
సాక్షి,హైదరాబాద్: నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా రానున్న ఐదు రోజుల్లో తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయని తెలిపింది. మంచిర్యాల, పెద్దపల్లి, కామారెడ్డి, ఆదిలాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్లా, నిజామాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాలో భారీ వర్షాలు పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా వర్షపాతం నమోదైన ప్రాంతాలు
చెన్నూర్‌లో 11 సెం.మీ, జూలపల్లిలో 11 సెం.మీ, మాచారెడ్డిలో 10 సెం.మీ, ఉట్నూర్‌లో 9 సెం.మీ, పెగడపల్లి(జగిత్యాల)లో 8 సెం.మీ, సుల్తానాబాద్‌లో 8 సెం.మీ, గంధారిలో 8 సెం. మీ, కామారెడ్డిలో 8 సెం.మీ, సదాశివనగర్‌లో 8 సెం.మీ, గంభీరావ్‌పేటలో 7 సెం.మీ, ఖానా పూర్‌లో 7 సెం.మీ, సిర్పూర్’లో 7 సెం.మీ, కాళేశ్వరం వద్ద 6 సెం.మీ, ముస్తాబాద్‌లో 6 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.