Bike riders
-
Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
భారీ సంఖ్యలో ఉపాధికి నెలవైన ఐటీ, టెక్నాలజీ కంపెనీలు కీలకమైన లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నాయి. తమ ఉద్యోగులతో పాటు ప్రజలను కూడా ఓటేలా ప్రోత్సహిస్తున్నాయి. ఓటేయడం పౌరుల బాధ్యత మాత్రమే కాదని, సామూహిక సంకల్ప శక్తికి సంకేతమని పేర్కొంటున్నాయి. భవిష్యత్ మార్గనిర్దేశకుల్ని ఎంచుకోవాల్సిన బాధ్యత మనపైనే ఉందని గుర్తు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ముగిసిన నాలుగు విడతల పోలింగ్‌లోనూ టెక్ కంపెనీల ప్రచారం చెప్పుకోదగ్గ రీతిలో పని చేసింది.ఫ్లిప్‌కార్ట్ ‘‘మీ ఓటును ధ్రువీకరించుకున్నారా?’’ అంటూ ప్రముఖ ఈ కామర్స్ పోర్టల్ ఫ్లిప్‌కార్ట్ పోలింగ్ తేదీల్లో ‘ఎక్స్’ వేదికగా యూజర్లను అప్రమత్తం చేస్తూ వస్తోంది. ఈజ్ మై ట్రిప్ ‘‘రోడ్డెక్కండి. లోక్‌సభ ఎన్నికల వేళ మీ మూలాలకు (నియోజకవర్గాలకు) తిరిగి వెళ్లండి. చూడని ప్రదేశాలను అన్వేíÙంచండి’’ అంటూ ఆన్లైన్ ట్రావెల్ సేవల బుకింగ్ కంపెనీ ఈజ్ మై ట్రిప్ పిలుపునిచి్చంది. మొబిక్విక్ ‘‘డిజిటల్ ఆవిష్కరణల నుంచి దేశ భవిత దాకా అన్నీ కేవలం ఒక్క ట్యాప్‌తోనే’’ అంటూ ఫిన్‌టెక్ సంస్థ మొబిక్విక్ ‘ఎక్స్’ పోస్ట్ ద్వారా ఓటింగ్ హక్కు వినియోగ ప్రాధాన్యతను గుర్తు చేసింది. జొమాటో ‘‘ఎవరు నాయకత్వం వహించాలో ఓటుతో నిర్ణయించడం కంటే ఏం తినాలో నిర్ణయించుకోవడం అంత ముఖ్యమేమీ కాదు’’ అంటూ ప్రముఖ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫాం జొమాటో కూడా ఎక్స్ ద్వారా తన కస్టమర్లకు ఓటు సందేశం ఇచి్చంది. ఓలా ‘‘మన తాతలు స్వాతంత్య్రం కోసం పోరాడారు. మన తల్లిదండ్రులు రోటి, కపడా, మకాన్ కోసం పోరాటం చేశారు. మన కలలకు తగ్గట్టుగా దేశాన్ని నిర్మించడం మన తరం బాధ్యత’’ అంటూ లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓలా సీఈవో భవీశ్ అగర్వాల్ ఎక్స్ ద్వారా కోరారు. స్విగ్గీ ‘‘తర్వాత ఏం తినాలా అంటూ గంటల తరబడి సమయం వెచి్చంచేవారు తదుపరి ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు సైతం అంతే సమయాన్ని కేటాయించాలి’’ అని ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ పిలుపునిచి్చంది. ఈ మేరకు వీడియో సందేశం విడుదల చేసింది. ఓయో ‘‘సరైన ప్రభుత్వం కొలువుదీరేలా చూడండి. వెళ్లి ఓటు వేయండి’’ అని హోటల్ బుకింగ్ సేవల యాప్ ఓయో కోరింది. ర్యాపిడో క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడో పోలింగ్ కేంద్రాలకు వెళ్లే వారి కోసం ఉచిత రైడ్లు ఆఫర్ చేస్తోంది. ఇందుకోసం వోట్నౌ కూపన్ వాడుకోవాలని సూచించింది. ‘‘ఓటేయడం మీ బాధ్యత. మిమ్మల్ని పోలింగ్ బూత్‌కు చేర్చడం మా బాధ్యత’’ అని ఎక్స్‌లో పోస్ట్ పెట్టింది. నమ్మ యాత్రి ‘‘మీ దేశ తదుపరి గమ్యస్థానం కేవలం ఒక ప్రెస్ (క్లిక్) దూరంలోనే ఉంది’’ అంటూ క్యాబ్ సేవలను ఆఫర్ చేసే బెంగళూరు కంపెనీ నమ్మయాత్రి ఓటర్లకు ఇచి్చన సందేశానికి నగరంలో పోలింగ్ సందర్భంగా బాగా ఆదరణ లభించింది. ఇన్స్టాగ్రామ్ ఎన్నికల్లో ఓటర్ల భాగస్వామ్యాన్ని పెంచేందుకు సోషల్ మీడియా యాప్ ఇన్స్టాగ్రామ్ సైతం ప్రయతి్నస్తోంది. పోలింగ్ రోజున ఇన్స్టాగ్రామ్ యాప్‌లో సందేశాల ద్వారా యూజర్లను అప్రమత్తం చేస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వాహనదారులకు షాక్ : శాశ్వతంగా లైసెన్సు రద్దు
సాక్షి,హైదరాబాద్: భారీ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నా..అనేకమంది ద్విచక్రవాహనదారుల ప్రాణాలు పోతున్నా..లైట్ తీసుకుంటున్నారా? హెల్మెట్ లేకుండానే ప్రయాణిస్తున్నారా? ఆఫీసుకు ఆలస్యం అవుతోందని, ఏమవుతుందిలే.. చలానా కట్టేద్దాంలే అంటూ నిర్లక్ష్యంగా బైక్‌తో రోడ్డెక్కుతున్నారా? అయితే మీకు భారీ ఝలక్ తప్పదు. ద్విచక్రవాహనదారులకు షాకిచ్చేలా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. హెల్మెట్ లేకుండా బండి నడిపితే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దుచేస్తామని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇకపై హెల్మెట్ ధరించకుండా బైక్ నడపుతూ పట్టుబడితే రూ.100 చలానాతో సరిపెట్టబోమని, డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని పేర్కొన్నారు. దీనికి సంబంధించి సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ఒక షార్ట్ వీడియోను రిలీజ్ చేశారు. మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దవుతుందని ట్రాఫిక్ పోలీసుల విభాగం స్పష్టం చేసింది. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తూ మొదటిసారి పట్టుబడితే మూడు నెలలు, రెండోసారి కూడా దొరికిపోతే శాశ్వతంగా డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయడానికి సంబంధిత ఆర్టీవో అధికారులకు సిఫారసు చేస్తామని పోలీసులు స్పష్టం చేశారు. అంతేకాదు నాణ్యమైన హెల్మెట్లుధరించాలని.. బైక్ నడపుతున్న వ్యక్తితోపాటు వెనుక కూర్చున్న వ్యక్తి సైతం హెల్మెట్ ధరించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ప్రయాణానికి భరోసా కల్పించుకోవాలని, అలాగే రోడ్డు భద్రతలో తమతో సహకరించాని కోరారు. తద్వారా ప్రమాదాలను నివారించడంతోపాటు, చలానాల నుంచి తప్పించుకోవచ్చని తెలిపారు మోటారు వాహనాల సవరణ చట్టం 2019, సెక్షన్ 206 (4) ప్రకారం హెల్మెట్ లేకుండా బండి నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయబడుతుంది.#RoadSafety #RoadSafetyCyberabad@cyberabadpolice @TelanganaCOPs pic.twitter.com/AWbxWDLTZM — CYBERABAD TRAFFIC POLICE సైబరాబాద్ ట్రాఫిక్ పోలీస్ (@CYBTRAFFIC) February 19, 2021 -
పాతబస్తీలో మైనర్ బైక్ రైడర్స్ హల్చల్
-
విమెన్ బైక్ రైడర్లకు కేసీఆర్ అభినందనలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ విమెన్ బైక్‌రైడర్స్ జయ్ భారతి, శాంతి సుసన్, శిల్పా బాలకృష్ణన్, పియా బహదూర్ 6 దేశాల్లో 56 రోజులపాటు 17 వేల కిలోమీటర్ల బైక్ యాత్రను ముగించుకున్న సందర్భంగా శనివారం ఇక్కడ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ వారిని అభినందించారు. ఫిబ్రవరి 18న పర్యాటకభవన్ నుంచి యాత్రను ప్రారంభించి భారత్, మయన్మార్, థాయ్‌లాండ్, లావోస్, వియత్నాం, కంబోడియా దేశాల్లో పర్యటించారు. ఏప్రిల్ 8న వారు తిరిగి భారత్‌కు చేరుకున్నారు. -
తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై.. రయ్ రయ్!
-
తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై.. రయ్ రయ్!
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పేర్కొంది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్లో వివరాలు వెల్లడించారు. తెలుగు తల్లి ఫై ఓవర్- లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఆయిల్ ప్రభావం కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు 30 బైకుల వరకు ఫ్లై ఓవర్ ప్రాంతంలో బైకులు స్కిడ్ అయి (జారిపోయి) పడటంతో కొందరు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి. దీంతో కొన్ని గంటలపాటు ఫ్లై ఓవర్ పైకి వాహనాల రాకపోకలను నిలిపివేశారు. చిరు జల్లులు పడటంతో దుమ్ము, దూళి అంతా కలిసి నూనే వ్యర్థాలుగా మారడంతో వాహనదారులు బైక్‌తో సహా కింద పడిపోయారు. సోషల్ మీడియాలో ఇంకా ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని, కానీ ప్రస్తుం ఫ్లై ఓవర్‌పై వాహనాలు తిరుగుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియోను పోస్ట్ చేశారు. -
షాకిచ్చిన చిరుజల్లు.. ప్లైఓవర్ పైకి నో
సాక్షి, హైదరాబాద్ : నిత్యం తీరిక లేకుండా గడిపే నగర వాసుల పరుగుకు కొద్ది సేపు బ్రేక్ పడింది. ముఖ్యంగా రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్ రైడర్లకు (ద్విచక్ర వాహనదారులు) కళ్లెం పడింది. దాదాపు ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో అనుకోని అతిథిలా చిరుజల్లు వచ్చి వారిని కొద్దిసేపు పరేషాన్ చేసింది. వారితో కొద్దిసేపు అడుకున్నట్లుగా కిందపడేసి నవ్విపోయింది. అవును.. శుక్రవారం ఉదయం నగరాన్ని కొన్ని చోట్ల చిరు చినుకులు పలకరించాయి. ముఖ్యంగా విద్యానగర్ నుంచి ఖైరతాబాద్ వరకు పడిపడనట్లుగా చినుకులు రాలాయి. దాంతో రోడ్డుపై ఉన్న దుమ్ముధూళి కాస్త కొంత జిగట రూపాన్ని సంతరించుకొని రోడ్డుపై పరుచుకుంది. ఇది గమనించని బైక్ రైడర్లు, ఇతర వాహనదారులు తమ కార్యాలయాల వేళవుతుందనే కంగారులో రయ్‌మంటూ దూసుకెళ్లారు. అయితే, అనూహ్యంగా వారి వాహనాలు జారిపోవడం ప్రారంభించాయి. దాదాపు బ్రేక్ వేసిన ప్రతి బైక్ రైడర్ల చేతులో నుంచి అదుపు తప్పింది. విద్యానగర్ నుంచి మొదలుకుంటే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు కూడా బైక్‌లు జారిపోవడం ముందు బైక్‌లకు తగలడం ఇలా వరుసగా జరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు కాస్త బరువెక్కుండే బైక్‌లు కావడంతో మరింతగా జారిపోయాయి. కొంతమంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై బైక్‌లు ఏమాత్రం కంట్రోల్ కాకపోవడంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కాస్త ఫ్లైఓవర్‌పైకి వెళ్లనీయకుండా అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఫ్లైఓవర్ కిందనుంచి పంపించారు. -
దేశం కోసం 15 వేల కిలోమీటర్లు!
మనదేశ బలం ప్రజాస్వామ్యం.ఆ ప్రజాస్వామ్యం బలం ఓటు. ఈ దేశం ఎవరి ఏలికలో ఉండాలో చెప్పాల్సింది ఓటరు. చిత్రమైన విషయం ఏంటంటే... ఓటు విలువ ఓటరుకు తెలియడం లేదు. ఒకవేళ తెలిసినా తన ఓటును వినియోగించుకునేటంత గొప్ప వ్యక్తులు ఎవరూ లేరన్న భావన కావచ్చు. అందుకే నోటాకైనా వేయండి గానీ ఓటు మాత్రం తప్పనిసరిగా వేయండని చెప్పడానికి ఓ యువ సమూహం పెద్ద ప్రయత్నమే చేసింది. ఎపుడూ లేనట్లు ఈసారి ఎన్నికలు ఓ యజ్ఞంలా జరిగాయి. ప్రజలు ఒక వేడుకలో పాల్గొన్నట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతిసారి ఎన్నికలు వేరు, ఈసారి ఎన్నికలు వేరు. ఎన్నో మార్పులు, ఎన్నో విశేషాలు, కొత్త ఓటర్ల ఉత్తేజం అన్నీ కలసి దేశ తలరాతను నిర్దేశించాయి. స్వాతంత్య్రం తర్వాత మొదటి సారి కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు అత్యధికంగా ఓటు వేశారు. మొదటి సారి యువత ఏకమొత్తంగా కదలివచ్చి ఓటువేసింది. అలాగే తొలిసారి ‘నోటా’ ఆప్షన్ చేరింది. మరి ఇదంతా ఉత్తినే సాధ్యమయ్యిందా?! అంటే కాదు. ఈ ఫలితం వెనుక ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు చేశారు. అలాంటి ప్రయత్నాల్లో ఒక విజయవంతమైన ప్రయత్నమే ‘వందేమాతరం బైక్ రైడర్స్’ సుదూర ప్రయాణం. ఇంతకాలం ఓటు వేసే పనిని తప్పించుకోవడానికి చాలా మంది ఒక సాకు చెప్పేవారు. పళ్లు ఊడగొట్టుకోవడానికి ఏ రాయి అయితే ఏం అనేవారు. ఎందుకంటే అభ్యర్థుల్లో ఎవరూ మంచివాళ్లు లేనపుడు ఎవరో ఒక రౌడీనో/అవినీతి పరుడినో/వ్యాపారినో ఎన్నుకోవాల్సిన అవసరం ఏముంది? అనే ప్రశ్న చాలామంది విద్యావంతులైన ఓటర్ల నుంచి వచ్చేది. కానీ ఈసారి వారందరి నోళ్లు మూత పడ్డాయి. ఎందుకంటే నీకు ఎవరూ ఇష్టం లేదు అని చెప్పడానికి కూడా ఓటువేయొచ్చు. అంటే నాకు ఈ దేశం కోసం ఓటువేయాలని ఉంది.. కానీ సరైన అభ్యర్థులు లేరు అని ఓటర్లు ఫీలైనప్పుడు వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేయడానికి ‘నోటా’ అనే బలమైన ఆయుధం దొరికింది. ఈసారి దీనికి 60 లక్షల ఓట్లు పడ్డాయి. అంటే దేశం మొత్తం మీద పోలైన ఓట్లలో 1.1 శాతం ఓట్లు. వందే మాతరం బైక్ రైడర్స్ ‘ఓటు వేయండి... నోటాకైనా పర్లేదు’ అన్న నినాదంతో దేశంలోని నలుమూలలను సందర్శించడం కూడా ఇందుకొక కారణం. ‘ఓటు వేయడానికి కదలండి’ అంటూ ఆ యువ గుంపు అందరినీ కదిలించింది. అనేక నగరాలు, పట్టణాలు, మండలాలు, గ్రామాలు తిరుగుతూ ప్రతిచోటా ఆగుతూ ఓటర్లను అప్రమత్తం చేసింది. ఓటేయాలనే ఉత్సాహం నింపింది. చాలామంది వ్యక్తులు, సంస్థలు ఎన్నో క్యాంపెయిన్లు నడిపినా వందేమాతరం రైడ్ మాత్రం చాలా శక్తివంతమైన క్యాంపెయిన్ అయింది. ఎందుకంటే వీరు నేరుగా విషయాన్ని ఓటరుకే చెప్పారు. ఓటరును ప్రత్యక్షంగా కలిసి ఓటు గురించి తెలిపారు. ఈ టీమ్‌కు మరో ప్రత్యేకత ఉంది. దేశంలో ప్రతి రాష్ర్ట రాజధానిని కలుపుతూ పర్యటించి ఒక సంపూర్ణమైన ప్రచారం నిర్వహించిన ఏకైక గ్రూపు వందేమాతరం రైడర్స్. ఇప్పటి వరకు జరిగిన యూత్ క్యాంపెయిన్లలో ఇదే అతిపెద్దది. విశాఖపట్నం నగరానికి చెందిన భరద్వాజ్ దాయల్కు వచ్చిన ఆలోచన నుంచి ఈ గ్రూపు ఆవిర్భవించింది. ఇందులో ముంబైకి చెందిన క్రిస్టోఫర్, నాడార్ నవీన్ నాయర్, బీదర్‌కు చెందిన జస్ప్రీత్ సింగ్ మోంటీ, గుర్గావ్కు చెందిన రమన్ బాల్యన్ సభ్యులు. మార్చి 15న ప్రారంభమై ఏప్రిల్ 27న ముగిసిన వీరి క్యాంపెయిన్ ఎన్నో ర్యాలీలు, ప్రచార సభలు, శిబిరాలు నిర్వహిస్తూ 15 వేల కిలోమీటర్లు సాగింది. అన్నివేల కిలోమీటర్లు తిరగాలంటే ఎంతో ఖర్చవుతుంది. అదంతా వీరు సొంతంగా పెట్టుకున్న డబ్బే. ఒక్కొక్కరికి లక్షకు పైగా ఖర్చయ్యింది. కానీ దానికి వచ్చిన స్పందన, అది సాధించిన ఫలితాల ముందు ఖర్చు చాలా తక్కువ. దేశంలోని ప్రతి రాష్ర్టంలో ప్రజలను కలిసి, వారిలో ఉత్తేజాన్ని నింపే అవకాశం అందరికీ వస్తుందా? ‘‘ముఖ్యంగా మేము భిన్న రాష్ట్ర్రాల విద్యార్థులకు పోలింగ్ బూత్‌కు వెళ్లే ఉత్సాహాన్నిచ్చాం. ఇంతకుమించిన సామాజిక సేవ, ప్రయత్నం ఏముంటుందిక’’ అంటారు రైడర్స్ సభ్యులు. -
ఒంటరిగా తాగితే దూకుడు ఎక్కువ...
సమూహంతో కలసి కాకుండా ఒంటరిగా మందు కొట్టేవారి ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంటుందట. ఒంటరిగా మందుకొట్టి బైక్ నడిపేవారు ప్రమాదకరమైన వేగంతో దూసుకుపోతారట. సమూహ తాగుబోతులకన్నా ఒంటరి తాగుబోతులే దూకుడుతో ప్రమాదాలను సైతం కొనితెచ్చుకోవడానికి తెగిస్తారట. సమూహంలో ఇతరులతో మాట్లాడుతూ కలసి తాగడం వల్ల దూకుడు స్వభావం తగ్గుతుందని బ్రిటన్‌లోని కెంట్, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీల సైకాలజిస్టులు వెల్లడించారు. మద్యం అలవాటు ఉన్న 18-30 ఏళ్ల వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు పేర్కొన్నారు. -
బైకు వీరులు