railway minisrer
-
టికెట్ క్యాన్సిలేషన్ ఛార్జీలను ఏం చేస్తారంటే..
వెయిటింగ్‌లిస్ట్‌లోని రైల్ టికెట్ రద్దు చేసినప్పుడు విధించే ఛార్జీలను నిర్వహణ ఖర్చుల కోసం వినియోగిస్తున్నామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. సదరు ఛార్జీలను మినహాయించాలని మోదీ ప్రభుత్వం ఆలోచిస్తోందా? అని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి లోక్‌సభలో లేవనెత్తిన ప్రశ్నకు బదులుగా అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.సీట్ల కొరత కారణంగా రైల్వేలో వెయిటింగ్‌లిస్ట్ టికెట్లు రద్దు అవుతాయి. అయితే ఆ సమయంలో రైల్వే క్యాన్సిలేషన్ ఛార్జీలను విధిస్తుంది. వినియోగదారు ప్రమేయంలేని వాటికి ఛార్జీలు చెల్లించడం సరికాదనే వాదనలు ఎప్పటినుంచో ఉన్నాయి. ఇటీవల సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఇక్రా చౌదరి ఈమేరకు మోదీ ప్రభుత్వం ఇలాంటి ఛార్జీలను మినహాయించేలా ఏదైనా ఆలోచిస్తుందా? అని ప్రశ్నించారు. దానికి బదులుగా రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు.‘రైల్వే ప్యాసింజర్స్ (టికెట్ల రద్దు, ఛార్జీల వాపసు) రూల్స్ 2015 ప్రకారం ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా రద్దు చేసిన వాటితో సహా అన్ని వెయిట్లిస్టింగ్లోని టిక్కెట్ల రద్దుపై క్లర్కేజ్ ఛార్జీ విధిస్తున్నారు. ఒకవేళ సీట్ అలాట్ అవ్వకపోతే టికెట్ రద్దు అవుతుంది. ఈ ఛార్జీలతోపాటు ఇతర వనరుల ద్వారా వచ్చే ఆదాయాన్ని రైల్వే నిర్వహణ ఖర్చులు, ఆస్తుల పునరుద్ధరణ, మూలధన వ్యయం, కస్టమర్ సౌకర్యాలు, ఇతర అభివృద్ధి పనులుకు వినియోగిస్తున్నారు. అప్పటికే సీట్ కన్ఫర్మ్ అయినవారు ఎవరైనా తమ టికెట్ రద్దు చేసుకుంటే ఖాళీగా ఉన్న బెర్త్‌లను వెయిట్‌లిస్ట్‌లోని వారికి అలాట్ చేస్తారు. వెయిట్‌లిస్ట్‌లోని ప్రయాణీకులు ‘వికల్ప్’ స్కీమ్ ద్వారా ప్రత్యామ్నాయ రైలులో కూడా ప్రయాణించే వెసులుబాటు ఉంది’ అని మంత్రి తెలిపారు.ఇదీ చదవండి: పాలసీపై రాబడి ఉండాలా..? వద్దా..?ఏదైనా కారణాల వల్ల రైల్ బయలు దేరడానికంటే 48 గంటల ముందు టికెట్ క్యాన్సిల్ చేస్తే కింది విధంగా ఛార్జీలు విధిస్తారు.ఏసీ ఫస్ట్ క్లాస్/ ఎగ్జిక్యూటివ్ క్లాస్: రూ.240ఏసీ 2-టైర్/ ఫస్ట్ క్లాస్: రూ.200ఏసీ 3-టైర్/ ఏసీ చైర్ కార్/ఏసీ-3 ఎకానమీ: రూ.180స్లీపర్ క్లాస్: రూ.60సెకండ్ క్లాస్: రూ.20 -
బుల్లెట్ ట్రైన్‌పై కీలక విషయం వెల్లడించిన రైల్వే మంత్రి
న్యూఢిల్లీ: దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్ 2026 ఆగస్టులో అందుబాటులోకి రానుంది. 50 కిలోమీటర్ల నిడివి గల గుజరాత్‌లోని బిల్లిమోరా-సూరత్ సెక్షన్ దేశంలో తొలి బుల్లెట్ రైలు సెక్షన్‌గా రికార్డులకెక్కనుంది. ఈ విషయాన్ని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. అహ్మదాబాద్-ముంబైల మధ్య నిర్మితమవుతున్న బుల్లెట్ రైల్ కారిడార్ పనులు 2021 సంవత్సరంలోనే ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ కారిడార్‌లో భాగంగా బిల్లిమోర-సూరత్ సెక్షన్ తొలుత పూర్తవనుంది. ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ పనులను లక్షా 8 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్నారు. ఇందులో రూ.10 వేల కోట్లను కేంద్రం, మహారాష్ట్ర, గుజరాత్ ప్రభుత్వాలు చెరి రూ.5 వేల కోట్లు భరిస్తున్నాయి. మిగతా సొమ్ము మొత్తం జపాన్ ప్రభుత్వం 0.1శాతం నామినల్ వడ్డీతో రుణ సౌకర్యం కల్పించింది. ఇదీచదవండి..ఓలా, ఉబెర్లపై ఢిల్లీ ప్రభుత్వ కీలక నిర్ణయం -
ట్రాక్ మరమ్మతులను పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి
-
రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్
ముంబై: రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని ఏకంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై అవుట్ స్టేషన్ షిగావ్ సమీపంలో రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో తనను రక్షించాలని కోరుతూ ట్విట్టర్లో రైల్వే మినిస్టర్‌కు సందేశాన్ని పంపింది. ఈ ట్వీట్‌ను గమనించిన అధికారులు వెంటనే మహిళకు సహాయం అందించడానికి రంగంలోకి దిగారు. రైలు తదుపరి స్టేషన్‌కు చేరుకునే సరికి రైల్వే పోలీసులు సదరు మహిళ ముందు ప్రత్యక్షమయ్యారు. పోలీసులు వెళ్లి ట్వీట్ చేసిన మహిళను విచారించగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌తో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉండటంతో భయపడి ట్వీట్ చేసినట్లు తెలిపింది. పోలీసులు అతన్ని పక్క భోగీలోకి తీసుకెళ్లారు. అయితే ప్రయాణికులు ఎమర్జెన్సీ సహాయం అవసరమైతే 182 నెంబర్‌కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు. @RailMinIndia plz plz help in tarin no 18030 one male passanger harrassing me at shegaon I am in train terrified — namrata mahajan (@namratamahajan1) November 26, 2015