రక్షించండీ.. అని రైల్వే మంత్రికి ట్వీట్
ముంబై: రైలులో ప్రయాణిస్తున్న ఓ మహిళ తనకు అపాయం ఉంది రక్షించండీ.. అని ఏకంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభుకు ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబై అవుట్ స్టేషన్ షిగావ్ సమీపంలో రైల్లో ఒంటరిగా ప్రయాణిస్తున్న మహిళ ఓ వ్యక్తి ప్రవర్తనపై అనుమానంతో తనను రక్షించాలని కోరుతూ ట్విట్టర్లో రైల్వే మినిస్టర్కు సందేశాన్ని పంపింది. ఈ ట్వీట్ను గమనించిన అధికారులు వెంటనే మహిళకు సహాయం అందించడానికి రంగంలోకి దిగారు. రైలు తదుపరి స్టేషన్కు చేరుకునే సరికి రైల్వే పోలీసులు సదరు మహిళ ముందు ప్రత్యక్షమయ్యారు.
పోలీసులు వెళ్లి ట్వీట్ చేసిన మహిళను విచారించగా వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్తో ప్రయాణిస్తున్న ఓ ప్రయాణికుడి ప్రవర్తన, బాడీ లాంగ్వేజ్ తేడాగా ఉండటంతో భయపడి ట్వీట్ చేసినట్లు తెలిపింది. పోలీసులు అతన్ని పక్క భోగీలోకి తీసుకెళ్లారు. అయితే ప్రయాణికులు ఎమర్జెన్సీ సహాయం అవసరమైతే 182 నెంబర్కు కాల్ చేయాలని పోలీసులు సూచించారు.
@RailMinIndia plz plz help in tarin no 18030 one male passanger harrassing me at shegaon I am in train terrified
— namrata mahajan (@namratamahajan1) November 26, 2015