విజయవాడ : కృష్ణాజిల్లా కృత్తివెన్ను మండలం చినపాండ్రాకలోని ఓఎన్జీసీ ప్లాంట్ నుంచి మరోసారి గ్యాస్ లీక్ అయింది. ఓఎస్జీసీ అధికారులు గ్యాస్ పైప్లైన్కు మరమ్మతులకు ఆదేశించారు. రెవిన్యూ అధికారుల సమక్షంలో గ్యాస్ లీకేజీని సిబ్బంది అదుపు చేస్తున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాబు మాట్లాడుతూ గ్రామస్తులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. గ్యాస్ లీకేజీ వల్ల నష్టపోయిన పంటకు నష్టపరిహారం చెల్లిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కాగా ఓఎన్జీసీ రిగ్ పనిచేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు నిన్న సాయంత్రం లీకేజీ ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో క్రూడాయిల్, బురద ఉవ్వెత్తున ఎగసిపడింది. రిగ్గింగ్ కేంద్రం పక్కనే ఉన్న పొలాల్లోకి బురదతో కూడిన క్రూడాయిల్ పడటంతో గ్రామస్తలు భయంతో వణికిపోయారు. ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని, అగ్నికీలలు చుట్టుముడతాయేమోనని భయంతో బిక్కుబిక్కుమంటూ గడిపారు.
నష్టపోయిన పంటకు పరిహారం :కృష్ణా జిల్లా కలెక్టర్
Published Mon, Feb 23 2015 9:35 AM | Last Updated on Sat, Sep 2 2017 9:47 PM
Advertisement