
నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది.
సాక్షి, హైదరాబాద్: నగరంలో పలుచోట్ల వర్షం కురుస్తోంది. ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, హయత్ నగర్, నాగోల్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, అబ్దుల్లాపూర్‌మెట్, బోడుప్పల్, తార్నాక, సికింద్రాబాద్, నాచారం, హబ్సిగూడలో వర్షం పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి మబ్బులు కమ్ముకున్నాయి. వర్షం కారణంగా పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది.
వనస్థలిపురంలో గాలి వాన బీభత్సం సృష్టించింది. గణేష్ దేవాలయం ప్రాంగణంలోని భారీ మర్రి చెట్టు రోడ్డుపై పడటం తో పలు కార్లు ధ్వంసం అయ్యాయి. భారీ ఈదురు గాలులకు పలు కాలనీలు, పార్క్‌ల్లో చెట్లు విరిగిపడ్డాయి. డీఆర్‌ఎఫ్ బృందం, జీహెచ్‌ఎంసీ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు.
