప్రాయం వ్యక్తంచేశారు. మగవారు, ముఖ్యంగా జూనియర్లు లేడి బాస్‌ను ఎక్కువ అసౌకర్యంగా భావిస్తారని తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా అమెరికన్ మహిళా డిప్లొమెంట్స్ తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మహిళా సాధికారితలో భద్రతా, రక్షణకు పెద్ద పీట వేయాలని వారు పేర్కొన్నారు. ఎక్కువమంది మహిళలు శుభ్రపరిచిన నీరు అందించడం కూడా అత్యంత ముఖ్యమని విషయంగా భావిస్తారని చెప్పారు. 100 శాతం మహిళలకు సురక్షిత ప్రాంతంగా ప్రపంచంలో ఏ స్థలం లేదని డిప్లొమెంట్స్ తెలిపారు. -
బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్
ఇదేమిటీ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లా పోజిచ్చిందనేగా మీ సందేహం. బాడీగార్డ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ కండలతో కనిపిస్తాడు. తన లేడీ బాస్‌కు అంగరక్షకుడిగా పనిచేస్తాడు. సరిగ్గా ఈ మేల్ కంగారూ పనికూడా అదే. మీరు కూడా ఔత్సాహిక బాడీ బిల్డర్ అయితే ఇది తన కాళ్లతో లోహపు బకెట్లను తొక్కేటపుడు గమనించండి. ఆ సమయంలో వచ్చే శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసా. తుపాకీలోనుంచి తూటాలు వెళుతున్నట్టు ఉంటుంది. ఇక విషయానికొద్దాం. ఆస్ట్రేలియాలోని కంగారూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికెళితే అక్కడ కూడా మీకొక బాడీగార్డు కనిపిస్తుంది. దాని పేరు రోజర్. ఇంతకీ ఇది బాడీగార్డు ఎలా అయిందంటే....ఆలిస్స్ప్రింగ్స్ ప్రాంతంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోగల ఆడ కంగారూలను కాపాడుకునే బాధ్యతను నెత్తికెత్తుకోవడం ద్వారా. ఇందుకోసం కిక్‌బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఇది ఒక్క కిక్ ఇచ్చిందంటే ప్రత్యర్థి గింగిరాలు తిరిగి కిందపడిపోవాల్సిందే. ఇందుకోసం ఇది ఖాళీ సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాకీ ్టస్ చేస్తూ ఉంటుంది. తొమ్మిదేళ్ల రోజర్ పొట్టిగా ఉన్నా శారీరకంగా ఎంతో బలిష్టమైనది. దాని పోజు చూస్తే మీకే అవలీలగా అవగతమవుతుంది మరి. ఇందుకోసం దానికో శిక్షకుడు కూడా ఉన్నాడు మరి. -
మహిళా బాస్ లైంగిక వేధింపులు!
యాహూ సంస్థలో ఉన్నతస్థాయిలో ఉన్న ఓ మహిళా ఎగ్జిక్యూటివ్ తనను లైంగిక వేధింపులకు గురిచేస్తోందంటూ ఓ మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫిర్యాదుచేయడం సంచలనం సృష్టించింది. కాలిఫోర్నియాలో యాహూ మొబైల్ విభాగంలో సీనియర్ డైరెక్టర్‌గా పనిచేసే మారియా ఝాంగ్ తనను విపరీతంగా వేధించిందని నాన్ షి అనే ప్రిన్సిపల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాలిఫోర్నియాలోని శాన్ జోస్‌లో గల శాంటా క్లారా సుపీరియర్ కోర్టులో ఫిర్యాదు చేశారు. సన్నీవేల్, కాలిఫోర్నియాలలో పలు సందర్భాలలో ఆమె తనను ఓరల్, డిజిటల్ సెక్స్ కోసం వేధించిందని నాన్ షి ఆరోపించారు. తనతో శృంగారంలో పాల్గొంటే మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారన్నారు. ఈ వేధింపులకు గాను తనకు భారీ ఎత్తున నష్టపరిహారం చెల్లించాలని ఆమె కోర్టును కోరారు. అయితే, మారియా ఝాంగ్ మీద చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం గానీ, వాటికి ఆధరాం గానీ ఏమీ లేదని, మారియా తమ కంపెనీలో చాలా మంచి ఎగ్జిక్యూటివ్ అని, ఈ కేసును తాము ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నామని యాహూ ప్రతినిధి ఒకరు తెలిపారు. ఎలైక్ అనే సొంత మొబైల్ కంపెనీని ఝాంగ్ స్థాపించగా, దాన్ని యాహూ 2013లో టేకోవర్ చేసింది. అంతకుముందు ఆమె మైక్రోసాఫ్ట్, జిల్లో కంపెనీలలో కూడా పనిచేశారు. అయితే కంపెనీ హెచ్ఆర్ సిబ్బంది తాను చేసిన ఫిర్యాదు మీద ఏమాత్రం స్పందించలేదని, తన ఉన్నతాధికారి అఘాయిత్యాలను పట్టించుకోలేదని నాన్ షి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. పైగా, తనను బలవంతంగా వేతనం లేని సెలవుపై పంపారని, తర్వాత ఉద్యోగం నుంచి కూడా తొలగించారని ఆరోపించారు.