
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.
అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

Comments
Please login to add a commentAdd a comment