![Railway Minister Ashwani Vaishnav Comments On Bullet Train - Sakshi](/styles/webp/s3/article_images/2023/11/29/jet.jpg.webp?itok=UGcgDNSE)
photo courtesy :ndtv.com
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్ 2026 ఆగస్టులో అందుబాటులోకి రానుంది. 50 కిలోమీటర్ల నిడివి గల గుజరాత్‌లోని బిల్లిమోరా-సూరత్ సెక్షన్ దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్‌గా రికార్డులకెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
అహ్మదాబాద్-ముంబైల మధ్య నిర్మితమవుతున్న బుల్లెట్ రైల్ కారిడార్ పనులు 2021 సంవత్సరంలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కారిడార్‌లో భాగంగా బిల్లిమోర-సూరత్ సెక్షన్ తొలుత పూర్తవనుంది.
ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులను లక్షా 8 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. ఇందులో రూ.10 వేల కోట్లను కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చెరి రూ.5 వేల కోట్లు భరిస్తున్నాయి. మిగతా సొమ్ము మొత్తం జపాన్ ప్రభుత్వం 0.1శాతం నామినల్ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించింది.
ఇదీచదవండి..ఓలా, ఉబెర్‌లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment