తన మాజీ లేడీ బాస్‌ను గొంతు కోసి చంపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. అనిల్ పన్వర్ అలియాస్ కల్లూ (27) అనే వ్యక్తి ఇంతకుముందు ఫ్యాషన్ డిజైనర్ అయిన కావేరి లాల్ (27) వద్ద డ్రైవర్‌గా పనిచేసేవాడు. గత సంవత్సరం డిసెంబర్ నెలలో ఆమె బోయ్‌ఫ్రెండుతో అసభ్యంగా ప్రవర్తించినందుకు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. తీసేసిన తర్వాత కూడా అతడు నెల రోజుల జీతం ఇవ్వాలని ఆమెను డిమాండ్ చేశాడు. ఈనెల 14వ తేదీన కారు సరిగా పార్కింగ్ చేయాలన్న పేరుతో కావేరిలాల్‌ను పన్వర్ ఆమె ఇంటినుంచి బయటకు పిలిచి, తన బాకీ ఏమైందని అడిగాడు.
ఆమె ఇవ్వడానికి నిరాకరించడంతో కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మాక్స్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడు కత్తిని అక్కడే వదిలేసి పారిపోయాడు. అతడు ఎక్కడ ఉంటాడోనన్న అనుమానంతో పోలీసులు పలు ప్రాంతాల్లో గాలించారు. చివరకు అతడి ఏటీఎం లావాదేవీలపై కూడా కన్నేసి ఉంచారు. నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక నైట్ షెల్టర్‌లో ఉన్నట్లు విశ్వసనీయంగా సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అతడిని అరెస్టు చేశారు. పన్వర్‌కు పెళ్లయ్యి, ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు.
లేడీ బాస్‌పై హత్యాయత్నం.. నిందితుడి అరెస్టు
Published Sat, May 20 2017 8:03 PM | Last Updated on Tue, Sep 5 2017 11:36 AM
Advertisement
Advertisement