భారీ వర్షాలు గుజారాత్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని గిర్ సోమనాథ్, అమ్రేలి, ఖేడా, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, మహిసాగర్, భరూచ్, నర్మద, సూరత్, ఛోటా ఉదేపూర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపధ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్నాయి. వరద నీటిలో చిక్కుకున్న సుమారు 300 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆగస్టు 28న సౌరాష్ట్రలోని కచ్, జామ్‌నగర్, రాజ్‌కోట్, దేవభూమి ద్వారక, జునాగఢ్ పోర్‌బందర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Gujarat Rain: Sardar Sarovar Dam Water Level Rises, all the Gates Opened; Coastal Villages on High Alert…
Whereas Vadodara city & district is on high alert because Ajwa Lake and Vishwamitri River crossed danger mark, causing widespread flooding in the city. pic.twitter.com/6zHM5T5428— ~ Mr_Perfect ~ (@HadkulaTiger1) August 26, 2024
Comments
Please login to add a commentAdd a comment