బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్ | Don't mess with Roger, the muscle-bound kangaroo who can crush metal with his bare hands | Sakshi
Sakshi News home page

బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్

Published Wed, Jun 10 2015 3:45 AM | Last Updated on Sun, Sep 3 2017 3:28 AM

బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్

బాస్... ఇక్కడ నేనే బాడీ గార్డ్

ఇదేమిటీ కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌లా పోజిచ్చిందనేగా మీ సందేహం. బాడీగార్డ్ సినిమాలో సల్మాన్‌ఖాన్ కండలతో కనిపిస్తాడు. తన లేడీ బాస్‌కు అంగరక్షకుడిగా పనిచేస్తాడు. సరిగ్గా ఈ మేల్ కంగారూ పనికూడా అదే. మీరు కూడా ఔత్సాహిక బాడీ బిల్డర్ అయితే ఇది తన కాళ్లతో లోహపు బకెట్లను తొక్కేటపుడు గమనించండి. ఆ సమయంలో వచ్చే శబ్దాలు ఎలా ఉంటాయో తెలుసా. తుపాకీలోనుంచి తూటాలు వెళుతున్నట్టు ఉంటుంది. ఇక విషయానికొద్దాం. ఆస్ట్రేలియాలోని కంగారూ వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికెళితే అక్కడ కూడా మీకొక బాడీగార్డు కనిపిస్తుంది.

దాని పేరు రోజర్. ఇంతకీ ఇది బాడీగార్డు ఎలా అయిందంటే....ఆలిస్‌స్ప్రింగ్స్ ప్రాంతంలోని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలోగల ఆడ కంగారూలను కాపాడుకునే బాధ్యతను నెత్తికెత్తుకోవడం ద్వారా. ఇందుకోసం కిక్‌బాక్సింగ్ కూడా నేర్చుకుంది. ఇది ఒక్క కిక్ ఇచ్చిందంటే ప్రత్యర్థి గింగిరాలు తిరిగి కిందపడిపోవాల్సిందే. ఇందుకోసం ఇది ఖాళీ సమయంలో కిక్ బాక్సింగ్ ప్రాకీ ్టస్ చేస్తూ ఉంటుంది. తొమ్మిదేళ్ల రోజర్ పొట్టిగా ఉన్నా శారీరకంగా ఎంతో బలిష్టమైనది. దాని పోజు చూస్తే మీకే అవలీలగా అవగతమవుతుంది మరి. ఇందుకోసం దానికో శిక్షకుడు కూడా ఉన్నాడు మరి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement