న్యూఢిల్లీ: దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైతో పాటు పలు ప్రాంతాలకు వాతావరణశాఖ భారీ వర్ష సూచనలు జారీ చేసింది. వర్షాల కోసం వేచిచూస్తున్న జనానికి ఉపశమనం కలగడంతోపాటు ప్రతీరోజు వర్షాలు కురిసే అంచనాలున్నాయి. ఇప్పటికే వర్షాలు కురుస్తున్న రాష్ట్రాల్లో నదులు, కాలువలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
बिहार में 10-12 जुलाई, 2024 के दौरान अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) वर्षा से बहुत भारी (115.5-204.4 मिलीमीटर) वर्षा होने की संभावना है।
Bihar is likely to get isolated heavy (64.5-115.5 mm) to very heavy rainfall (115.5-204.4 mm) during 10th-12th July, 2024. pic.twitter.com/Q3lsEOWQLK— India Meteorological Department (@Indiametdept) July 8, 2024
భారత వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం జూలై 8 నుంచి 12 వరకూ హిమాలయప్రదేశ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, అరుణాచల్‌ప్రదేశ్, అసోం, మేఘాలయ తదితర రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి. అదేవిధంగా జూలై 12 వరకూ జార్ఖండ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర తదితర రాష్టాల్లో భారీ వర్షాలు కురియనున్నాయి.
మరోవైపు భారీ వర్షాల కారణంగా బీహార్‌లోని పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ నేపధ్యంలో రాష్ట్రంలోని పూర్వ్ చంపారణ్, గోపాల్‌గంజ్, పశ్చిమ చంపారణ్ తదితర ప్రాంతాల్లోని పరిస్థితులను ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధికారులతో సమీక్షించారు. భారీ వర్ష సూచనల నేపధ్యంలో ముంబై, ఠాణె, నవీ ముంబైతో పాటు రత్నగిరి, సింధుదుర్గ్ తదితర గ్రామీణ ప్రాంతాల్లో విద్యాలయాలకు సెలవులు ప్రకటించారు.
तटीय कर्नाटक में 08 जुलाई, 2024 को अलग-अलग स्थानों पर भारी (64.5-115.5 मिलीमीटर) से बहुत भारी वर्षा (115.5-204.4 मिलीमीटर) के साथ अत्यंत भारी वर्षा (>204.4 मिलीमीटर) होने की प्रबल संभावना है। pic.twitter.com/7iaS8uRXCl
— India Meteorological Department (@Indiametdept) July 8, 2024
Comments
Please login to add a commentAdd a comment