కంగారు తన పిల్లలను ఎలా సంరక్షిస్తుందో మనకు తెలుసు. అది తన శరీరంతో అతక్కునేలా బిడ్డను ఉంచుకుంటుంది. ఎక్కడకు వెళ్లినా వెన్నంటే బిడ్డను ఉంచుకుంటూ..అనుక్షణం రక్షించుకుంటుంది. ఇక్కడ తల్లులు నవజాత శిశువులను అలాగే సంరక్షించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. ఇది తల్లి బిడ్డల అనుబంధానికి ఎంతగానో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అదీగాక సోషల్ మీడియాలో ఇది ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. తల్లి బిడ్డల అనుబంధానికి కంగారు మదర్ కేర్ ఏ విధంగా ఉపయోగపడుతుందో సవివరంగా చూద్దాం..!.
అప్పుడే పుట్టిన శిశువు తల్లి పొత్తిళ్లలోని వెచ్చదనానికి హాయిగా నిద్రపోతుంది. అదీగాక ఈ ఉష్ణోగ్రత బిడ్డను పలు వ్యాధుల బారినపడకుండా ఉండేలా చేస్తుందని చెబుతున్నారు నిపుణులు. ఇక్కడ కంగారు తన పిల్లలను తన పొట్ట మాదిరి సంచిలో చక్కగా ఉంచుకుని సంరక్షించుకుంటుంది. ఈ కేరింగ్ తక్కువ బరువుతో పుట్టే శిశువులకు ఆక్సిజన్ స్థాయిలను మెరుగుపరుస్తుంది. ఆహారం తీసుకునేలా చేస్తుంది. శిశువు పెరుగుదలకి, అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీలో ఈ కంగారు మదర్ కేరింగ్ విధానం పుట్టిన మొదటి ఆరు గంటల్లోనే కార్డియోస్పిరేటరీ సిస్టమ్‌లను స్థిరీకరిస్తుందని పరిశోధనలో తేలింది. అంతేగాదు ప్రపంచ ఆరోగ్య సంస్థ పుట్టిన వెంటనే కంగారు మదర్ కేర్(కేఎంసీ) ప్రారంభించడం వలన మరణాల రేటును తగ్గించవచ్చని పేర్కొంది. ఈ విధానాన్ని తొలిసారిగా అమెరికాలో బొగోటా వైద్యులు ప్రారంభించారు.
ఇంక్యుబేటర్ కొరత, ఇన్ఫెక్షన్‌ల సమస్యకు పరిష్కారంగా ఈ విధానాన్ని తీసుకొచ్చారు వైద్యులు. ఈ కేరింగ్‌ల వల్ల కలిగే సత్ఫలితాలను చూసి అమ్మలు కచ్చితంగా ఈ విధానాన్ని పాటించేలా చేస్తున్నారు వైద్యలు. అంతేగాదు కొన్ని దేశాల్లో ఈ విధానాన్ని రోజువారీగా ఒక గంట పాటు చేయగా, మిగతా దేశాల్లో మాత్రం నిరంత సంరక్షణ చర్యగా ఈ విధానాన్ని అములు చేస్తారట.
(చదవండి: టీచర్ కాస్త రేసర్‌గా..ఏకంగా నేషనల్ కారు రేసింగ్ ఛాంపియన్‌షిప్..!)
Comments
Please login to add a commentAdd a comment