వాతవరణ మార్పులు, కాలుష్యం కారణంగా ఇప్పటికే పలు జంతు జాతులు అంతరించిపోతున్నాయి. పర్యావరణ ప్రేమికులు వాటిన సంరక్షించేందుకు పలు విధాలు ప్రయత్నిస్తున్నారు. ఆ నేపథ్యంలో తాజాగా శాస్త్రవేత్తలు ఆ అంతరించిపోతున్న జాతుల పరీరక్షణకు మార్గం సుగమం చేసేలా తొలిసారిగా మానవ ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఉపయోగించారు. దీని సాయంతో అంతరించిపోతున్న జాతుల పిండాలను విజయంతంగా సృష్టించి సరికొత్త పరిష్కారానికి నాంది పలికారు. ఇంతకీ ఈ ఐవీఎఫ్‌ని ఉపయోగించి ఏ జంతు పిండాలను సృష్టించారంటే..
ఆస్ట్రేలియన్ శాస్త్రవేత్తలు(Australian Scientists) తొలిసారిగా ఐవీఎఫ్‌ని ఉపయోగించి అంతరించిపోతున్న మార్సుపియల్ జాతి కంగారు పిండాలను(kangaroo embryos) విజయవంతగా సృష్టించారు. ఇలా మానవ ఐవీఎఫ్ సాయంతో జంతు పిండాలను ఉత్పత్తి చేయడం ఇదే తొలిసారి. ఆస్ట్రేలియాలో ఉండే ఈ మార్సుపియల్(marsupial species) అంతరించిపోతున్న జాతుల జాబితాలో ఉన్నాయి. ఈ జాతికి సంబంధించిన కోలాస్, టాస్మానియన్ డెవిల్స్, నార్తర్న్ హెయిరీ-నోస్డ్ వొంబాట్స్, లీడ్‌బీటర్స్ పోసమ్స్ వంటి కంగారు జాతులు అంతరించిపోతున్న దశలో ఉన్నట్లు చెబుతున్నారు పరిశోధకులు.
ఆ జంతువులను పరిరక్షించడమే లక్ష్యంగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టినట్లు క్వీన్స్‌ల్యాండ్ విశ్వవిద్యాలయ(Queensland University) పరిశోధకుడు డాక్టర్ ఆండ్రీస్ గాంబిని( Andres Gambini,) తెలిపారు. తమ పరిశోధనా బృందం మానవ IVFలో సాధారణంగా ఉపయోగించే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) ద్వారా 20 కి పైగా కంగారూ పిండాలను విజయవంతంగా ఉత్పత్తి చేసినట్లు తెలిపారు. ఈ పరిశోధన కోసం తమ బృందం ఇటీవలే మరణించిన కంగారూల నుంచి స్పెర్మ్, గుడ్డు కణాలను సేకరించినట్లు వివరించారు.
ఈ ఐవీఎప్‌కి బూడిద రంగు కంగారులే అనువైనవని గాంబిని చెబుతున్నారు. ఎందుకంటే వాటి జనాభా కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా ఉనికిలో ఉండటం కారణంగా వాటి జన్యు పదార్థం సమృద్ధిగా అందుబాటులో ఉంటుంది. అలాగే ఈ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ICSI) జాతుల పరిరక్షణకు, సంతానోత్పత్తి ప్రయత్నాలలో గణనీయమైన ప్రయోజనాన్ని అందించిందని చెప్పారు. దీనికోసం లక్షలాది స్పెర్మ్ సజీవంగా ఉండాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ పరిశోధన విజయవంతం కావడంతో పరిశోధకులు జన్యువైవిధ్యాన్ని ప్రవేశ పెట్టేలా మరణించిన జంతువుల నుంచి జన్యు పదార్థాన్ని సంరక్షించడానికి ఐవీఎఫ్‌ని ఉపయోగించాలని పరిశోధన బృందం చూస్తోంది.
అలాగే ఈ సృష్టించిన జంతువులు పర్యావరణానికి అనుకూలంగా మనుగడ సాగించాలే చూడటానికి ఈ జన్యువైవిధ్యం తప్పనిసరని అంటున్నారు. అదీగాక ప్రస్తుతం ఆస్ట్రేలియాలో క్షీరదాల క్షీణత రేటు భయానకంగా ఉంది. ఇప్పటికే 38 జాతులు కనుమరుగైనట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ పరిశోధన సరికొత్త ఆశను అందిస్తోంది.
(చదవండి:
Comments
Please login to add a commentAdd a comment