దేశంలోని పలు ప్రాంతాల్లో రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఈ నేపధ్యంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) ఈరోజు (మంగళవారం) తొమ్మిది రాష్ట్రాలకు భారీ వర్ష సూచన జారీ చేసింది. సోమవారం ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం కురిసింది.
మరో ఐదు రోజుల పాటు ఢిల్లీలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనావేసింది. ఈరోజు ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చని తెలిపింది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఈరోజు (మంగళవారం)9 రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జాబితాలో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, గోవా, పంజాబ్, హర్యానా, రాజస్థాన్ ఉన్నాయి. దీంతో పాటు జార్ఖండ్, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, అస్సాం, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్ రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment