University of East Anglia
-
8 నిమిషాల్లోనే గుండె వైఫల్యం నిర్ధారణ
లండన్: సంప్రదాయ మ్యాగ్నెటిక్ రెజోనెన్స్ ఇమేజింగ్(ఎంఆర్ఐ) పరీక్ష ద్వారా గుండె వైఫల్యాన్ని గుర్తించేందుకు 20 నిమిషాలకుపైగా సమయం పడుతుంది. కానీ, కేవలం 8 నిమిషాల్లోనే గుర్తించే అత్యాధునిక సాంకేతికతను బ్రిటన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆంగ్లియా పరిశోధకులు అభివృద్ధి చేశారు. అంటే ఎంఆర్ఐ పరీక్షతో పోలిస్తే సగం కంటే తక్కువ సమయంలోనే గుండె వైఫల్యాన్ని నిర్ధారించవచ్చు. దీనివల్ల సమస్యను 8 నిమిషాల్లోనే గుర్తించి, రోగులకు ప్రభావవంతమైన చికిత్స అందించవచ్చని పరిశోధకులు చెప్పారు. ఎంఆర్ఐతో సవివరమైన 4డీ ఫ్లో చిత్రాలను అభివృద్ధి చేసి, గుండె పనితీరును తెలుసుకోవచ్చని అన్నారు. ఈ టెక్నాలజీకి ‘4డీ ఫ్లో ఎంఆర్ఐ’ అని పేరు పెట్టారు. ఇందులో గుండె కవాటాలు, గుండె లోపలికి రక్తప్రవాహాన్ని స్పష్టం చూడవచ్చు. వీటిని బట్టి రోగులకు ఎలాంటి చికిత్స అందించాలన్నది వైద్యులు నిర్ణయించుకోవచ్చు. ఈ పరిశోధన వివరాలను యూరోపియన్ రేడియాలజీ ఎక్స్పరిమెంటల్ పత్రికలో ప్రచురించారు. హార్ట్ ఫెయిల్యూర్‌ను గుర్తించే విషయంలో ఇది విప్లవాత్మకమైన టెక్నాలజీ అని పరిశోధకులు వెల్లడించారు. -
ఉద్యోగాలు ఎందుకు మారుతున్నారో తెలుసా.?
లండన్: అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. అయితే కొత్తదనం కోరుకునే వారే తరచూ ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగిలియా(యూఈఏ) శాస్త్రవేత్తలు.. ఇలా జాబ్‌లు మారడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు. ఎక్కువ మంది తమ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు మారుతుంటే, మరికొంత మంది కొత్తదనం కోసం మారుతున్నట్లు తేలింది. అయితే ఇలా మారే వారిలో వయసు తక్కువగా ఉండి, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారట. అవకాశాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. తమ విద్యార్హతల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు అంతకంటే మంచి పొజిషన్ కోసం వెతుకుతుండగా, ఉద్యోగుల్ని ఎంపిక చేసే సంస్థలు సైతం నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తుండడంతో ఉద్యోగులు సులభంగా ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నారని వివరించారు. -
టోపీలు గాల్లోకి ఎగరేయొద్దు
లండన్: స్నాతకోత్సవం రోజున పట్టభద్రుల పట్టాలు అందుకున్న తర్వాత ఆనందోత్సాహంతో టోపీలు గాల్లోకి ఎగరేస్తుంటారు. ఫొటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతుంటారు. విద్యార్థులు టోపీలు పైకి ఎగరేయడంపై బ్రిటన్ లోని నార్విచ్ లో ఉన్న ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీ(యూఈఏ) నిషేధం విధించింది. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించింది. గాల్లోకి విసిరిన టోపీలు తగిలి ఇటీవల కాలంలో పలువురు విద్యార్థులు గాయపడ్డారని విద్యార్థుల దినపత్రిక 'ది ట్యాబ్' తెలిపింది. ఇలా చేయడం వల్ల గత రెండేళ్లుగా విద్యార్థులు గాయపడుతున్నారని యూనివర్సిటీ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు. విద్యార్థుల ముఖాలకు గాయాలవుతున్నాయని, గతేడాది ఒక విద్యార్థిని ఆస్పత్రికి తరలించాల్సి వచ్చిందని గుర్తు చేశారు. గ్రాడ్యుయేషన్ డే నాడు స్టూడెంట్స్ ఎవరూ గాయలపాలు కాకూడదన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. ఫొటోల కోసం విద్యార్థులు అనవసర రిస్క్ చేయకూడదన్న భావనతో నిషేధం విధించినట్టు వివరణయిచ్చారు. -
అలాంటి బాస్‌లతో అనారోగ్యం!
లండన్: పరిమితికి మించి పనిచేయాలని డిమాండ్ చేసే మేనేజర్లు ఉద్యోగుల ఆరోగ్యానికి హాని చేసే అవ కాశముందని సర్వేలో తేలింది. లండన్‌లోని ఈస్ట్ ఆంగ్లియా వర్సిటీ పరిశోధకులు ఈ అధ్యయనం చేశారు. ‘ఉద్యోగులపై ఒత్తిడి పెంచితే వారు అనారోగ్యంతో గైర్హజరవుతారు. తొలిసారిగా విధులకు హాజరు కావాలనే ఆరాటం, అనారోగ్యం వల్ల గైర్హాజరీ, ‘మార్పుకు యత్నించే నాయక త్వం’ మధ్య సంబంధాన్ని పరిశీలించారు. తొలిదశలో ఈ నాయకత్వంతో ఉద్యోగుల్లో సానుకూల ఫలితాలొచ్చినా, తర్వాత పరిస్థితులు మారాయి. 155 మంది డెన్మార్క్ పోస్టల్ సిబ్బందిపై అధ్యయనం జరపగా సహోద్యోగులకన్నా 14 రోజులుఅధికంగా పనిచేసిన వారిలో అనారోగ్యాన్ని గుర్తించారు. -
ఒంటరిగా తాగితే దూకుడు ఎక్కువ...
సమూహంతో కలసి కాకుండా ఒంటరిగా మందు కొట్టేవారి ప్రవర్తన చాలా తీవ్రంగా ఉంటుందట. ఒంటరిగా మందుకొట్టి బైక్ నడిపేవారు ప్రమాదకరమైన వేగంతో దూసుకుపోతారట. సమూహ తాగుబోతులకన్నా ఒంటరి తాగుబోతులే దూకుడుతో ప్రమాదాలను సైతం కొనితెచ్చుకోవడానికి తెగిస్తారట. సమూహంలో ఇతరులతో మాట్లాడుతూ కలసి తాగడం వల్ల దూకుడు స్వభావం తగ్గుతుందని బ్రిటన్‌లోని కెంట్, ఈస్ట్ ఆంగ్లియా యూనివర్సిటీల సైకాలజిస్టులు వెల్లడించారు. మద్యం అలవాటు ఉన్న 18-30 ఏళ్ల వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయం తేలిందని వారు పేర్కొన్నారు.