నగరంలోని తెలుగు తల్లి ఫ్లై ఓవర్‌పై సమస్యను పరిష్కరించామని, ప్రస్తుతం వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది లేదని హైదరాబాద్ ట్రాఫిక్ విభాగం పేర్కొంది. ఈ మేరకు తమ అధికారిక ట్వీటర్‌లో వివరాలు వెల్లడించారు. తెలుగు తల్లి ఫై ఓవర్- లోయర్ ట్యాంక్ బండ్ ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఆయిల్ ప్రభావం కారణంగా ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. దాదాపు 30 బైకుల వరకు ఫ్లై ఓవర్ ప్రాంతంలో బైకులు స్కిడ్ అయి (జారిపోయి) పడటంతో కొందరు ద్విచక్ర వాహనదారులకు గాయాలయ్యాయి.