శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు... వైరల్‌ వీడియో | Independence Day Jammu Kashmir Srinagar Video | Sakshi
Sakshi News home page

శ్రీనగర్‌లో దేశభక్తి పరవళ్లు... వైరల్‌ వీడియో

Aug 15 2024 8:29 AM | Updated on Aug 15 2024 12:33 PM

Independence Day Jammu Kashmir Srinagar Video

భారతదేశం నేడు 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది.  ఈ తరుణంలో జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన ఒక వీడియో దేశభక్తిని పరవళ్లు తొక్కిస్తోంది. దీనిని చూసిన భారతీయుల్లో ఉత్సాహం రెట్టింపవుతోంది.

ఈ వీడియోలో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌ దగ్గర ఓ యువకుడు జెండాను గాలిలో ఊపుతూ కనిపిస్తున్నాడు. ఆ యువకుడు ఖాకీ ప్యాంటు ధరించి, శరీరం పైభాగంలో త్రివర్ణాలను పెయింట్‌ చేయించుకున్నాడు. ఆ యువకుడి కడుపుపై ​​అశోకచక్రం, ఛాతీపై భారత్ అని రాసి ఉంది. అతను భారత్ మాతాకీ జై, వందేమాతరం అంటూ నినాదాలు చేయడాన్ని వీడియోలో చూడవచ్చు.

2019లో ఆర్టికల్‌ 370ని రద్దు చేశాక కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ముగిసింది. ఈ ఆర్టికల్‌ను తొలగించిన ఐదేళ్ల తర్వాత, కశ్మీర్‌లో శాంతి నెలకొంది. ఇక్కడి ప్రజలు ప్రధాన స్రవంతిలో చేరారు. భారతదేశ 78వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జమ్ముకశ్మీర్ అత్యంత వేడుకగా చేసుకుంటోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement