రాష్ట్రంలో కెయిర్న్ రూ. 4,500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్: కృష్ణా జిల్లా నాగాయలంక ప్రాంతంలో కెయిర్న్ ఇండియా కనుగొన్న బావులు వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించడానికి డెరైక్టర్ జనరల్ ఆఫ్ హైడ్రోకార్బన్స్ అనుమతి కోసం ఎదురు చూస్తున్నామని, అనుమతులు లభించగానే వచ్చే ఐదేళ్లలో రూ.4,500 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. కెయిర్న్, ఓఎన్‌జీసీ సంయుక్తంగా కనుగొన్న కేజీ బేసిన్‌లోని ఈ బ్లాక్‌లో అధికస్థాయిలో చమురు, సహజవాయువు నిల్వలు బయటపడ్డాయి. దీనికి సంబంధించి అనుమతుల కోసం ఇప్పటికే డీజీహెచ్‌కు దరఖాస్తు దాఖలు చేశామని, ఇవి రాగానే వెలికితీత పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.