
లండన్: అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది ఉద్యోగాలు మారుతుంటారు. అయితే కొత్తదనం కోరుకునే వారే తరచూ ఇలా చేస్తుంటారని శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో వెల్లడైంది. స్విట్జర్లాండ్‌లోని ఈటీహెచ్ జ్యూరిచ్, యూకేలోని యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగిలియా(యూఈఏ) శాస్త్రవేత్తలు.. ఇలా జాబ్‌లు మారడానికి ప్రధాన కారణం ఏంటో తెలుసుకోవడానికి పరిశోధనలు చేశారు. ఎక్కువ మంది తమ వ్యక్తిగత కారణాలతో ఉద్యోగాలు మారుతుంటే, మరికొంత మంది కొత్తదనం కోసం మారుతున్నట్లు తేలింది.
అయితే ఇలా మారే వారిలో వయసు తక్కువగా ఉండి, మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నవారే ఎక్కువగా ఉంటున్నారట. అవకాశాలు కూడా ఇందుకు కారణమవుతున్నాయని చెబుతున్నారు. తమ విద్యార్హతల కంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు అంతకంటే మంచి పొజిషన్ కోసం వెతుకుతుండగా, ఉద్యోగుల్ని ఎంపిక చేసే సంస్థలు సైతం నైపుణ్యాలు కలిగిన అభ్యర్థులకు అవకాశాలు కల్పిస్తుండడంతో ఉద్యోగులు సులభంగా ఒక చోట నుంచి మరో చోటుకు మారుతున్నారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment