breaking news
Gas leaked
-
షిప్పింగ్ కంపెనీలో విష వాయువు లీక్
విశాఖపట్నం, సాక్షి: శ్రావణ్ షిప్పింగ్ కంపెనీలో జరిగిన ప్రమాదంలో కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. వీళ్లలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎసిటానిలైడ్ బ్యాగ్స్‌ను ఒక కంటైనర్ నుంచి మరో కంటైనర్‌కు మార్చుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఎసిటానిలైడ్ అనే విష వాయువును పీల్చటంతో కార్మికులు అస్వస్థతకు గురైనట్లు సమాచారం.అస్వస్థతకు గురైన వారిని హుటాహుటిన గాజువాక సింహగిరి ఆసుపత్రికి కంపెనీ తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం రాత్రి 2:00 గంటల సమయంలో కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో గునుపూరు రాము, లక్ష్మి, లత, కుమారి, దేముడు బాబు అస్వస్థతకు గురవ్వగా.. దేముడు బాబు పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. -
సికింద్రాబాద్ కస్తూర్బా మహిళా కాలేజీలో గ్యాస్ లీక్..
-
తక్షణమే సీడ్స్ కంపెనీ మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు
-
లీకైన రసాయన వాయువు విశాఖ ఉక్కిరి బిక్కిరి
-
గ్యాస్ లీకై మంటలు
నవాబుపేట : గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. త్రుటిలో పెను ప్రమాదం తప్పిన ఈ సంఘటన మండల పరిధిలోని మమ్మదాన్‌పల్లిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన జుంజుర అనంతయ్య భార్య అలివేలు ఉదయం 7 గంటలకు వంట చేసేందుకు గ్యాస్ స్టౌ వెలిగించింది. దీంతో మంటలు చెలరేగి రెగ్యులేటర్ నుంచి నేరుగా సిలిండర్ వరకు చెలరేగాయి. దీంతో ఆమె భయాందోళనకు గురై కుటుంబసభ్యులకు విషయం కుటుంబీకులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోవడంతో ఫైర్ స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది రాజు, రాఘవేందర్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. -
పేలిన గ్యాస్ సిలిండర్..తప్పిన ప్రమాదం
మల్కాజిగిరి : వంట చేస్తుండగా గ్యాస్ లీకై సిలిండర్ పేలిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సైదులు కథనం ప్రకారం..వసంతపురికాలనీకి చెందిన రావులపల్లి అంజయ్య(64) కార్పెంటర్ పనిచేస్తున్నాడు. భార్య చనిపోవడంతో మూడేళ్లుగా ఒంటరిగా ఉంటున్నాడు. అయితే బుధవారం తల్లి మూడో వర్ధంతి ఉండటంతో అంబర్పేట్ నుంచి వచ్చిన కూతురు ఉష వంట చేయడానికి గ్యాస్ స్టౌ వెలిగించగానే రెగ్యులేటర్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ సంఘటనతో ఆమెకు చేతికి, కాలికి, తండ్రి అంజయ్య ముఖానికి గాయాలయ్యాయి. వారు వెంటనే బయటకు పరిగెత్తుకు వచ్చారు. ఆ వెంటనే ఒక్కసారిగా సిలిండర్ పేలి ఇంట్లో మంటలు చెలరేగి ఇంట్లో సామాన్లు కాలిబూడిదయ్యాయి. సంఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పివేసింది. స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో తండ్రి, కూతురు చికిత్స పొందుతున్నారు. వారం రోజుల క్రితమే సిలిండర్ తీసుకున్నామని గ్యాస్ లీకేజీని గమనించలేక పోయామని అంజయ్య తెలిపారు. -
నష్టపోయిన పంటకు పరిహారం :కృష్ణా జిల్లా కలెక్టర్
విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలోని ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ఓఎస్జీసీ అధికారులు గ్యాస్ పైప్‌లైన్‌కు మరమ్మతులకు ఆదేశించారు. రెవిన్యూ అధికారుల సమక్షంలో గ్యాస్ లీకేజీని సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాబు మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాగా ఓఎన్జీసీ రిగ్ పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం లీకేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో క్రూడాయిల్, బురద ఉవ్వెత్తున ఎగసిపడింది. రిగ్గింగ్ కేంద్రం పక్కనే ఉన్న పొలాల్లోకి బురదతో కూడిన క్రూడాయిల్ పడటంతో గ్రామస్తలు భయంతో వణికిపోయారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని, అగ్నికీలలు చుట్టుముడతాయేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు. -
కృష్ణాలో గ్యాస్ లీకు
కృత్తివెన్ను (కృష్ణా జిల్లా): ఓఎన్జీసీకి చెందిన గ్యాస్ పైప్‌లైన్‌లో లీకేజీ వచ్చింది. దీంతో గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్ద మొత్తంలో ఎగిసిపడుతోంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. పైప్‌లైన్‌లో ఏర్పడిన లీకేజీ నుంచి గ్యాస్, క్రూడ్ ఆయిల్ పెద్దమొత్తం ఎగిసిపడి పంట పొలాల్లో పడుతోంది. దీంతో రైతులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆందోళనకు దిగారు. మంటలు చెలరేగితే నష్టం భారీగా ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. పంట నష్టాన్ని చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, రాజమండ్రి నుంచి ఓఎన్జీసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకోవాల్సి ఉంది. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.


