
తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై వాహనాలు జారిపడుతుండటంతో అంబేద్కర్ చౌరస్తా వైపు మళ్లించిన ట్రాఫిక్
సాక్షి, హైదరాబాద్ : నిత్యం తీరిక లేకుండా గడిపే నగర వాసుల పరుగుకు కొద్ది సేపు బ్రేక్ పడింది. ముఖ్యంగా రయ్‌మంటూ దూసుకెళ్లే బైక్ రైడర్లకు (ద్విచక్ర వాహనదారులు) కళ్లెం పడింది. దాదాపు ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో అనుకోని అతిథిలా చిరుజల్లు వచ్చి వారిని కొద్దిసేపు పరేషాన్ చేసింది. వారితో కొద్దిసేపు అడుకున్నట్లుగా కిందపడేసి నవ్విపోయింది. అవును.. శుక్రవారం ఉదయం నగరాన్ని కొన్ని చోట్ల చిరు చినుకులు పలకరించాయి. ముఖ్యంగా విద్యానగర్ నుంచి ఖైరతాబాద్ వరకు పడిపడనట్లుగా చినుకులు రాలాయి. దాంతో రోడ్డుపై ఉన్న దుమ్ముధూళి కాస్త కొంత జిగట రూపాన్ని సంతరించుకొని రోడ్డుపై పరుచుకుంది.
ఇది గమనించని బైక్ రైడర్లు, ఇతర వాహనదారులు తమ కార్యాలయాల వేళవుతుందనే కంగారులో రయ్‌మంటూ దూసుకెళ్లారు. అయితే, అనూహ్యంగా వారి వాహనాలు జారిపోవడం ప్రారంభించాయి. దాదాపు బ్రేక్ వేసిన ప్రతి బైక్ రైడర్ల చేతులో నుంచి అదుపు తప్పింది. విద్యానగర్ నుంచి మొదలుకుంటే తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వరకు కూడా బైక్‌లు జారిపోవడం ముందు బైక్‌లకు తగలడం ఇలా వరుసగా జరిగాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌లు కాస్త బరువెక్కుండే బైక్‌లు కావడంతో మరింతగా జారిపోయాయి. కొంతమంది మాత్రం స్వల్పంగా గాయపడ్డారు. ముఖ్యంగా తెలుగు తల్లి ఫ్లైఓవర్‌పై బైక్‌లు ఏమాత్రం కంట్రోల్ కాకపోవడంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు కాస్త ఫ్లైఓవర్‌పైకి వెళ్లనీయకుండా అంబేద్కర్ చౌరస్తా మీదుగా ఫ్లైఓవర్ కిందనుంచి పంపించారు.

తెలుగుతల్లి ఫ్లైఓవర్‌పై వాహనాలు జారిపడుతుండటంతో అంబేద్కర్ చౌరస్తా వైపు మళ్లించిన ట్రాఫిక్
Comments
Please login to add a commentAdd a comment