ఓటర్లకు టెక్ కంపెనీల పిలుపు
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.
ఫ్లిప్‌కార్ట్
‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది.
ఈజ్ మై ట్రిప్
‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్‌లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది.
మొబిక్విక్
‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది.
జొమాటో
‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది.
ఓలా
‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు.
స్విగ్గీ
‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది.
ఓయో
‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది.
ర్యాపిడో
క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్‌నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది.
నమ్మ యాత్రి
‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది.
ఇన్‌స్టాగ్రామ్
ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్‌స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment