సాక్షి, న్యూఢిల్లీ : బ్రిస్బేన్‌లోని గబ్బాలో టీమిండియా చారిత్రక విజయంపై అటు విశ్వవ్యాప్తంగా టీమిండియా క్రికెటర్లపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఇటు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా భారీ నజరానా ప్రకటించింది. గబ్బాలో ఆస్ట్రేలియా 32 సంవత్సరాల అజేయ చరిత్రకు చెక్ పెట్టిన టీమిండియా సంచలన విజయానికి భారీ గిఫ్ట్ ప్రకటించింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని చేజిక్కించుకున్న టీమిండియా ఆటగాళ్లకు రూ.5 కోట్ల టీమ్ బోనస్‌ను ప్రకటించింది బీసీసీఐ. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జే షా ట్వీట్ చేశారు. (టీమిండియా గెలుపు : దిగ్గజాల స్పందన)
గబ్బాలో జరిగిన సిరీస్ ఆఖరి టెస్టులో అజింక్యా రహానె నేతృత్వంలోని భారత్ టీం 3 వికెట్ల తేడాతో నెగ్గిన టీమిండియా.. ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-1తేడాతో కైవసం చేసుకున్నసంగతి తెలిసిందే. భారత క్రికెట్ చరిత్రలో ఇదో అద్భుత విజయం అని, ఆస్ట్రేలియాకు గడ్డపై టెస్ట్ సిరీస్ గెలవడం అపూర్వమని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ పేర్కొన్నారు. ఈ విజయాన్ని ఎన్నటికీ మరిచిపోలేమంటూ జట్టులోని ప్రతి ఆటగాడిని గంగూలీ ప్రశంసించారు. టీమిండియా ఆటగాళ్లకు బీసీసీఐ బోనస్‌గా 5 కోట్లు ప్రకటించింది. భారత క్రికెట్‌కు ఇవి ప్రత్యేకమైన క్షణాలు. భారత జట్టుఅద్భుత నైపుణ్యాన్ని, ప్రతిభను ప్రదర్శించిందంటూ కార్యదర్శి జే షా తన ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment