
హైదరాబాద్‌లో అకస్మాత్తుగా మారిన వాతావరణం
హైదరాబాద్ : నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కొన్నిరోజులుగా నిప్పులు చెరిగిన భానుడు గురువారం సాయంత్రానికి చల్లబడ్డాడు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు పలకరించాయి. కూకట్‌పల్లిలో ఉదయం నుంచి వేడిగాలులతో ఉక్కిరిబిక్కిరి అయిన ప్రజలు ఒక్కసారిగా ఉరుములతో కూడిన వర్షం పడటంతో ప్రజలు కాస్త ఉపశమనంగా ఫీల్ అయ్యారు. మాదాపూర్, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ కాలనీ, నిజాంపేట్ పరిసర ప్రాంతాల్లో కూడా వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఈదురు గాలులు, ఉరుములతో కూడిన వర్షం పడింది.