
సాక్షి, హైదరాబాద్: ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగడంతో రాష్ట్రంలో కొన్నిచోట్ల సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారి రాజారావు వెల్లడించారు. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయన్నారు. 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. కామారెడ్డి జిల్లా జుక్కల్‌లో 8 సెంటీమీటర్ల అధిక వర్షపాతం నమోదు కాగా, ఘన్‌పూర్‌లో 6, కోటగిరి, మోర్తాడ్‌లో 5, బిక్నూరు, కమ్మర్‌పల్లి, మద్నూర్, మాచారెడ్డి, తల్లాడల్లో 4 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం రికార్డు అయింది.
Comments
Please login to add a commentAdd a comment