
సోషల్ మీడియాలో స్నేహానికి సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయ. అయితే జంతువుల స్నేహానికి సంబంధించిన వీడియోలైతే ఇక చెప్పనక్కరలేదు. రెండు విభిన్న స్వభావాలు కలిగిన జంతువుల మధ్య స్నేహం కుదిరితే అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది.
సరిగ్గా అటువంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఒక కంగారు, కుక్క మధ్య స్నేహం కుదరడాన్ని మనం గమనించవచ్చు. ఈ రెండూ బెస్ట్‌ఫ్రెండ్స్ మాదిరిగా ఎంతో కలివిడిగా ఉండటాన్ని చూడవచ్చు. ఈ వీడియో చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది. అట్ అమెజింగ్ నేచర్ పేరిట ట్విట్టర్‌లో షేర్ అయిన ఈ వీడియోను ఇప్పటివరకూ 1.3 మిలియన్ల మంది వీక్షించారు.
ఇది కూడా చదవండి: మళ్లీ ‘లోకల్’ ఫైట్: మెడపట్టి రైలులో నుంచి..
This kangaroo and dog seem to be best friends pic.twitter.com/3oUDgLF0Gu
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) October 11, 2023
