సాధారణంగా సమాజంలో మూడు రకాల బాస్‌లుంటారు. ఒకరు మంచివారు. ప్రతిభావంతులను గుర్తించి తగిన విధంగా ప్రోత్సాహిస్తారు. మరికొందరు బాస్‌లు ఉంటారు.. వీరికి ఉద్యోగి ఎంత బాగా పని చేసినా సంతృప్తి ఉండదు. ఏదో విధంగా వారిని ఇబ్బందిపెడుతూనే ఉంటారు. ఇక మూడో రకం బాస్‌లు.. వీరు నూటికో కోటికో ఒక్కరు. ఈ కోవకు చెందిన బాస్‌లు ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యుల్లానే చూస్తారు. కష్టనష్టాల్లో వారికి తోడుగా ఉంటారు. కంపెనీ లాభాల్లో ఉద్యోగులకు సమాన వాటా కల్పిస్తారు.
ఇప్పుడు ఈ బాస్‌ల టాపిక్ ఎందుకంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ మహిళా బాస్ మీద ప్రశంలసు కురిపిస్తున్నారు నెటిజనులు. అమ్మతనాన్ని చూపించావ్ అంటూ పొగుడుతున్నారు. ఈ బాస్‌ను ఇంతలా ప్రశంసించడానికి కారణం ఏంటంటే.. కంపెనీ లాభాలను ఉద్యోగులందరికి సమానంగా పంచింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి 7.5లక్షల రూపాయల చొప్పున ఇచ్చి.. తన మంచి మనసు చాటుకుంది సదరు మహిళా బాస్. ఆ వివరాలు...
(చదవండి: ట్రెండింగ్‌లో నాలుగేళ్ల చిన్నారి.. ఏం చేశాడంటే)
స్పాంక్స్ కంపెనీ లేడీ బాస్ పేరు సారా బ్లేక్లీ. ఇక ల్యాడ్‌బైబిల్ ప్రకారం, పెట్టుబడి సంస్థ బ్లాక్‌స్టోన్ స్పాంక్స్ కంపెనీలో మెజారిటీ వాటాను కొనుగోలు చేసిన తర్వాత సారా బ్లేక్లీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. అయితే సారా ఆ వచ్చిన మొత్తాన్ని తానే వాడుకోలేదు. కంపెనీ ఉద్యోగులందరికి దానిలో వాటా ఇస్తూ.. తన ఉదార మనస్తత్వాన్ని చాటుకుంది. ఈ సందర్భంగా ఉద్యోగులకు పార్టీ ఇచ్చింది సారా.
ఇక పార్టీలో ఓ పెద్ద బాంబు పేల్చింది సారా. “నేను మీకు ఓ సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకుంటున్నాను. కంపెనీ లాభాల్లో మీకు వాటా ఇవ్వాలని భావించాను. దానిలో భాగాంగా మీలో ప్రతి ఒక్కరికీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు 10 వేల డాలర్లు విలువ చేసే ఫస్ట్ క్లాస్ టిక్కెట్లు ఇవ్వాలనుకుంటున్నాను. టికెట్ వద్దు అంటే డబ్బులే తీసుకోవచ్చు’’ అని తెలిపింది.
(చదవండి: అద్భుతం చేసిన ఫేస్‌బుక్.. ఏకంగా 58 ఏళ్ల తర్వాత)
"ప్రతి ఉద్యోగి ఈ క్షణాన్ని తమదైన రీతిలో జరుపుకోవాలని, జీవితాంతం మర్చిపోలేని మధుర జ్ఞాపకంగా మిగుల్చుకోవాలని నేను ఆశిస్తున్నాను. అందుకే మీకు ఈ గిఫ్ట్’’ అని ప్రకటించింది సారా. ఈ వార్త విని అక్కడ ఉన్న ఉద్యోగులు సంతోషంతో ఎగిరి గంతేశారు. కొందరు ఆనందం ఎక్కువయ్యి ఏడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. సారాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు నెటిజనులు.
చదవండి: ట్రెండింగ్‌లో బిగ్‌బాస్ కంటెస్టెంట్, మార్మోగుతున్న శ్రీరామ్ పేరు
Comments
Please login to add a commentAdd a comment