
ఒంటరిగా తాగితే దూకుడు ఎక్కువ...
సమూహంతో కలసి కాకుండా ఒంటరిగా మందు కొట్టేవారి ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంటుందట. ఒంటరిగా మందుకొట్టి బైక్ నడిపేవారు ప్రమాదకరమైన వేగంతో దూసుకుపోతారట. సమూహ తాగుబోతులకన్నా ఒంటరి తాగుబోతులే దూకుడుతో ప్రమాదాలను సైతం కొనితెచ్చుకోవడానికి తెగిస్తారట.
సమూహంలో ఇతరులతో మాట్లాడుతూ కలసి తాగడం వల్ల దూకుడు స్వభావం తగ్గుతుందని బ్రిటన్‌లోని కెంట్, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీల సైకాలజిస్టులు వెల్లడించారు. మద్యం అలవాటు ఉన్న 18-30 ఏళ్ల వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు పేర్కొన్నారు.